breaking news
jobs permanent
-
ఏమీ చేయలేక సీఎం కుర్చీలో ఉన్నా!
సాక్షి, చెన్నై : తాను ఏమీ చేయలేని పరిస్థితులలో ఈ కుర్చీలో ఉన్నానని పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో నియమితులైన నర్సులు తమ ఉద్యోగాలను పరి్మనెంట్ చేయాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మంగళవారం సీఎం రంగస్వామిని కలిసేందుకు వచ్చిన నర్సులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వద్ద వీరు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అటు వైపుగా వచ్చిన డీఎంకే ఎమ్మెల్యేలు వారికి మద్దతు ఇచ్చారు. సీఎం రంగస్వామిని కలిసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా నర్సులతో రంగస్వామి మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లగక్కడం గమనార్హం. గతంలో ఉన్న పాలన వేరు, ప్రస్తుతం ఉన్న పాలన వేరని వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలంలో నియమించిన నర్సులను తొలగించాలని అధికారులు తనకు సూచించారని గుర్తుచేశారు. అయితే, తానే మూడు నెలలకు ఒక పర్యాయం కాంట్రాక్టు కాలాన్ని పొడిగిస్తూ వచ్చానని వివరించారు. ఇక్కడున్న వారి ముందు చెప్పడంలో సంకటంగా ఉందంటూ, సీఎం కురీ్చలో ఎందుకు ఉన్నానో అని అసహనం వ్యక్తం చేశారు. సీఎం చెబితే గతంలో అధికారులు చేసే వారని, ఇప్పుడు అలా చేయడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాక్రమాలకు వెళ్లినా, శిలాఫలకంలో తన పేరు ఉందా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అధికారులు అయితే, వీఆర్ఎస్ ఇవ్వాలని కోరుతున్నారని వివరించారు. విద్యుత్ శాఖలో సెలవులపై అనేక మంది అధికారులు వెళ్లిపోయారని గుర్తు చేశారు. తన చేతిలో అధికారం ఉంటే, కరోనా కాలంలో సేవలు అందించిన నర్సుల కాంట్రాక్టు ఐదేళ్లకు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నానని, తన చేతిలో ఏమీ లేదని, అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. -
ఏపీ ప్రభుత్వంలో పనిచేయం..
తమకు తెలంగాణ ప్రభుత్వమే జీతాలివ్వాలి.. విద్యుత్తుసౌధ కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్ పంజగుట్ట: ‘తాము 20 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాం. విభజన నేపథ్యంలో తమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపే యత్నం జరుగుతోంది. మేం అక్కడ పనిచేయం. జీతాలు తెలంగాణ ప్రభుత్వమే ఇవ్వాలి. అక్కడి ప్రభుత్వం తమను ఉద్యోగాల్లోంచి తీసేస్తే పరిస్థితి ఏమిటని’విద్యుత్తుసౌధ కాంట్రాక్టు ఉద్యోగులు ప్రశ్నించారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలంటూ బుధవారం ఉద్యోగులు సౌధ ప్రాంగణంలో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ప్రధానకార్యదర్శి సాయులు మాట్లాడుతూ విభజన నేపథ్యంలో సౌధలో ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం, తెలంగాణకు 42 శాతంగా విభజించారని..అయితే కాంట్రాక్టు ఉద్యోగుల్లో 90శాతం తెలంగాణ వారే ఉన్నార న్నారు. తమలో 150 నుంచి 200 మందిని ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసే యత్నం జరుగుతోందని, అక్కడి ప్రభుత్వం,యాజమాన్యం తమను విధుల్లోనుంచి తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు తీవ్ర సతమతమవుతున్నారన్నారు. విద్యుత్‌సౌధలో కాంట్రాక్టు విధానం రద్దు చేసి..నేరుగా తెలంగాణ ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, విడతల వారీగా ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.