breaking news
Irresponsible comments
-
దాడులు ఆగటానికి ఇంకాస్తా సమయం పడుతుంది
-
బాధ్యత మరచి మాట్లాడుతున్న కెసిఆర్: జూపూడి
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన సకల జనభేరీ బహిరంగ సభలో కెసిఆర్ ప్రజలు, ప్రజాస్వామ్యం మీద గౌరవంలేకుండా మాట్లాడాన్నారు. జూపూడి సాక్షిటివీతో మాట్లాడుతూ సీమాంధ్రలో జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని ఇంత చులకన చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయని, ఎవరెవరు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసన్నారు. ఉద్యమాన్ని చులకన చేయడం మంచిదికాదన్నారు. యువనేత జగన్మోహన రెడ్డి జైలు నుంచి బయటకు వస్తుంటే జనం లక్షలాది మంది తరలి వచ్చారని చెప్పారు. జగన్ ఒక్కరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారన్న ఆశ, నమ్మకంతో వారు వచ్చారన్నారు.