breaking news
Inter-district thief
-
ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్టు
కరీంనగర్‌క్రైం: వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను జమ్మికుంట, కరీంనగర్ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్‌లోని హెడ్‌క్వార్టర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ సంజీవ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లా దేవరప్పుల మండలం పెద్ద మాడూరు గ్రామానికి చెందిన మాటూరి సంపత్‌గౌడ్(27), తాళ్ల కుమార్(35) నల్గొండ జిల్లా మోత్కూర్ గ్రామానికి చెందిన సిరిగిరి సాయి అలియాస్ సాయిబాబా(23) ఒక ముఠాగా ఏర్పడి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఇళ్ల తాళాలు పగులకొట్టి చోరీలకు పాల్పడ్డారు. తాజాగా ఫిబ్రవరి 23న జమ్మికుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండ్రపల్లి గ్రామంలో పల్లేని మల్హర్రావు ఇంట్లో చోరీకి పాల్పడి 70 వేల విలువ చేసే 47 గ్రాముల బంగారం అభరణాలు, 2600 చోరీ చేశారు. అ ముఠా సభ్యులను పట్టుకునేందుకు సీసీఎస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. జమ్మికుంటలోని మేదరివాడ, రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా తిరుగుతున్న మాటూరి సంపత్‌గౌడ్(27), తాళ్ల కుమార్(35), సాయిబాబా(23) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. వీరి వద్ద బంగారు, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, జమ్మికుంట, సీసీఎస్ సీఐలు ప్రశాంత్‌రెడ్డి, కిరణ్‌కుమార్, ఎస్సైలు శ్రీనివాస్, సాగర్, నాగరాజు పాల్గొన్నారు. -
అంతర జిల్లా దొంగ అరెస్టు
గుంటూరు క్రైం : ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ బి.శ్రీనివాసులు తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లా విజయవాడ పంజా సెంటర్‌కు చెందిన షేక్ మస్తాన్ 2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, ఆంధ్ర రాష్ట్రంలోని విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి పలుమార్లు జైలు శిక్ష అనుభవించాడు. గత ఏడాది జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని కొత్తపేట, అరండల్‌పేట, పట్టాభిపురం పోలీసు స్టేషన్ల పరిధిలోని తొమ్మిది ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డాడు. కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో బుచ్చయ్యతోట 6వలైనుకు చెందిన భవానీకుమారి ఇంట్లో, నెహ్రూనగర్ 9వలైనుకు చెందిన జి.సత్యదేవ్ ఇంట్లో, బుచ్చయ్యతోట 5వలైనుకు చెందిన షేక్ అక్బర్ ఇంట్లో, నెహ్రూనగర్ 3వలైనులోకు చెందిన కాకి రాఘవరావు ఇంట్లో చోరీలకు పాల్పడ్డాడు. అరండల్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో కాకుమాను 6వలైనుకు చెందిన బి.రాఘవరావు ఇంట్లో, కాకుమాను వారితోట 4వలైనుకు చెందిన గోపిశెట్టి వెంకట హనుమంతరావు ఇంట్లో, పట్టాభిపురం పోలీసు స్టేషన్ పరిధిలో కృష్ణనగర్ 2వలైనుకు చెందిన నడింపల్లి సాంబశివరావు, విద్యానగర్ 1వలైనుకు చెందిన కొల్లిపర వెంకట రమణారావు, శ్యామలానగర్ 11వలైనుకు చెందిన పి.శ్రీనివాసరావు ఇళ్లలో కూడా చోరీలు చేశాడు. నిందితుడు మస్తాన్ మంగళవారం లాలాపేటలోని పూల మార్కెట్ సెంటర్లో ఉన్నట్టు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు, కెమెరా, రెండు జతల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో కొత్తపేట సీఐ డి.వెంకన్నచౌదరి, సీసీఎస్ సీఐ ఎ.శివశంకర్, ఎస్ఐ శ్రీనివాసరావు, ఏఎస్ఐ కోటేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుళ్లు సాంబశివరావు, ఆం జనేయులు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.