breaking news
graduate students
-
టిఫిన్‌దాత సుఖీభవ.. థాంక్యూ రాజన్న
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): చదువుపై ధ్యాసపెట్టిన విద్యార్థులు చక్కగా చదువుకోవడానికి మర్యాల రాజన్న అందిస్తున్న అల్పాహారం ఎంతో దోహదపడుతోంది. పరీక్షల్లో మంచిర్యాంకులు సాధించాలనే తపనతో..విద్యార్థులు అదనపు తరగతుల్లో మునిగి ఆకలితో ఉంటున్నారు. కోనాపూర్ గ్రామానికి చెందిన మర్యాల రాజన్న విద్యార్థులకు నాలుగేళ్లక్రితం ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఏడాది మరిన్ని పాఠశాలలకు విస్తరించారు. ప్రస్తుతం మొత్తం 759 మంది విద్యార్థులకు ఈ ఏడాది అల్పాహారం అందించనున్నారు. నాలుగేళ్లక్రితం మొదలైన కార్యక్రమం పదోతరగతి విద్యార్థులతోపాటు, ఇంటర్ విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2016–17 సంవత్సరంలో 129 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలురాయగా వీరికి నాలుగునెలలపాటు అల్పాహారం అందించారు. ఆ తరువాత 2017–18లో 119 మంది, 2018–19లో 99 మంది ప్రస్తుత విద్యాసంవత్సరంలో 88 మంది విద్యార్థులకు అల్పాహారం సమకూరుస్తున్నారు. సారంగాపూర్, బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సారంగాపూర్, బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమం మూడేళ్లక్రితం ప్రారంభించి, ఇంటర్ మొదటి, రెండోసంత్సరం విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ ఏడాది సారంగాపూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 115 మంది, ఇంటర్ రెండో సంవత్సరంలో 77 మంది విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభించారు. బీర్పూర్ జూనియర్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో 163 మంది, ఇంటర్ రెండోసంవత్సరంలో 181 మంది విద్యార్థులకు అల్పాహారం సమకూర్చుతున్నారు. . సారంగాపూర్ మండలంలోని ఇతర ఉన్నత పాఠశాలల్లో.. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులకు గడిచిన మూడేళ్లుగా అల్పాహారం అందిస్తుండగా, ఈ ఏడాది 52 మందికి అందిస్తున్నారు. రంగపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 13 మందికి, అర్పపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 19 మందికి, రేచపల్లి ఉన్నత పాఠశాలలో 51 మంది పదోతరగతి విద్యార్థులకు నాలుగునెలలపాటు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభించారు. మా మంచి రాజన్న కోనాపూర్ గ్రామానికి చెందిన మర్యాల రాజన్న జగిత్యాలలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. విద్యాభివృద్ధికి కొంత ఖర్చు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సమయంలో నాలుగునెలలపాటు అల్పాహారం అందించాలని నిర్ణయించుకున్నారు. ఆయన కుటుంబసభ్యుల సహకారంతో నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అల్పాహారంలో అటుకులు, ఉప్మా, మరమరాలు, మక్క అటుకుల వంటివి అందిస్తున్నారు. వీటిని రుచికరంగా తయారు చేయడానికి అందులోకి కావాల్సిన వస్తువులు పాఠశాలలకు, కళాశాలలకు పంపిస్తున్నారు. కలెక్టర్ ఉత్తేజం స్ఫూర్తి నింపింది కలెక్టర్ పదోతరగతి విద్యార్థులకు అల్పాహారం అందించడానికి ముందుకు