వారసత్వ ఉద్యోగం కోసం హత్య?
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి బస్వాపురంలో రైలు పట్టాలపై యువకుడి మృతదేహం కలకలం రేపింది. కారేపల్లికి చెందిన అజ్మీరా హీరాలాల్(32) అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై శవమై పడి ఉన్నాడు. ఇది గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. మృతుడి కుటుంబంలో గత కొన్ని రోజులుగా సింగరేణి వారసత్వ ఉద్యోగం కోసం వివాదం నడుస్తోంది. తండ్రీ, సోదరితో గొడవలు పడుతున్న హీరాలాల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య, ఏడాది వయసున్న చిన్నారి ఉంది.