breaking news
Hollywood Horror
-
భయపెడితే భళా.. బాక్సాఫీస్ గలగలా
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఏ వుడ్ చూసినా హారరే గుడ్ అంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ ట్రెండ్ మనకు మాత్రమే ప్రత్యేకం కాదు. విశ్వవ్యాప్తంగా కూడా సినిమా రూపకర్తలంతా దయ్యాలకు, భయాలకు జై కొడుతున్నారు. మొత్తంగా హాలీవుడ్ హారర్ చిత్రాలతో హాహా కారాలు చేయిస్తోంది.ఈ ఏడాది ఉత్తర అమెరికా టిక్కెట్ల అమ్మకాలలో 17% హర్రర్ చిత్రాలే దక్కించుకున్నాయి ఇది దశాబ్దం క్రితం 4% గా మాత్రమే ఉండడం గమనార్హం. అదేవిధంగా, రెండేళ్ల నుంచి నిర్మాణంలో ఉన్న వాటిలో హర్రర్ చిత్రాల సంఖ్య 21% గా ఉంది. అంటే దాని అర్ధం రానున్న ఏడాది కూడా థియేటర్లలో మరిన్ని హర్రర్ సినిమాలను ప్రేక్షకులు చూడబోతున్నారుకళ్లకు భయం... కనకవర్షంఈ ఏడాది అమెరికా బాక్సాఫీస్ దగ్గర 100 మిలియన్లకు పైగా సంపాదించిన వాటిలో ఒకటి ‘‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్’’కాగా, మరొకటి ‘‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’’ ర్యాన్ కూగ్లర్ పీరియాడికల్ వాంపైర్ చిత్రం ‘‘సిన్నర్స్’’ కూడా 2025లో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది, గిల్లెర్మో డెల్ టోరో తీసిన 120 మిలియన్ డాలర్ల ‘ ఫ్రాంకెన్‌స్టైన్‘, ఆస్ట్రేలియన్ దర్శకురాలు ఆలిస్ మైయో మాకే కొత్త చిత్రం ‘‘ది సర్పెంట్స్ స్కిన్’’.. కూడా హారర్ చిత్రాలే. ది కాంజురింగ్: లాస్ట్ రైట్స్: ప్రపంచవ్యాప్తంగా సుమారు 494 మిలియన్ల డాలర్లు అందుకుందని అంచనా. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన భారీ హిట్ సిన్నర్స్ 367మిలియన్ డాలర్లకు పైగా కొల్లగొట్టింది.కధలెన్నో..కాన్సెప్ట్ ఒక్కటే...ప్రేమలో ఉన్న ఇద్దరు యువతుల గురించి వారి ప్రేమకు అడ్డుగా ఉండే శాపగ్రస్తమైన టాటూ గురించిన కథ ‘‘బఫీ ది వాంపైర్ స్లేయర్’’ టోబీ పోజర్, జాన్ ఆడమ్స్ వారి కుమార్తెలు జేల్డా ల రూపకల్పనలో.. క్యాన్సర్‌తో బాధపడుతున్న టీనేజ్ అమ్మాయి, తన అనారోగ్యాన్ని నయం చేయాలనే ఆశతో ఒక నెక్రోమాన్సర్ను సందర్శించడం తదనంతర పరిణామాలతో ‘‘మదర్ ఆఫ్ ఫ్లైస్’’, రూపొందింది. ఈ సంవత్సరంలో, వచ్చిన ఉత్తమ హారర్ చిత్రంగా ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే డానియెల్ డెడ్‌వైలర్ రూపొందించిన నెమ్మదిగా సాగే హారర్–డ్రామా 40 ఏకర్స్... నల్లజాతి ప్రజల నిర్దిష్ట చారిత్రక గాయాలను ఆధారంగా చేసుకుని రూపొందింది. విచిత్రమైన మలుపులకు పేరొందిన జపనీస్ దర్శకుడు యుటా షిమోట్సు అందించిన బెస్ట్ విషెస్ టూ ఆల్... కూడా హారర్ హిట్స్ జాబితాలో చేరింది. అరుదుగా సినిమాలు తీసే సీన్ బైర్న్ ‘‘డేంజరస్ యానిమల్స్’’మరో సక్సెస్. ఈ సంవత్సరపు ఉత్తమ హారర్ నటనలలో ఒకటిగా కుక్క నటనకు విమర్శకుల ప్రశంసలు పొందిన ‘‘గుడ్ బాయ్’’ ఒక సాధారణ దెయ్యాల ఇంటి కథాంశానికి సరికొత్త రూపం. ‘‘‘సిన్నర్స్‘ తో, దర్శకుడు ర్యాన్ కూగ్లర్ రూపొందించిన చిత్రం ఓ వాంపైర్ కథాంశం. దర్శకుడు ఎమిలీ బ్లిచ్‌ఫెల్ట్æ అందించిన ‘‘ది అగ్లీ స్టెప్‌సిస్టర్‘ కూడా సౌందర్య చికిత్సల నేపధ్యంలో నడిచే హారర్ చిత్రం. అలాగే వెపన్స్ కూడా. అటు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో పాటు, ది ఉమెన్ ఇన్ ది యార్డ్ డెత్ ఆఫ్ ఎ యునికార్న్ వంటి ప్రత్యేకమైన స్వతంత్ర చిత్రాల వరకు విడుదలయ్యాయి, ప్రత్యేకమైన కాన్సెప్ట్ ది మంకీ ఆకట్టుకుంది. బ్లాక్ ఫోన్ 2: బ్రింగ్ హర్ బ్యాక్ వంటివీ ఇదే కోవలోకి వస్తాయి. -
భయపెడదాం!
