breaking news
gps systems
-
సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశం
వాషింగ్టన్: అంతరిక్షం నుంచి భారీ సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రభావంతో జీపీఎస్, మొబైల్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం కలగొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. సౌర తుపాను ప్రభావం భూకక్ష్యలోని ఉపగ్రహాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతరిక్షంలో సంభవించే సౌర తుపానులు అప్పుడప్పుడు భూమిని తాకే సందర్భాలు ఉన్నాయి. గతంలో ఆయా సమయాల్లో శాటిలైట్ సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది కూడా. The long snake-like filament cartwheeled its way off the #Sun in a stunning ballet. The magnetic orientation of this Earth-directed #solarstorm is going to tough to predict. G2-level (possibly G3) conditions may occur if the magnetic field of this storm is oriented southward! pic.twitter.com/SNAZGMmqzi — Dr. Tamitha Skov (@TamithaSkov) July 16, 2022 శక్తివంతమైనదే! జులై 15న సూర్యుడి ఉపరితలంపై శక్తివంతమైన సౌర జ్వాల మొదలైంది. బలమైన ఫొటాన్ల నుంచి వెలువడే రేడియేషన్ విస్పోటనం వల్ల ఇది ఏర్పాడుతుంది. గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఇది. అయితే జులై 20-21 తేదీల మధ్య భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకవచ్చని ముందు నుంచి పరిశోధకులు చెప్తూ వస్తున్నారు. ఎఫెక్ట్.. గతంలో భూమి మీద సౌర తుపానుల ప్రభావం పడింది. సౌర తుపాను కారణంగా ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో ఖగోళ కాంతి ప్రకాశంగా కనిపిస్తుంది. అదే సమయంలో భూ వాతావరణం కూడా వేడక్కే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జీపీఎస్, మొబైల్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీ సేవలకు అంతరాయం ఏర్పడొచ్చు కూడా. -
ఏప్రిల్ 6నుంచి జీపీఎస్ సిస్టమ్స్ పనిచేయవు!
సాక్షి, న్యూఢిల్లీ : గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్).. సమాచార, ప్రసార రంగాల్లో అద్భుత సాంకేతిక విప్లవం. ప్రపంచ మార్గదర్శిగా పేరుగాంచిన ఆవిష్కరణ. ఎక్కడికైనా వెళ్లాలంటే.. దారి తెలియదన్న బాధ లేదు.. ఎలా వెళ్లాలి? అనే టెన్షన్ అవసరం లేదు. ఏ వీధికి ఎలా వెళ్లాలో.. ఎక్కడ ఏ మలుపు తిరగాలో అన్నీ అదే చూపెడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ నుంచి మిలిటరీ వరకూ.. అన్ని విభాగాల్లో విరివిగా వాడుకలో ఉంది. ఫోన్లు, స్మార్ట్ హోం డివైజ్ ల్లో ఎక్కువగా జీపీఎస్ సర్వీసులను వాడుతుంటారు. జీపీఎస్ సర్వీస్‌తో ఎన్నో కంపెనీలు తమ బిజినెస్ ను రన్ చేస్తున్నాయి. విమానాల్లో, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాకుండా మానవుడి దైనందిన జీవితంలో కూడా జీపీఎస్ సేవలు ఉపయోగపడుతున్నాయి. కాగా రానున్న రోజుల్లో జీపీఎస్ బేసిడ్ డివైజ్ ల్లో సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని శాన్ ఫ్రాన్సిస్కొలో ఇటీవల ఏర్పాటు చేసిని ఆర్ఎస్ఏ 2019 సెక్యూరిటీ సమావేశంలో నిపుణులు పేర్కొన్నారు. అంతర్జాతీయ సైబర్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. వైటూకే (Y2K) బగ్ కారణంగా 2019 ఏప్రిల్ 6 నుంచి జీపీఎస్ డివైజ్ లలో సర్వీసులు ఆగిపోనున్నాయి. ఆ లోపు మీ డివైజ్ లను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేందంటే ఇకపై మీ డివైజ్‌లలో జీపీఎస్ సేవలను వినియోగించుకోలేరు. జీపీఎస్ సిస్టమ్స్ ను రీసెట్ చేస్తుండడం వల్ల అప్డేట్ చేసుకోవాలని సూచించారు. తైవానీస్ మల్టీనేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ బిల్ మాలిక్ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 6న విమాన ప్రయాణం చేయననని చెప్పారు. 1999లో జీపీఎస్ రిసెట్ అయినట్లుగా ఏప్రిల్ 6న కూడా అలాగే అవుతుందన్నారు. కానీ ఆ రోజు పరిస్థితి కొంచెం అధ్వాన్నంగా ఉండోచ్చునని హెచ్చరించారు. జీపీఎస్ డివైజ్‌లలో కంప్యూటర్ క్యాలెండర్ టైమ్ ముగిసిందని. ఇప్పుడు అప్డేట్ చేస్తే ఆటోమాటిగ్గా మళ్లీ పనిచేస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకూ శాటిలైట్ నుంచి వెలువడే జీపీఎస్ సిగ్నల్స్ క్లాక్ టైం స్టాప్ .. వీక్ నంబర్ అనుసంధానంగా పనిచేస్తున్నాయి. జీపీఎస్ సిగ్నల్ లోని వీక్ నంబర్ 10 డిజిట్ బైనరీ కోడ్ రూపంలో స్టోర్ అవుతోంది. బైనరీ కోడ్ 0 నుంచి 1,024 ఇలా ఫామ్ అయి ఉంటుంది. ఈ విధానం ద్వారా జీపీఎస్ సిస్టమ్ ను 1,024 (19.6 సంవత్సరాలు) వీక్స్ గా లెక్కించే అవకాశం ఉంటుంది. అంటే.. 1,024 వీక్స్ పూర్తి కాగానే.. జీపీఎస్ సిస్టమ్ క్లాక్.. ఆటోమాటిక్ గా రీసెట్ అయి మళ్లీ 0 నుంచి కౌంటింగ్ ప్రారంభవుతుంది. గతంలో జీపీఎస్ క్లాక్ 1999, ఆగస్టు 21న రీసెట్ అయింది. దాదాపు 20 ఏళ్ల తరువాత మళ్లీ జీపీఎస్ క్లాక్ రీసెట్ కానుంది. 2010 తర్వాత రిలీజ్ అయిన జీపీఎస్ డివైజ్ ల్లో ఈ కొత్త బైనరీ కోడ్ విధానం పర్ ఫెక్ట్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీలో ఎవరైనా పాత జీపీఎస్ బేసిడ్ సిస్టమ్ ను వాడుతున్నట్టయితే వెంటనే అప్ డేట్ చేసుకోండి.. మీ డివైజ్ తయారీదారులు అప్ డేట్ ను రిలీజ్ చేయకుంటే మాత్రం.. సిస్టమ్ లో కొన్ని సీరియస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. -
2వ తేదీన ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీ
ఆటోలకు నల్లజెండాలు కట్టుకుని ఆటోవాలాలు దేశ రాజధాని నగరంలో జూన్ రెండో తేదీన నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఆటో డ్రైవర్లలో దాదాపు సగం మంది ఆరోజు నిరసనలో పాల్గొంటారు. జీపీఎస్ లేని ఆటోలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీని నిషేధిస్తూ విధించిన నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ వారీ నిరసన చేయబోతున్నారు. ఐఎస్బీటీ నుంచి సచివాలయం వరకు ఢిల్లీ ఆటోరిక్షా సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతుంది. కొన్ని రోజులుగా ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు తాము అపాయింట్మెంట్ కోరుతున్నా, ఆయన అంగీకరించలేదని, ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్న్రర్, సీఎస్ కలిసి ఈ నిబంధన ఎత్తేయాలని ఆటో సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సోనీ డిమాండ్ చేశారు. గుర్గావ్లో జీపీఎస్ పరికరాలు మీటర్లతో కలిపి రూ. 3,500కే దొరుకుతుంటే ఇక్కడ మాత్రం రూ. 13-17 వేల వరకు ఖర్చవుతోందని ఆయన చెప్పారు.