breaking news
Huge Budget Serials
-
రూ. 130 కోట్ల బడ్జెట్‌తో సీరియల్ !.. ఒకవేళ హిట్ కాకుంటే
హిందీ బుల్లితెర ప్రేక్షకులను అలరించే మోస్ట్ పాపులర్ సీరియల్లో 'నాగిని' ఒకటి. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటివరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తెలుగులో కూడా 'నాగిని' మొదటి రెండు సీజన్లను ప్రసారం చేశారు. ఆ సీజన్స్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సీరియల్ ఆరో సీజన్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 విన్నర్ తేజస్వీ ప్రకాష్ ప్రధాన పాత్రలో అలరించనుంది. అయితే తాజాగా ఈ సీరియల్ గురించి ఒక ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ లైఫ్‌లోని ఒక నివేదిక ప్రకారం ఈ సీజన్‌ను రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించినట్లు సమాచారం. ఒకవేళ ఈ సీజన్ అంతగా హిట్ కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి ఈ ఫ్రాంచైజీని ఆపేయాలని భావిస్తుందట నిర్మాత ఎక్తా కపూర్. ఈ భారీ బడ్జెట్‌తో ఒక సినిమానే తీయొచ్చని ఎక్తాకు పలువురు చెప్పినా ఎక్తా కపూర్ వినలేదని తెలుస్తోంది. నాగిని 6లో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని సమాచారం. ఈ సీజన్ ఫిబ్రవరి 12 నుంచి కలర్స్ ఛానెల్లో ప్రతీ శనివారం, ఆదివారం ప్రసారం కానుంది. Apne bhavya roop aur teeno kaal ki shaktiyon se duniya ko bachane aa rahi hai Naagin. Zaroor dekhiye #Naagin6, 12th February se Sat-Sun, raat 8 baje only on #colors.@itsmetejasswi pic.twitter.com/lEs29HCahX — ColorsTV (@ColorsTV) January 31, 2022 -
దూరదర్శన్‌లో భారీ సీరియళ్లు!
న్యూఢిల్లీ: దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ఒకే తరహా మూస కార్యక్రమాలతో విసిగెత్తిన ప్రేక్షకులకు శుభవార్త! ఇకపై బుల్లితెరపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ధారావాహికలను ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాణ్యమైన కార్యక్రమాలను అందచేసే నిర్మాతలతో కలిసి ఆదాయం పంచుకోవాలని దూరదర్శన్ నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం భారీ బడ్జెట్‌తో సీరియళ్లు నిర్మించే నిర్మాతలు ప్రకటనదారులను తెచ్చుకోవచ్చు. ఈ ప్రతిపాదనలను ప్రసార భారతి బోర్డు ఇటీవల ఆమోదించింది. ఆదాయ పంపిణీ విధానం కింద సీరియళ్ల నిర్మాతలు వాటిని దూరదర్శన్‌లో ప్రసారం కోసం ఉచితంగా అందచేయాలి. దీనిద్వారా లభించే ఆదాయాన్ని ప్రత్యేక ఖాతాకు జమచేసి దూరదర్శన్, నిర్మాతలు పంచుకుంటారు. కనీసం ఎయిర్టైం ఖర్చులైనా దూరదర్శన్‌కు దక్కేలా నిబంధన రూపొందించారు.