breaking news
jeetan ram manjhi
-
బిహార్‌లో విజయం సాధించిన ప్రముఖులు
పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ హోరాహోరీ ఎన్నికల పోరులో అధికార ఎన్డీయో కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారం చేపట్టనుంది. విపక్ష మహాకూటమి మొత్తంగా 111 స్థానాలకు పరిమితమైంది. బిహార్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నియోజకవర్గాల వారిగా ప్రముఖుల ఫలితాలు: తేజస్వి యాదవ్ (రాఘోపూర్ నియోజకవర్గం): మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సమీప బీజేపీ ప్రత్యర్థి సతీష్ కుమార్‌పై 38,174 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2015లో కూడా తేజస్వి యాదవ్ ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో తేజస్వి తండ్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. జితాన్ రామ్ మంజి (ఇమామ్ గంజ్ నియోజకవర్గం): బిహార్ మాజీ సీఎం, హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 76 ఏళ్ల జితాన్ ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ నరేన్ చైదరిపై 16,034 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జితాన్ 29,408 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శ్రేయాసి సింగ్ (జముయి నియోజకవర్గం): కామన్ వెల్త్ గేమ్స్-2018 స్వర్ణపతక విజేత, ఎస్ షూటర్ శ్రేయాసి సింగ్ బీజేపీ అభ్యర్థిగా బిహార్ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత దిగ్విజయ్ సింగ్ కుమార్తె అయిన శ్రేయాసి సమీప ఆర్జేడీ అభ్యర్థి విజయ్ ప్రకాష్‌పై 41,049 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె అక్టోబర్ 4న బీజేపీలో చేరి జముయి ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచారు. అనంత కుమార్ సింగ్ (మోకామా నియోజకవర్గం): బిహార్‌లో ‘బాహుబలి’ నేతగా పిలువబడే అనంత కుమార్ సింగ్ మోకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 35,750 ఓట్ల మెజార్టీతో సమీప జేడీయూ అభ్యర్థి రాజీవ్ లోచన్ నారాయణ్ సింగ్‌పై గెలుపొందారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితంగా ఉండే అనంత 2015లో ఆర్జేడీలో చేరారు. ఇక ఆయన జేడీయూలో ఉన్నప్పుడు స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
'సీఎం అవుతానని ఊహించలేదు'
పాట్నా: నేను ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రినవుతానని ఊహించలేదని బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జితన్ మంజీ అన్నారు. ముఖ్యమంత్రి కావడం ఆశ్చర్యం కలిగించిందని జీతన్ అన్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేయడం, రాజీనామా ఉపసంహరణకు ఆయన ససేమిరా అనడంతో జేడీయూ కొత్త సీఎంను ప్రకటించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో జితన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రిగా వ్యవహరించిన జితన్ రామ్ మంజీను నితీష్ ఎంపిక చేశారు. జితన్ ఎంపిక కూడా రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగింది. నితీశ్‌కు 68 ఏళ్ల జితన్ అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడనే పేరుంది. జెహానాబాద్ జిల్లాలోని మఖ్దుమ్‌పూర్(ఎస్సీ) నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
నితీశ్ ఔట్, బీహార్ కొత్త సీఎంగా మాఝీ
మోడీ ఎఫెక్ట్ తో ఒక పెద్ద వికెట్ పడిపోయింది. నితీశ్ కుమార్ స్థానంలో బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా జీతన్ రామ్ మాఝీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో బీహార్ లో అధికార జనతాదళ్ యునైటెడ్ ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకునేందుకు ససేమిరా అనడంతో చివరికి జనతాదళ్ యునైటెడ్ మాఝీని పార్టీ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాడు. మాఝీ మక్దూమ్ పురా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం బీహార్ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు నితీశ్ మాఝీని వెంట తీసుకుని వెళ్లి గవర్నర్ ను కలిశారు. ఆ తరువాత తన స్థానంలో మాఝీ సీఎంగా ఉంటారని ప్రకటించారు. బీజేపీ నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి జనతాదళ్ వేరుపడ్డ తరువాత జరిగిన ఎన్నికల్లో మొత్తం నలభై స్థానాల్లో జేడీయూ కేవలం 2 స్థానాలు గెలుచుకుంది. బిజెపి నుంచి వేరుపడాలని నితీశ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన శరద్ యాదవ్ వర్గం ఆయన రాజీనామాను కోరుతోంది. అయితే తన అనుచరుడినే సీఎంగా చేసి నితీశ్ యాదవ్ పై పైఎత్తు వేశారు. మరో వైపు 2015 ఎన్నికల్లో పార్టీ మళ్లీ గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని కూడా నితీశ్ స్పష్టం చేశారు.