gowtam
-
వివాహం వినూత్నం.. ! సంఘ సంస్కర్తలే సాక్షిగా..
పెళ్లి అంటే పూజలు, వేదమంత్రాలు, తాళి, మేళతాళాలు ఉంటాయి. కానీ ఎటువంటి దేవుడి ఫొటోలు లేకుండా సంఘ సంస్కర్తలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, పెరియర్ రామస్వామి, సావిత్రి బాయి పూలే, గౌతమ బుద్ధుని ఫొటోలు పెట్టుకుని ఒకేసారి ఇద్దరు అన్నదమ్ముల వివాహాలు జరిగాయి. పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తె ల అభిప్రాయాల మేరకు బౌద్ధ ఆచార ప్రకారం వివాహం జరిపించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమాలకు కొరవంగి గ్రామం వేదిక అయింది. గ్రామానికి చెందిన అన్నదమ్ములైన సలభంగి చిన్నారావు ఇదే మండలం బొండాపల్లి గ్రామానికి చెందిన శ్యామంతి, సలభంగి సునీల్‌కుమార్ పోయిపల్లి గ్రామానికి చెందిన ఝాన్సీకుమారి వివాహాలను దమ్మ దీక్ష విశాఖపట్నం జిల్లా ప్రతినిధులు బి. గౌతమ్‌బాబు, ఎస్. సింహాద్రి జరిపించారు. అలాగే పాడేరు మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు, బాంసెఫ్ గౌరవ అధ్యక్షుడు ఎం.చిట్టిదొర ధర్మ సందేశం వినిపించారు. అనంతరం వధూవరులు పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశారు. తాము చదువుకున్నప్పటి నుంచి బౌద్ధ ఆచార ప్రకారం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఇదే విధంగా జరిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నదమ్ములైన పెళ్లికొడుకులు తెలిపారు. ఇందుకు బంధువులు కూడా సమ్మతించడం గొప్ప విషయమన్నారు. ఈ వివాహాలు వీవీ దుర్గారావు, కె, సత్యనారాయణ, ఎస్. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగాయి. బాంసెఫ్ ప్రతినిధులు చెండా భీమసుందర్, టీచర్లు కె. సత్యనారాయణ, ఎస్. మత్స్యలింగం పాల్గొన్నారు.(చదవండి: ఏఐ దేవత..! కష్టసుఖాలు వింటుంది, బదులిస్తుంది కూడా..) -
మంచులో చిల్ అవుతున్న మహేశ్‌బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
కిడ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండ శ్రీలీల సినిమా పై క్లారిటీ ఇచ్చిన మూవీ టీం
-
బౌద్ధవాణి: సత్యం పలకడం చాలా అవసరం!
సిద్ధార్థుడు శాక్య యువరాజు. కానీ, సన్యసించి రాజ్యాన్ని వదిలాడు. భిక్షువుగా మారాడు. ఆ తర్వాత తన బిడ్డ రాహులుణ్ణి కూడా భిక్షువుగా మార్చాడు. ఒకరోజున రాహులుడు అంబలట్ఠిక అనే చోట ఒక వనంలోని ఆరామంలో ఉన్నాడు. బుద్ధుడు రాజగృహంలోని వేణువనం నుండి అక్కడికి వచ్చాడు. బుద్ధుని రాకను గమనించిన రాహులుడు లేచి వచ్చి, నమస్కరించాడు. ఒక చెట్టుకింద బుద్ధునికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. బుద్ధుడు కాళ్ళు కడుక్కుని, ఆ పాత్రలో కొంచెం నీటిని ఉంచాడు. బుద్ధుడు ఎంత కష్టమైన విషయాన్నైనా ఉపమానంతో తేలికగా అర్థం అయ్యేలా చెప్పడంలో నేర్పరి. ఆయన వచ్చి ఆసనం మీద కూర్చొని.. ‘‘రాహులా! ఈ పాత్రలో మిగిలిన నీటిని చూశావా?’’