రావాలని పిలుపునివ్వడం స్ఫూర్తినిచ్చింది. మనకున్న దానిలో కొంతైన ఇతరులకు ఖర్చు చేస్తే దేవుడు మనకు మరింత మంచి చేస్తాడనేది నా నమ్మకం. అందుకే ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా కొనసాగిస్తా. – మర్యాల రాజన్న చదువుపై శ్రద్ధ పెంచుతుంది రాజన్న సార్ మా కళాశాలలో అల్పాహారం అందిస్తున్నారు. టైంకు తినడంతో మాకు చదువుపై శ్రద్ధపెరుగుతుంది. రాజన్న కుటుంబానికి అంతా మంచి జరగాలి. – తిరుపతి, బైపీసీ, రెండోసంవత్సరం, సారంగాపూర్ థాంక్యూ రాజన్న భవిష్యత్‌లో మేము ఉన్నతంగా ఎదిగితే..మేము రాజన్న సార్ చేపట్టిన కార్యక్రమాన్ని కొనసాగించాలని ఉంది. మాకు అందించే అల్పాహారం చాలా రుచిగా ఉంటుంది. – నవ్య, ఎంపీసీ రెండో సంవత్సరం సారంగాపూర్ జూనియర్ కళాశాల -
నిట్‌లో పెరిగిన పరిశోధకులు
= గతంలో 23 మందికి.. ఈసారి 44 మందికి పీహెచ్డీ = రేపు స్నాతకోత్సవంలో ప్రదానం = ఏర్పాట్లలో నిమగ్నమైన యాజమాన్యం = అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆహ్వాన లేఖలు నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ : వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో పరిశోధకుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది 23మందికి మాత్రమే పీహెచ్డీ రాగా, ఈసారి 44మందికి ప్రదానం చేయనున్నారు. ఈమేరకు మంగళవారం జరగనున్న నిట్ 11వ స్నాతకోత్సవంలో వీరికి పీహెచ్‌డీలు, వివిధ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన ఎనిమిది మందికి బం గారు పతకాలతో పాటు బీటెక్, పీజీ విద్యార్థులు పలువురికి పట్టాలు అందజేస్తారు. కాగా, గత ఏడాది జరిగిన పదో స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిట్ చైర్మన్ దీక్షితులు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఎక్కువ మంది పరిశోధనలపై దృష్టి సారించడం లేదని పేర్కొన్నారు. ఆయన ఉపన్యాస ప్రభావమో లేదా వరంగల్ నిట్ యాజమాన్యమే విద్యార్థులను ప్రోత్సహించిందో తెలియదు కానీ ఈసారి మొత్తం 33మందికి పీహెచ్డీ చేయగా, ఇందులో మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి 12మంది ఉండడం విశేషం. ఇంకా సివి ల్ ఇంజినీరింగ్‌లో ఇద్దరు, ఎలక్ట్రికల్‌లో ఆరుగురు, మెకానికల్‌లో 12 మంది, ఈసీఈలో ఒకరు, కెమికల్ ఇంజనీరింగ్‌లో ఇద్దరు, సీఎస్ఈలో ఇద్దరు, మ్యాథ్స్‌లో ఎనిమిది మంది, హెచ్ఎస్ఎస్లో ఒకరు, ఫిజిక్స్‌లో ఒకరు, కెమిస్ట్రీలో తొమ్మి ది మంది పరిశోధన పూర్తి చేశారు. 8 మందికి గోల్డ్ మెడల్స్ నిట్‌లో బీటెక్ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన వా రిలో ఎనిమిది మందికి కి విభాగాల వారీగా బంగారు పత కాలు ప్రకటించారు. అన్ని విభాగాల్లోనూ పరిశీలించి అత్యధి క మార్కులు సాధించిన వారికి ఇచ్చే నిట్ ఇనిస్టిట్యూట్ గోల్డ్ మెడల్‌కు మెకానికల్ ఇంజినీరింగ్‌లో టాపర్‌గా నిలిచిన పొ న్నపల్లి చైతన్యసాయి ఎంపికయ్యారు. ఆయనతోపాటు మరో ఏడుగురు గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యారు. గౌరవ్జైన్(సివిల్ ఇంజినీరింగ్), లోకేష్ చంద్ర కోడె (ఇఇఇ), అభిమ న్య శ్రీవాత్సవ(ఈఈసీ), ప్రభాత్కుమార్సింగ్(ఎంఎంఈ), గోకుల్ హరిహరన్(కెమికల్ ఇంజినీరింగ్), అమిత్ జోషి (కంప్యూటర్ సైన్స్), ప్రియవతి డి(బయోటెక్నాలజీ)లో బం గారుపతకాలకు ఎంపికయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 506 మందికి పట్టాలు నిట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి 506మంది వి ద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. వీరిలో ఇంజినీరింగ్ స్ట్రక్చర్‌లో 31మంది, జియో టెక్నాలజీలో 12 మంది, ట్రాన్స్‌పోర్టేషన్‌లో 25 మంది, కన్స్రక్షన్ టెక్నాలజీలో 17 మంది, ఎన్విరాన్‌మెంటల్‌లో ఏడుగురు, వాటర్ రిసోర్సెస్‌లో ము గ్గురు, ఈఈఈ పీఈడీలో 27 మంది, పీఎస్ఈలో 28 మం ది, మెకానికల్‌లో థర్మల్‌లో 19 మంది, మాన్పాక్చరింగ్లో 15 మంది, సీఐఎంలో 14 మంది, పీడీడీలో 20 మంది, మెటీరియల్స్ టెక్నాలజీలో ఒకరు, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో 17 మంది ఉన్నారు. ఇంకా ఈసీఈ విభాగం ఈఐలో 18 మంది, వీఎల్‌ఎస్‌ఐలో 16 మంది, ఏసీఎస్లో 23 మంది డిగ్రీలు స్వీకరిస్తారు. ఎంఎంఈ విభాగం ఐఎంలో ఆరుగు రు, ఎంటీలో 11మంది, కెమికల్ ఇంజినీరింగ్ కాప్డ్లో తొ మ్మిది మంది, సీఎస్ఈ విభాగంలో 16 మంది, ఐఎస్‌లో 16 మంది, ఎంబీఏలో 26 మంది, ఎంసిఎలో 38 మంది, ఎమ్మె స్సీ టెక్నాలజీ(ఫిజిక్స్)లో 15 మంది డిగ్రీలు స్వీకరిస్తారు. అలాగే, ఎమ్మెస్సీ అప్లైడ్ మ్యాథ్స్‌లో 22 మంది, మ్యాథమెటిక్స్‌లో 16 మంది, డీడీపీపీలో 19 మంది, ఎంఎంసీఏలో 19 మంది పీజీ విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకోనున్నారు. బీటెక్ కోర్సుల్లో 773 మందికి.. బీటెక్ కోర్సుల్లో సివిల్‌లో 98 మంది, ఈఈఈలో 104 మంది, మెకానికల్‌లో 100మంది, ఈసీఈలో 116 మంది, మెటాలర్జికల్లో 57 మంది, కెమికల్లో 104 మంది, సీఎస్ఈలో 131 మంది, బయో టెక్నాలజీలో 63 మంది కలిపి మొత్తం 773 మంది పట్టాలు అందుకోనున్నారు. ఈ మేరకు బంగారు పతకాలు సాధించిన విద్యార్థులతో పాటు పీజీ, బీటెక్ విద్యార్థులు పట్టాలను మంగళవారం ఉదయం 10గంటల తర్వాత వరంగల్ నిట్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ ఎల్ల కృష్ణా చేతుల మీదుగా వాటిని స్వీకరించనున్నారు. ఈ సంద ర్భంగా విద్యార్థులు కాకుండా వారి తల్లిదండ్రులతో నిట్‌లో సందడి నెలకొననుంది. స్నాతకోత్సవానికి ఏర్పాట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 11వ స్నాతకోత్సవం ఈనెల 15న మంగళవారం ఉదయం నిర్వహించేందుకు యాజమాన్యం, అకడమిక్ బృందం సిద్ధమైంది. నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు, అకడమిక్ డీన్ రమేష్, రిజిస్ట్రార్ ఏఆర్సీ.రెడ్డి, పీఆర్ఓ పులి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. నిట్ ఆడిటోరియంలో స్నాతకోత్సవం జరగనుండగా, హాజరుకావాలని కోరుతూ కలెక్టర్ జి.కిషన్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావుతో పాటు జిల్లాలోని ఎం పీలు, ఎమ్మెల్యేలకు యాజమాన్యం లేఖలు పంపించిం ది. కాగా, స్నాతకోత్సవానికి కేంద్ర మంతి పల్లం రాజు హాజరవుతారని భావించినా ఆయన పర్యటన ఖరారు కాలేదు. దీంతో వరంగల్ నిట్ బోర్డ్ ఆఫ్ ఆప్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణ హాజరై విద్యార్థులకు బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు అందజేయనున్నారు.