breaking news
heartly
-
విద్యుత్ ఉద్యమ అమరవీరులకు నివాళి
కోదాడఅర్బన్: 2000వ సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమంలో అమరులైన వారి సంస్మరణ సభను ఆదివారం కోదాడలోని సుందరయ్య భవనలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి చిత్రపటాలకు సీపీఎం మండల కార్యదర్శి కుక్కడపు ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని పోరాటం చేసినప్పుడు వారిపై చంద్రబాబు దారుణంగా కాల్పులు జరపించాడన్నారు. అమరవీరుల ఉద్యమ స్ఫూర్తిని కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుని సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈదర సత్యనారాయణ, ఎస్.రాధాకృష్ణ, ఎం.ముత్యాలు, జె.నర్సింహారావు, శ్రీను , సాయి, పల్లా నర్సయ్య, షేక్ గౌస్, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ కవితకు ఘనస్వాగతం
చిట్యాల నల్లగొండలో తెలంగాణ జాగృతి దశమ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న ఆ సంఘం అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవితకు చిట్యాలకు చెందిన టీఆర్ఎస్ జిల్లా నాయకులు కూనూరు సంజయ్దాస్గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు జ్ఞాపికను అందజేశారు. అనంతరం నల్లగొండలో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు నాయకులు తరలి వెళ్లారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బైరు శివ, చింతకాయల మహేష్, అమరోజు మధు, నీల మణికంఠ, పుల్లెంల శ్రీకాంత్, అనిల్ పాల్గొన్నారు.