breaking news
gowtami putra satakarni
-
శాతకర్ణిలో ఆ సీన్ చూస్తే అదుర్స్
హైదరాబాద్: షూటింగ్ ప్రారంభమైననాటి నుంచే భారీ అంచనాలను పెంచిన సినిమా గౌతమి పుత్రశాతకర్ణి. ఆ అంచనాలకు తగినట్లుగానే భారీ విజయాన్ని అందుకున్నాడు చిత్ర కథానాయకుడు బాలయ్య. వందో చిత్రం విషయంలో ఎంతో టెన్షన పడిన ఆయన తెలుగువారికి పెద్దగా తెలియని, తెలుగువారు బాగా గర్వించాల్సిన శాతకర్ణి చరిత్రతో సినిమా తీసి శత విజయాన్ని అద్భుతంగా అందుకున్నాడు. ఈ చిత్రం చూసిన వాళ్లంతా ఈ కథను ఎంచుకొని బాలకృష్ణ గొప్పపని చేశాడని అంటున్నారు. అలాగే, కేవలం 79 రోజుల్లోనే ఇంత భారీగా సినిమాను తీయడం ఒక్క క్రిష్‌కు తప్ప మరో దర్శకుడికి సాధ్యం కాదేమో అని కూడా చెబుతున్నారు. మొత్తానికి బాలకృష్ణ ఈ చిత్రంలో సిసలైన తెలుగువాడిగా, గొప్ప దేశభక్తుడిగా కనిపించడమే కాకుండా యుద్ధ సన్నివేశాల్లో విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఓ సన్నివేశం పరిశీలిస్తే .. ఉత్తరభారతాన్ని పరిపాలించే రాజు నహపాణుడిపైకి యుద్ధానికి వెళ్లిన సమయంలో శాతకర్ణి కుమారుడు పులోమావిని నహపాణుడు బందిస్తాడు. ఆ బాలుడి మెడపై కత్తిపెట్టి శాతకర్ణిని సామంతుడిగా మారుతావా బాలుడిని చంపమంటావా.. సమయం లేదు మిత్రమా అంటూ శాతకర్ణికి సవాల్ విసురుతాడు. అప్పటికే యుద్ధంలో శత్రువుల రక్తపు మరకలతో ఎర్రటి కళ్లతో గాంభీరంగా కనిపిస్తున్న శాతకర్ణి లొంగిపోతాడు కావొచ్చు అని ప్రేక్షకుడు అనుకునేలోగా కొదమ సింహంలాగా గుర్రంపై నుంచి దూకుతూనే ఓ సైనికుడి చేతిలోని డాలును అందుకొని విసరడంతో అది ఆ బాలుడి మెడపై కత్తి పెట్టిన వాడి తలను తెంపేస్తుంది. ఆ లోగానే నహపాణుడిని తన ఆదీనంలోకి తీసుకుంటాడు శాతకర్ణి. ఈ సీన్లో బాలకృష్ణ చూపించిన విశ్వరూపానికి థియేటర్లు హోరెత్తుతున్నాయి. -
బాలకృష్ణకు చంద్రబాబు కానుక
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన బావమరిది, ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి కానుక ఇచ్చారు. ఆయన నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపునిచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉత్తర్వును విడుదల చేసింది. ఆంధ్రుల చరిత్ర ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ రూపొందించారు. చిత్రం ప్రారంభమైన సందర్భంలోనే ఈ చిత్రానికి వినోదపు పన్ను మినాహాయింపు కోరాలనే ఆలోచన చేసినట్లు సమాచారం. అమరావతిని రాజధానిగా ఎంచుకుని పరిపాలన గావించిన గొప్ప రాజుకు చెందిన చరిత్రనే సినిమాగా రూపొందించిన నేపథ్యంలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన ఎవరూ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయరనే యోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వినోద పన్నును మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.