breaking news
Kejejarj
-
పోలీసులకు ప్రత్యేక శిక్షణ
అత్యాచారాల నిరోధంలో భాగంగా... పోలీస్ ఉద్యోగాల భర్తీలో మహిళలకు 20 శాతం రిజర్వేషన్ సీఐడీ పనితీరు భేష్ హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సమాజంలో మహిళలు, బాలికలపై పెరిగిపోతున్న దౌర్జన్యాలను సమర్థంగా నిరోధించడానికి పోలీసులకు ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నట్లు హోం మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. రాష్ర్టంలో పోలీసు శిక్షణా సంస్థల అభిృద్ధికి సంబంధించి సీఐడీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా నేర సంఘటనల్లోనూ మార్పులు వస్తున్నాయని తెలిపారు. పోలీసులను కూడా ఈ మార్పులకు స్పందించేలా చేయడం, కొత్త కేసులను సమర్థంగా ఛేదించడంలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇదే సందర్భంలో మహిళలు, బాలికలపై ఇటీవల పెరిగిపోతున్న దౌర్జన్యాలను అరికట్టడంలో కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో శిక్షణా సంస్థలకు కొదవ లేదని, ఇప్పటికే 25 వేల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. మహిళలకు 20 శాతం అవకాశాలు పోలీసు శాఖలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పోలీసు శాఖలో నియామకాల సందర్భంగా వారికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 10 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండేవన్నారు. పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉందని చెబుతూ, 4,500 మంది పోలీసుల నియామకానికి ప్రభుత్వ అనుమతి లభించిందని తెలిపారు. తాము 8,500 మంది నియామకానికి అనుమతి కోరామని చెప్పారు. కాగా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సీఐడీ బాగా పని చేస్తోందని ఆయన కితాబునిచ్చారు. పోలీసు శిక్షణా విభాగం డీజీపీ శుశాంత్ మహాపాత్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు శిక్షణా కేంద్రాలున్నాయని, మరో ఆరు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లభించడంతో పాటు రూ.160 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలో మరో రెండు జాతీయ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు అనుమతి లభించిందని చెబుతూ, వీటికి స్థలాన్వేషణ జరుగుతోందని ఆయన తెలిపారు. -
చేయనుగాక చేయను
రాజీనామా డిమాండ్‌పై హోం శాఖ మంత్రి పరిషత్‌లో నల్లకండువాలు ప్రదర్శించిన బీజేపీ సాక్షి, బెంగళూరు : ఎలాంటి పరిస్థితిల్లోనూ తాను రాజీనామా చేసేది లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ తేల్చి చెప్పారు. విధానపరిషత్‌లో విపక్ష సభ్యులు శుక్రవారం చేసిన డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. సభా కార్యాక్రమాలకు బీజేపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలు ధరించి హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే విపక్ష నేత కె.ఎస్. ఈశ్వరప్ప మాట్లాడుతూ... ప్రశ్నోతర్త సమయాన్ని వాయిదా వేసి ఫ్రేజర్ టౌన్ ఘటనపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ సభాపతి శంకరమూర్తిని డిమాండ్ చేశారు. ఇందుకు పరిషత్ నేత, మంత్రి ఎస్ఆర్ పాటిల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే సభా కార్యక్రమాలు జరగాలని పేర్కొన్నారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఎమ్మెల్సీ మధుసూదన్ కలుగజేసుకుని ఫ్రేజర్‌టౌన్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కె.జె.జార్జ్ రాజీనామా చేయాలని అన్నారు. ఆయనకు జేడీఎస్, బీజేపీ ఎమ్మెల్సీలు మద్దతు పలికారు. ఇందుకు మంత్రి జార్జ్ సమాధానమిస్తూ ఎవరెన్ని చెప్పినా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించేందుకు హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ అసమర్థతే కారణమంటూ సభ్యులు మండిపడ్డారు. సభాపతి జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.