breaking news
grandson died
-
మనవడిని కొట్టి చంపిన తాతకు వందేళ్ల జైలు
మొంటానా: మనవడిని కొట్టి చంపిన కేసులో మొంటానాలోని ఎల్లోస్టోన్కు చెందిన ఓ వ్యక్తికి కోర్టు 100 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జేమ్స్ సస్సెర్ జూనియర్ కొడుకు టేట్ చనిపోవడంతో అతడి కొడుకు అలెక్స్ హరీ(12)తాత వద్దకు వచ్చి ఉంటున్నాడు. అదే సమయంలో భార్య పాట్రిసియాకు విడాకులు ఇచ్చేందుకు జేమ్స్ సస్సెర్ సిద్ధమయ్యాడు. అయితే, విడాకుల తర్వాత మనవళ్లను చూసే అవకాశం ఇవ్వనంటూ ఆమె బెదిరించడంతో వెనక్కి తగ్గాడు. మనవడు అలెక్స్ కుటుంబసభ్యుల మాట వినడం లేదని పాట్రిసియా చెప్పడంతో అతడిపై జేమ్స్ సస్సెర్ జూనియర్ ద్వేషం పెంచుకున్నాడు. అప్పటి నుంచి అలెక్స్‌పై అమ్మమ్మ, తాతతోపాటు వారి కొడుకు సస్సెర్(14)కూడా వేధింపులు ప్రారంభించారు. అలెక్స్ అక్కడ గడిపిన రెండేళ్లు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించారు. ఆహారం కూడా సరిగ్గా ఇవ్వలేదు. 2020 ఫిబ్రవరిలో అలెక్స్ హర్లీ(12)చనిపోయాడు. అంతకు ముందు 36 గంటలపాటు అతడిని తీవ్రంగా కొట్టారు. తల భాగం సహా అతడి శరీరం నిండా గాయాలే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రక్షణ ఇవ్వాల్సిన కుటుంబసభ్యులే అభంశుభం తెలియని బాలుడిని క్రూరంగా హింసించి చంపడంపై విచారణ సందర్భంగా జడ్జి బ్రౌన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జేమ్స్ సస్సెర్కు 100 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. అతడి 14 ఏళ్ల కొడుకుకు 18 ఏళ్లు వచ్చే వరకు జువనైల్ డిటెన్షన్ సెంటర్లో, 25 ఏళ్లు వచ్చే వరకు ప్రొబేషన్‌లో గడపాలని తీర్పునిచ్చారు. ఈ కేసులో పాట్రిసియాపై మేలో విచారణ జరగనుంది. -
నేనొస్తున్నా మనవడా!
♦ వడదెబ్బతో బాలుడు మృతి ♦ జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన తాత బొమ్మనహాళ్ : వడదెబ్బతో మనవడు మృతి చెందడంతో జీర్ణించుకోలేకపోయిన తాత కూడా ప్రాణాలొదిలాడు. ఈ హృదయ విదారక సంఘటన బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంగన్న(60) బుధవారం తన మనవడు రమేష్ (13)తో కలిసి పొలంలోకి వెళ్లారు. నాలుగు గంటల సమయంలో రమేష్ వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం బళ్లారికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి చేరేలోగానే మృతిచెందాడు. పొలం నుంచి సాయంత్రం ఇంటికి చేరుకున్న గంగన్నకు ఈ వార్త తెలియడంతో గుండెపోటు వచ్చింది. వెంటనే అతన్ని కూడా బళ్లారికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయాడు.