breaking news
Gyan Singh Sohanpal
-
ఏజ్ 91అయినా.. ఎన్నికల్లో దిగాడంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కురువృద్ధుడు బరిలోకి దిగాడు. 91 ఏళ్ల వయసులోనూ ఆయన మరోసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నాడు. బెంగాల్ మొత్తం ఎన్నికల్లోనే పోటీ చేస్తున్న వ్యక్తుల్లో అతి పెద్ద వయసుకలిగిన వ్యక్తి ఈయనే. గ్యాన్ సింగ్ సోన్ పాల్ అనే వ్యక్తి ఇప్పటికే పదిసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు పోటీ చేయడం 11వసారి. అందరూ ఆయనను అక్కడ చాచాజీ అని అంటుంటారు. ఖరగ్ పూర్ సర్దార్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. 1982 నుంచి కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సోహన్ పాల్ సొంత ప్రాంతం పంజాబ్ కాగా బెంగాల్‌కు 1900 ప్రాంతంలో వలస వచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేసిన ఆయన తొలిసారి 1969లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. -
91 ఏళ్ల వయస్సులోనూ.. బస్తీమే సవాల్!
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారత ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ అధికారంలో ఉన్న 1962లో ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీచేశారు. వెనుదిగిరి చూస్తే 54 ఏళ్లు గడిచిపోయాయి. ఎన్నికల సమరంలో ఆయన పదికిపైగా విజయాలు సాధించారు. అయినా 91 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ ఎన్నికల గోదా నుంచి ఆయన తప్పుకోలేదు. ఇప్పటికీ అదే ఇనుమడించిన ఉత్సాహంతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆయనే జ్ఞాన్‌సింగ్ సోహన్‌పాల్. 91 ఏళ్ల ఆయన బెంగాల్ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్ సర్దార్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు పోటీగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాంప్రసాద్ తివారీ, అటు బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ బరిలోకి దిగారు. సోహన్‌పాల్ 1977 ఎన్నికల్లో తొలిసారి పరాజయాన్ని ఎదుర్కొన్నారు. అప్పట్లో వామపక్షాల ప్రభంజనంతో బెంగాల్లో కాంగ్రెస్‌లో తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని పరాజయాలు ఎదురైనా ఆయన ప్రత్యక్ష రాజకీయ రంగం నుంచి వైదొలగలేదు. 'ప్రజలకు ఎంతో పనిచేయాల్సి ఉంది. ఎన్నో ప్రాజెక్టులు సగమే పూర్తయ్యాయి. వాటిని పూర్తి చేయాల్సి ఉంది' అని ఉత్సాహంగా చెప్తున్నారు సోహన్‌పాల్. 'చాచా'గా పేరొందిన సోహన్‌పాల్ మరోసారి ప్రజల మద్దతు తనకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖరగ్‌పూర్ పట్టణంలో ప్రతి ఒక్కరూ తనను గుర్తుపడతారని, ప్రజలకు సేవ చేసేందుకు తనకు మరో అవకాశం లభిస్తుందని ముదుసలి వయస్సులోనూ ఉత్సాహం ఏమాత్రం ఈ కాంగ్రెస్ అభ్యర్థి భరోసాగా ఉన్నారు.