breaking news
kidnaping case
-
చిత్తూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం
-
కిడ్నాప్‌కి గురయ్యానంటూ హడావిడి చేసిన యూఎస్ మహిళ... చివర్లో ఊహించని ట్విస్ట్
న్యూఢిల్లీ: భారత్‌లోనే ఉంటున్న 27 ఏళ్ల యూఎస్ మహిళ మెక్లాఫిన్ ప్రియుడితో కలిసి తాను కిడ్నిప్‌కి గురయ్యానంటూ నాటకమాడింది. తల్లిదండ్రులనే మోసం చేసి డబ్బు కొట్టేసేందుకు కుట్రపన్నింది. చివరికి సదరు మహిళ, ఆమె ప్రియుడు కటకటాలపాలయ్యారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...భారత్‌లోనే ఉంటున్న 27 ఏళ్ల క్లోయ్ మెక్లాఫిన్ అనే మహిళ తాను కిడ్నాప్‌కి గురయ్యానంటూ జులై 7న తల్లిదండ్రులకు కాల్ చేసింది. వాస్తవానికి మెక్లాఫిన్ రెండేళ్ల క్రితమే ఢిల్లీకి వచ్చింది. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటుంది. ఆమె అమెరికా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసింది. పైగా ఆమె తండ్రి మాజీ ఆర్మీ అధికారి. ఐతే మెకాఫ్టిన్ తన తల్లికి ఫోన్ చేసి తాను అసురక్షిత ప్రాంతంలో ఉన్నానని, తనకు తెలసి వ్యక్తే తనను హింసిస్తున్నాడంటూ చెప్పిందే కానీ తాను ఏ ప్రదేశంలో ఉన్నది చెప్పలేదు. దీంతో ఆమె తల్లి భారత్‌లోని అధికారులను సంప్రదించారు. ఆ తర్వాత యూఎస్ ఎంబసీ ఈ విషయాన్ని న్యూఢిల్లీ పోలీసులకు నివేదించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుని కూలంకషంగా దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు సదరు బాధితురాలు భారత్‌కి వచ్చి రెండున్నర నెలలు తర్వాత కేసు నమోదయ్యినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మెకాఫ్లిన్ జులై 10న మరోసారి తన తల్లితో వాట్సప్ వీడియో కాల్లో మాట్లాడింది. ఐతే ఆమె తన కూతురు గురించి మరొకొంత సమాచారం తెలుసుకునేలోపే కాల్ కట్ అయ్యింది. దీంతో పోలీసులు సదరు యూఎస్ మహిళ తల్లిదండ్రులను గానీ యూఎస్ ఎంబసీని గానీ సంప్రదించలేని అత్యంత నిస్సహాయ స్థితిలో ఉందని భావించి దర్యాప్తును వేగవవంతం చేసింది. ఆమె ఆచూకీ కోసం టెక్నికల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించింది. ఇదిలా ఉండగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు బాధిత మహిళను ఇమ్మిగ్రేషన్ ఫాం(ఆమె విదేశీ పర్యటన తాలుకా డాక్యుమెంట్స్)ని సమర్పించాల్సిందిగా కోరినప్పుడూ... అమె అందించిన చిరునామను ఢిల్లీ పోలీసులకు తెలియజేశారు. అదీగాక ఆమె తన తల్లికి కాల్ చేసిన వీడియో కాల్ని కూడా ట్రాక్ చేయడంతో.. గురుగ్రామ్‌లోని ఒక నైజీరియన్ జాతీయుడైన ఒకోరోఫోర్ చిబుయికే ఒకోరో 31 వద్దకు తీసుకువెళ్లింది. విచారణలో సదరు వ్యక్తి మెకాఫ్లిన్ ప్రియుడని తెలిసింది. సదరు బాధిత మహిళ మెకాఫ్లిన్ తన ప్రియుడితో కలసి ఈ కిడ్నాప్ నాటకానికి తెర లేపిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె వద్ద డబ్బులు అయిపోవడంతోనే ఈ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించారు. వీరిద్దరు ఫేస్బుక్ ద్వారా స్నేహితులయ్యారని, ఒకోరోతో కలిసి ఉండేందుకు ఆమె భారత్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. పాస్‌పోర్ట్‌గానీ, వీసా గానీ లేకుండా ఎక్కువకాలం భారత్‌లోనే ఉన్నందుకు గానూ ఇద్దరి పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: ఇండియానా షాపింగ్ మాల్లో కాల్పులు.. ముగ్గురి మృతి.. దుండగుడి హతం) -
భర్తను కిడ్నాప్ చేశారని భార్య ఫిర్యాదు
అంతర్వేదిపాలెం (సఖినేటిపల్లి) : గుర్తుతెలియని వ్యక్తులు భర్తను కిడ్నాప్ చేసారంటూ గురువారం భార్య ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపిన వివరాలు ప్రకారం, గ్రామంలో మహ్మద్ ఆలీషా మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మెకానిక్ షెడ్ వద్దకు వెళ్తున్నానని భార్య మహ్మద్ అయేషాతో చెప్పి వెళ్లిన ఆలీషా ఇంటికి తిరిగిరాలేదు. రాత్రి 10.30 గంటల సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఏపీ 37 సీవీ 0999 నంబరు తెల్ల కారులో వచ్చి వారి మొబైల్ నుంచి ఆయేషాను ఆమె భర్తతో మాట్లాడించి రూ.ఐదు లక్షలు ఇస్తే వదలిపెడతామని డిమాండ్ చేసి వెళ్లిపోయారు. ఆయేషా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ వెల్లడించారు.