breaking news
hurled
-
ఉత్తరాంద్రను వణికించిన భారీ వర్షం
-
షూ విసిరిన వ్యక్తికి 14 రోజుల కస్టడీ
న్యూ ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై షూ విసిరిన వ్యక్తికి ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. గతవారం ఢిల్లీలో ట్రాఫిక్ యాజమాన్య నిర్వహణలో భాగంగా సరిబేసి సంఖ్యల పద్ధతి అమలుపై కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనపై చెప్పు విసిరిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై సదరు నిందితుడు బెయిల్ కోరగా నిరాకరించిన కోర్టు రెండువారాలపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడు వేద ప్రకాష్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అభిలాష్ మల్హోత్రా తోసిపుచ్చారు. ప్రజలు ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదని, ఇందుకు ప్రతిబంధకంగా శిక్షను అనుభవించాలని తీర్పునిచ్చారు. సరి బేసి సంఖ్య పథకం కోసం ఢిల్లీలో నకిలీ సీఎన్జీ స్టిక్కర్లు పంపిణీ చేశారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్త వేద్ ప్రకాష్... కేజ్రీవాల్ పైకి షూ విసిరాడు. అయితే అది ఆయనకు తగలకుండా తృటిలో తప్పింది. సీఎన్జీతో నడుస్తున్న కార్లకు పథకంనుంచి మినహాయింపు ఇచ్చారని, అటువంటి 'స్కామ్' వీడియో ఆధారాలు తనవద్ద ఉన్నాయని, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోపోవడంతోనే తనకు కేజ్రీవాల్ పై కోపం వచ్చి..షూ విసిరానని నిందితుడు చెప్తున్నాడు. ఒకరోజు కస్టడీ ముగిసిన అనంతరం నిందితుడ్ని కోర్టుకు హాజరు పరచడంతో.. నిందితుడి బెయిల్ పిటిషన్ ను కోర్టు పరిశీలించింది. ఇతరుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండొచ్చని, ప్రజలు ఎన్నుకున్నముఖ్యమంత్రిని, రాజ్యాంగాధికారాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్న కోర్టు... ఇటువంటి చర్యలతో అసంతృప్తిని వ్యక్త పరచడం సరికాదని అభిప్రాయ పడింది. -
ప్రముఖ దేవాలయంలో బాంబుల కలకలం
చెన్నై: తమిళనాడు మధురైలోని మీనాక్షి ఆలయ సమీపంలో బాంబుపేలుడు ఉద్రిక్తతను రాజేసింది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండుగులు బాంబులు విసరడంతో కలకలం మొదలైంది. రెండు గంటల వ్యవధిలో మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. మధుర మీనాక్షి ఆలయంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినపడడంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. వీటిలో ఒకటి మాత్రమే పేలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్దఎత్తున పగిలిన బీరుసీసాలను స్వాధీనం చేసుకున్నామని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. జాతీయ భద్రతాదళాలు (ఎన్ఎస్జీ) ఆలయంలోని భద్రతా ఏర్పాట్లు సమీక్షించిని కొన్ని గంటల తరువాత ఈ సంఘటన చోటు చేసుకుంది. డీఎస్పీ విశ్వనాథన్ తన బృందంతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. సీసీ టీవీ, రక్షణ వ్యవస్థ, స్కానింగ్ పరికరాలను క్షుణ్ణంగా పరీక్షించారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఉగ్రవాద చర్య అయి ఉంటుందనే అనుమానాలను ప్రాథమిక విచారణ అనంతరం వారు తోసిపుచ్చారు. భద్రతా వ్యవస్థలో కొన్నిమార్పులు సూచించిన ఆయన.. ఆలయ సిబ్బంది, భక్తులు మొబైల్ వాడకాన్ని పరిమితం చేయాలని కోరారు. ఆలయం లోపల జామర్ ఏర్పాటు చేయాలన్నారు.