breaking news
issues of farmers
-
Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్
నోయిడా: రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్‌ను పాటించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర సంబంధ చట్టం అమలుసహా రైతాంగ కీలక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త బంద్ పాటించాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మంగళవారం ముజఫర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)సహా దేశంలోని అన్ని రైతు సంఘాలు ఆ రోజు భారత్ బంద్‌లో పాల్గొంటాయి. ఆ రోజు రైతులు తమ పొలం పనులకు వెళ్లకండి. ఒక్క రోజు పనులకు సమ్మె పాటించండి. పొలాల్లో అమావాస్య రోజున రైతులు పనులకు వెళ్లరు. అలాగే ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్యే. వర్తకసంఘాలు, రవాణా సంస్థలు ఆరోజు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని కోరుకుంటున్నా. దుకాణాలను మూసేయండి. రైతులు, కార్మికులకు మద్దతుగా నిలబడండి’’ అని తికాయత్ విజ్ఞప్తిచేశారు. -
నటిపై వ్యాఖ్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే
ముంబై: మన దేశంలో చాలామంది ప్రజలు క్రికెటర్లు ఎన్ని పరుగులు చేశారన్న విషయాన్ని లెక్కపెట్టుకుని గుర్త పెట్టుకుంటారు కానీ రైతుల దుస్థితి గురించి ఏమాత్రం పట్టించుకోరని మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ బాబారావు అలియాస్ బచ్చు కడు ఆవేదన వ్యక్తం చేశాడు. అహ్మద్‌నగర్ జిల్లా శ్రీరామ్‌పూర్‌లో జరిగిన రైతుల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 'దేశంలో చాలామంది ప్రజలు క్రికెట్లో సచిన్ టెండుల్కర్ ప్రతి పరుగును లెక్కకట్టి గుర్తు పెట్టుకుంటారు. కానీ పొలాల్లో కష్టపడుతున్న రైతులు గురించి కనీసం ఆలోచించరు' అని కడు అన్నారు. ఇటీవల రైతుల ఆత్యహత్యలపై కడు మాట్లాడుతూ బాలీవుడ్ నటి హేమమాలినిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మద్యంతాగే అలవాటున్నవారే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడం దారుణమని, అలాగైతే హేమమాలిని రోజు మద్యం తాగుతారని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విమర్శలు రాగా, ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. తాను హేమమాలిని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదని, సినిమాల్లో ఆమె మద్యం తాగుతారని చెప్పానని అన్నారు. అమరావతి జిల్లాలోని అచలపూర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.