breaking news
IMRB
-
ఐదుగురిలో ఒక్కరికే టర్మ్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీలకు సంబంధించి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అత్యంత చౌకైనవే అయినప్పటికీ పాలసీదారుల్లో వీటిపై అంతగా అవగాహన ఉండటం లేదు. జీవిత బీమా పాలసీలు తీసుకున్న ప్రతి అయిదుగురిలో ఒక్కరు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీదారులు కావటం గమనార్హం. బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్, కాంటార్ ఐఎంఆర్బీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 15 మెట్రోపాలిటన్, ప్రథమ శ్రేణి నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 4,566 మంది పాల్గొన్నారు. సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో మూడింట రెండొంతుల మంది (సుమారు 65%) జీవిత బీమా పాలసీలు తీసుకున్నప్పటికీ.. వారిలో 21% మంది మాత్ర మే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇక 53% మందికి అసలు టర్మ్ ఇన్సూరెన్స్, దాని ప్రయోజనాల గురించే తెలియదు. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారిలో కూడా 57% మందికి సమ్ అష్యూర్డ్ గురించి అవగాహన లేదు. జీవిత బీమా పాలసీదారుల సంఖ్య, అవగాహన స్థాయి, రిస్కులను ఎదుర్కొనేందుకు మానసిక సంసిద్ధత అంశాల ఆధా రంగా ఇండియా ప్రొటెక్షన్ కోషంట్(ఐపీక్యూ) పేరిట ఈ సర్వే నిర్వహించారు. -
ఎల్జీ హ్యాపియెస్ట్ సిటీగా చండీగఢ్
న్యూఢిల్లీ: సంతోషం, నమ్మకం అనే రెండు అంశాలు భారతీయుల జీవితాల్లో ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాయనే భావన ఆధారంగా ఎల్జీ, ఐఎంఆర్బీ ఇంటర్నేషనల్ ‘ఎల్జీ లైఫ్స్ గుడ్ హ్యాపినెస్’ సర్వేను నిర్వహించాయి. ఈ సర్వేలో హ్యాపియెస్ట్ సిటీగా చండీగఢ్, హ్యాపియెస్ట్ మెట్రోగా ఢిల్లీ నిలిచాయి. చండీగఢ్ తర్వాతి స్థానాల్లో ల క్నో, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఉన్నాయి. ఎల్జీ లైఫ్స్ గుడ్ హ్యాపినెస్ సర్వేలో 16 పట్టణాల్లోని 18-45 ఏళ్ల మధ్యనున్న దాదాపు 2424 మంది పాల్గొన్నారు.