breaking news
Haryana land deal
-
ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా
న్యూఢిల్లీ: హరియాణాలో భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా మంగళవారం ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాదాపు 2 గంటలపాటు ప్రశ్నించారు. 56 ఏళ్ల రాబర్ట్ వాద్రా సెంట్రల్ ఢిల్లీలోని సుజన్సింగ్ పార్కు సమీపంలో ఉన్న తన నివాసం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి నడుచుకుంటూ వచ్చారు.ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసులోకి అడుగుపెట్టారు. ఆయన తరఫు లాయర్లు, భద్రతా సిబ్బందిని ఈడీ అధికారులు లోపలికి అనుమతించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్తూ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు తప్ప మరొకటి కాదన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం మాట్లాడినప్పుడల్లా తమ నోరు నొక్కడానికి, అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్లో మాట్లాడకుండా రాహుల్ని సైతం అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాబర్ట్ వాద్రాపై అసత్య చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ల మధ్య కుదిరిన భూ లావాదేవీకి సంబంధించిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసిందని మోదీ ఆరోపించారు. ఈ వ్యవహారంలో హర్యానా ప్రభుత్వం కోడ్ ఉల్లంఘించలేదని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రధాని పదవిని మోదీ అవమానించారని అన్నారు. ఇకకైన మోదీ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.