breaking news
Indian technology companies
-
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ దృష్టి సారించాయి. భారత్ ‘ఇంటెలిజెన్స్ ఎరా’లోకి అడుగుపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేశీయ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా సార్వ¿ౌమత్వం, హైపర్ ప్రోగ్రెస్ దిశగా ముందుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్ టెక్ నేతలు పిలుపునిచ్చారు. డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్ దూసుకెళ్తోందని, స్వదేశీ మౌలిక వసతులు, చౌక డేటా వినియోగంతో ‘ఇంటెలిజెన్స్ సెంచరీ’లో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిలయన్స్ అధినేత అంబానీ, అదానీ గ్రూప్ ఈడీ జీత్ అదానీ, గూుగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ సదస్సులో తెలిపారు. మొబైల్, ఇంటర్నెట్ తరహాలోనే కృత్రిమ మేధను (ఏఐ) చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ప్రతి పౌరుడు, వ్యాపారం, ప్రభుత్వ సరీ్వసులను ఏఐతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. జామ్‌నగర్‌లో గిగావాట్ స్థాయి ఏఐ–రెడీ డేటా సెంటర్ల ఏర్పాటు, 10 గిగావాట్ల వరకు హరిత విద్యుదుత్పత్తి, అతి తక్కువ లేటెన్సీతో దేశవ్యాప్తంగా ఏఐని అందించేలా ఎడ్జ్–కంప్యూట్ వ్యవస్థను నెలకొల్పేందుకు జియో ఇంటెలిజెన్స్ ఈ మొత్తాన్ని వెచి్చంచనున్నట్లు వివరించారు. డీప్‌టెక్, తయారీ, అసంఘటిత రంగం కోసం ఏఐని అందుబాటులోకి తేవడం, ప్రపంచ స్థాయి బహుభాషా ఏఐని రూపొందించడం, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలాంటి అయిదు మార్గదర్శక సూత్రాల ఆధారంగా జియో ఇంటెలిజెన్స్ పని చేస్తుందని చెప్పారు. ‘‘భారత్‌ను జియో ఇంటర్నెట్ యుగానికి అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ యుగానికి అనుసంధానం చేస్తుంది. జియో, రిలయన్స్ కలిసి వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవేవో స్పెక్యులేటివ్ లేదా వేల్యుయేషన్లపరమైన పెట్టుబడులు కావు. రాబోయే అనేక దశాబ్దాల పాటు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. దేశం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే సత్తాను సాధించేందుకు దోహదపడతాయి. డేటా తరహాలోనే ఏఐ ఖర్చుని కూడా మేము గణనీయంగా తగ్గిస్తాం. అద్దె మేధస్సుతో భారత్ ముందుకెళ్లలేదు’’ అని అంబానీ స్పష్టం చేశారు. ఏఐ వ్యూహానికి 3 కీలకాంశాలు: జీత్ అదానీ భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఏఐ సరికొత్త నిర్వచనం ఇస్తుందని అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీత్ అదానీ చెప్పారు. దేశ కృత్రిమ మేథ వ్యూహానికి విద్యుత్, కంప్యూట్–క్లౌడ్, సర్వీసులనే మూడు అంశాలు ప్రదానంగా ఉంటాయన్నారు. ‘‘ఏఐని కోడింగ్ చేస్తారు. కానీ అది పని చేయాలంటే విద్యుత్ భద్రత సాధించడం అవసరం. ఈ విషయంలో పర్యావరణహితమైన విద్యుత్ కీలకంగా ఉంటుంది. క్రిటికల్ ఏఐ వర్క్‌లోడ్‌లను భారత్ స్వదేశంలోనే హోస్ట్ చేయాలి. స్టార్టప్‌లు, విద్యా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు అత్యుత్తమ కంప్యూట్ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి. ఏఐ అనేది ముందుగా దేశ ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. హరిత విద్యుత్ ఆధారిత ఏఐ ప్లాట్‌ఫాం ఏర్పాటునకు అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఇంటెలిజెన్స్ శతాబ్దంలో భారత్ కూడా పాలు పంచుకుంటుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఏఐ సెంచరీలో మౌలిక సదుపాయాలు, మేథస్సు, ప్రమాణాలు, విలు వలపై ఎంత వరకు తన ముద్ర వేస్తుందనేదే ప్రశ్న. కానీ నిస్సందేహంగా భారత్ దీన్ని సాధించగలదు’’ అని చెప్పారు. హైపర్ పురోగతి శకం: గూగుల్ సుందర్ హైపర్ పురోగతి శకానికి కృత్రిమ మేథ నాంది పలికిందని అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. వర్ధమాన దేశాలు నిదానంగా ఉండే సంప్రదాయ వృద్ధి బాటలో కాకుండా ఎకాయెకిన వేగంగా పైకి ఎదిగేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మొదలైన విభాగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందన్నారు. ‘‘ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో నిస్సందేహంగా గణనీయ మార్పులు వస్తాయి. కొన్ని ఆటోమేట్ అవుతాయి. మరికొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుంది. పూర్తిగా సరికొత్త కెరియర్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత మార్పులను అందిపుచ్చుకునేలా వర్కర్ల కోసం గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్‌ని ప్రవేశపెట్టాం. 10 కోట్ల మందికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చాం’’ అని సుందర్ చెప్పారు. -
