breaking news
Iranian girl
-
కోరిక తీర్చలేదని...
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో లైంగిక దాడులు, వేధింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా జేఎన్‌యూ విద్యార్థి ఒకరు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ ఇరాన్ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. నిందితుడిని మహ్మద్ కశ్మీరీగా గుర్తించామని..వీరిద్దరూ స్నేహితులేనని పోలీసులు చెప్పారు. గత కొంతకాలంగా కశ్మీరీని బాధిత యువతి పట్టించుకోవడం లేదని సమాచారం. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి తెస్తుండగా అందుకామె నిరాకరించడంతో కశ్మీరీ కక్ష గట్టాడని పోలీసులు వెల్లడించారు. ఇదే విషయమై ఆమెతో వాదనకు దిగిన కశ్మీరీ ఆవేశంతో ఆమె ముఖంపై పిడిగుద్దులతో దాడికి దిగాడు. బాధితురాలు వసంత్‌కుంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
అమెరికా బయట కాలుపెట్టి తిరిగి రాలేక..!
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతంగా చాలామందిని ఇబ్బంది పెడుతోంది. వారి నిజజీవితాలను కూడా కలగా మార్చేస్తోంది. అప్పటి వరకు అమెరికాలో ఉన్నవాళ్లు ట్రంప్ తెచ్చే చిక్కులు తెలియక బయటకు వెళ్లి తిరిగి అమెరికాలో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అందుకు తార్కాణంగా ఇరాన్‌కు చెందిన ఓ యువతి ఫేస్బుక్లో పెట్టిన విషాదకరమైన పోస్ట్ అందరి హృదయాలను కరిగిస్తోంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె పేరు నజానిన్ జినౌర్. గత ఏడేళ్లుగా అమెరికాలోనే ఉంటోంది. ప్రస్తుతం దక్షిణ కరోలినాలోని క్లెమ్సెన్ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ఏటా ఇరాన్లో ఉండే తన తల్లిదండ్రులను చూసేందుకు వెళుతుంటోంది. అందులో భాగంగానే ఈసారి కూడా తల్లి దండ్రుల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే, ట్రంప్ నిర్ణయం వెలువడకముందే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. తనకు అలాంటి పరిస్థితి ఎదురవ్వదులే అని అనుకుంది. అయినా, వాటన్నింటిని కూడా రూమర్లుగానే భావించింది. దీంతో గతంలో మాదిరిగానే ఈ నెల (జనవరి) 20న ఇరాన్‌కు వెళ్లింది. టెహ్రాన్ వెళ్లే సమయంలో ఎంతో సంతోషంగా వెళ్లింది. తల్లిదండ్రులతో సంతోషంగా గడిపింది. బుధవారంనాటికి రూమర్లు మరింత వేగం పుంజుకున్నాయి. వీసా నిబంధనలు మారుతున్నాయంటూ మీడియాలో వార్తలు దర్శనమిచ్చాయి. దీంతో అప్పటికప్పుడు ఆమె టికెట్ బుక్ చేసుకొని దుబాయ్‌కి చేరింది. అక్కడ కొన్నిగంటలు ప్రశ్నించిన తర్వాత వాషింగ్టన్ విమానం కూడా ఎక్కింది. అయితే, అందులోని సిబ్బంది మాత్రం ఆమెను విమానంలో నుంచి దించేశారు. అలా ఆమెకు ఏడేళ్లుగా అమెరికాతో ఉన్న బంధం తెగిపోయినట్లు బాధపడుతూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అమెరికాలోని ఎయిర్ పోర్ట్‌లో ఉన్న తన కారు పరిస్థితి ఏమిటి? ఇంట్లోని తన కుక్క పిల్లలను ఎవరు చూస్తారు? నా ఇల్లు ఎలా? నా వస్తువులు ఎలా? నా ఉద్యోగం ఎటుపోవాలి? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు సందిస్తూ ముగించింది. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)