సకల కళల సమ్మేళనం సినిమా. రకరకాల అంశాలను తమ చిత్ర కథలకు ఇతి వృత్తంగా ఎంచుకుంటున్నారు. అలాగే హీరోకయినా, హీరోయిన్‌కయినా, దర్శక నిర్మాతలకయినా విజయమే ముఖ్యం. అందుకు వాళ్లొక ట్రెండ్‌ను అనుసరించక తప్పదు. ఇప్పుడు కాలం మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పైపైకి పరుగులు పెడుతోంది. ఈ ఆధునిక యుగంలో మూస చిత్రాలకు మనుగడలేదు. హర్రర్ మోహం కొంత కాలంగా హర్రర్ కథా చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. దీంతో దర్శక నిర్మాతలు ఆ తరహా చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. హర్రర్ చిత్రాలకు హీరోల కన్నా కథ నేపథ్యం, సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యం. హీరోయిన్లు ముఖ్యంగా మారారు. ఇటీవల తెరపైకొచ్చిన చిత్రాలను గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఇంతకు ముందు హీరోయిన్లు కుటుంబ కథా చిత్రాల్లో ప్రేమ కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపేవారు. భయపెట్టాలి ప్రస్తుతం వైవిధ్యం ఉందనిపిస్తే ఏ తరహా పాత్ర అయినా పోషించడానికి సిద్ధం అంటున్నారు. అవసరమయితే దెయ్యాలుగా భూతాలుగా భయపెట్టడానికి, అలాంటి పాత్రలకు భయపడటానికి ఓకే అంటున్నారు. ఆ మధ్య ప్రశాంత్ నటించిన షాక్ చిత్రంలో నటి మీనా భయంతో గగ్గోలు పెట్టారు. అంబులి 3డీ చిత్రంలో సనా శెట్టి భయంతో వణికిపోయింది. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని భయపెట్టి నిర్మాతల గల్లాపెట్టెలు నింపినవే. దీంతో ఇలాంటి భూత ప్రేత ఇతివృత్తాలతో చిత్రాలను తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్లు అలాంటి చిత్రాల్లో నటించడానికి సై అంటున్నారు. దర్శకడు సుందర్.సి దెయ్యం ఇతివృత్తంగా అరణ్మణై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో హన్సిక, ఆండ్రియ, రాయ్‌లక్ష్మి దెయ్యం బారినపడి ఎంత భయపడుతారన్నది త్వరలోనే చూడనున్నారు. ప్రస్తుతం సూర్య హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆత్మ ప్రధాన పాత్రగా ఉంటుందట. అయితే ఈ పాత్రలో సూర్య భయపెట్టకుండా నవ్విస్తారట. ఈ చిత్రానికి పూచ్చాండి అనే పేరును నిర్ణయించారు. ఇక వైవిద్యభరిత చిత్రాల దర్శకుడు మిష్కిన్ హర్రర్ బాటనే పట్టారు. ఆయన తాజా చిత్రం పిశాచి. ఈ చిత్రంలో పిశాచి కొత్తగా ఉంటుందట. అంబులి కూడా చిత్ర యూనిట్ తదుపరి చిత్రం కూడా దెయ్యం ఇతివృత్తమే. త్వరలో తెరపైకి ఆలమరం లాంటి మరి కొన్ని హర్రర్ చిత్రాలు రానున్నాయి. పలువురు దర్శకులు హాలీవుడ్ హర్రర్ చిత్రాలను ఉల్టా చేసి తమిళంలో తెరకెక్కించి కాసులు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి కథా చిత్రాల్లో భయం లేదా హాస్యమే ప్రధానాంశంగా ఉంటోంది. ప్రేక్షకులను అలరించడంతో ఈ తరహా చిత్రాల నిర్మాణం అధికం అవుతోందని సినీ పండితులు అంటున్నారు.