టెక్ కంపెనీలా.. మజాకా
న్యూఢిల్లీ : టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగమంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అక్కడ పని ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ, ఆ కంపెనీలు అందించే సౌకర్యాలు, ప్రయోజనాలు అలానే ఉంటాయి. ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల ఉన్నప్పటికీ, ఆ కంపెనీలకున్న క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గడం లేదు. తాజాగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ దేశీయ అవుట్ సోర్సింగ్ కంపెనీలకు మరింత పాపులారిటీ పెరిగిందట. దేశీయ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపే ఎంప్లాయిర్స్ జాబితాలో దేశీయ టెక్ కంపెనీల వార్షిక ర్యాంకింగ్స్‌ను పెంచుకున్నాయట. ఈ ర్యాంకులను యూనివర్సమ్స్ యాన్యువల్ సర్వే ఆధారితంగా రూపొందించారు. 50 దేశాల నుంచి 1.3 మిలియన్ పైగా అభ్యర్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. గతేడాది తొలిసారి టాప్ 10 ర్యాంక్ కోల్పోయిన ఇన్ఫోసిస్, తాజాగా మళ్లీ తన ర్యాంకును పునరుద్ధరించుకుని టాప్ 9వ ర్యాంక్‌ను సంపాదించుకుంది. దేశీయ అతిపెద్ద అవుట్సోర్సింగ్ సంస్థ టీసీఎస్, బెంగళూరుకు చెందిన విప్రోలు ఐదు స్థానాలను పెంచుకుని, 13, 20వ ర్యాంకుల్లో నిలిచాయి. మరోవైపు అంతర్జాతీయ ఐటీ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్లు ఈ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్నాయి. వారికి కూడా భారత మార్కెటే అత్యంత కీలకమైనదిగా ఉంది. దేశంలో మరిన్ని వ్యాపారాలను ఏర్పాటుచేయడానికి గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్ సంస్థలు మరిన్ని చర్యలను తీసుకుంటున్నాయని రిపోర్టు తెలిపింది. ఇంటర్నేషనల్ కెరీర్ అత్యంత ముఖ్యమైన కెరీర్ లక్ష్యంగా ఉన్నప్పటికీ, గతేడాది నుంచి అది తగ్గిపోతుందని ఆసియా పసిఫిక్ రీజన్‌లోని యూనివర్సమ్ అడ్వయిజరీ హెడ్ ప్రతీక్ సభర్వాల్ అన్నారు. కేవలం పెద్ద అవుట్సోర్సింగ్ సంస్థలే కాకుండా.. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి సంస్థలు కూడా దేశీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఫ్లిప్‌కార్ట్ 9 స్థానాలు ఎగబాకగా.. రిలయన్స్ 34వ ర్యాంక్ నుంచి 12వ ర్యాంక్‌కు పెరిగింది. బిజినెస్ స్టూడెంట్స్‌కు గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్ సంస్థలు టాప్ 10 ర్యాంకింగ్స్‌లో ఉన్నాయని, వాటి అనంతరం బిజినెస్ విద్యార్థులఇండియన్ ఎంప్లాయిర్స్గా కేవలం దేశీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశీయ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐలు మాత్రమే చోటు దక్కించుకున్నట్టు తాజా సర్వే రిపోర్టు తెలిపింది. -
నాలుగేళ్లలో 2,250 కోట్ల డాలర్లు
అమెరికాకు భారత టెక్నాలజీ కంపెనీల పన్ను చెల్లింపులు న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో భారీ స్థాయిలో పెట్టుబడులను పెడుతున్నాయి. అంతేకాకుండా భారీ స్థాయిలోనే పన్నులు కూడా చెల్లిస్తున్నాయి. 2011-15 ఆర్థిక సంవత్సరంలో భారత టెక్నాలజీ కంపెనీలు 2,250 కోట్ల మేర పన్నులు చెల్లించాయని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. 2011-13 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీలు 200 కోట్ల పెట్టుబడులు పెట్టాయని ఆమె పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,11,000 ఉద్యోగాలను కల్పించాయని వివరించారు. కాగా అమెరికా ప్రభుత్వం హెచ్-1బి వీసాపై 4,000 డాలర్లు, ఎల్1 వీసాపై 4,500 డాలర్ల ప్రత్యేకమైన ఫీజులను విధించింది.