అని అడిగాడు. ‘‘భంతే! చూశాను. అడుగున కొద్దిగా ఉన్నాయి’’ ‘‘అవును కదా! తెలిసి తెలిసీ ఎవరు అబద్ధాలు ఆడతారో, మోసపు మాటలు చెప్తారో, అలా చెప్పడానికి సిగ్గుపడరో.. అలాంటి వారికి దక్కే శ్రామణ్య ఫలం చాలా చాలా కొద్దిదే’’ అన్నాడు. రాహులుడు నిండు వదనంతో నింపాదిగా ఆ నీటి పాత్రవైపు చూశాడు. బుద్ధుడు ఆ పాత్రలో ఉన్న నీటిని అంతా పారబోశాడు. 'శ్రామణ్యం అంటే ధ్యాన సాధన ద్వారా పొందే ఫలం. తమకు తాము స్వీయ సాధన ద్వారా ఈ ధ్యానఫలాన్ని పొందుతారు. అందుకే ఈ సాధకుల్ని ‘శ్రమణులు’ అంటారు. తమకు తాము ఎంతో శ్రమించి ఎన్నో కఠోర శ్రమలకోర్చి సాధించే యోగ సాధన ఇది. బౌద్ధ భిక్షువుల్ని శ్రమణులు అనీ, బుద్ధుణ్ణి శ్రమణ గౌతముడని ఇందుకే పిలుస్తారు.' ‘‘రాహులా! నీరు పారబోయడం చూశావా?’’ ‘‘చూశాను భగవాన్’’ ‘‘తెలిసి తెలిసీ అసత్యాలు పలికే వారి మోసపు మాటలు చెప్పే వారి శ్రామణ్యం కూడా ఇలా పారబోసిన నీటిలాంటిదే’’ బుద్ధుడు ఆ పాత్రను తీసుకుని తన పక్కనే ఉన్న రాతిపలక మీద బోర్లించాడు. రాహులుడు ఆ పాత్రవైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు.. ‘‘రాహులా! అలాంటి అబద్ధాలకోరు మోసపు మాటల కోరుకు దక్కే ధ్యానఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే’’ అన్నాడు. రాహులుడు తదేకంగా ఆ పాత్ర మీదే దృష్టి నిలిపాడు. బుద్ధుడు మరలా ఆ పాత్రని తీసి నేల మీద ఉంచాడు. పాత్రలోకి చూపుతూ.. ‘‘రాహులా! ఇప్పుడు ఈ పాత్ర నిలబడి ఉంది. కానీ ఎలా ఉంది?’’ ‘‘ఖాళీగా ఉంది భగవాన్’’ ‘‘అబద్ధాల కోరుకు దక్కే సాధనాఫలం కూడా ఖాళీ పాత్ర లాంటిదే’’ అన్నాడు. అలా ఆ ఒక్క పాత్రని నాలుగు రకాలుగా ఉపమానంగా చూపుతూ అబద్ధాల కోరులు ఎంత సాధన చేసినా ధ్యానఫలాన్ని పొందలేరు. కాబట్టి సత్యభాషణం చాలా అవసరం అనే విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు బుద్ధుడు. అందుకే ఆయనను ‘మహా గురువు’గా భావిస్తారు, గౌరవిస్తారు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ముఖ స్తుతి -
ఎన్టీఆర్ తర్వాత విజయ్ దేవరకొండ..!
-
నాని చెప్పేశాడు..!
నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం సీనియర్ హీరో నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్న నాని అదే సమయంలో బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నాడు. ఇంత బిజీలోనూ తన తదుపరి చిత్రాల పనులు చకచకా కానిచ్చేస్తున్నాడు నాని. నాని 23వ సినిమాకు సంబంధించిన ఎనౌన్స్మెంట్ శుక్రవారం వస్తుందని నిర్మాతలు ముందే ప్రకటించారు. చెప్పినట్టుగా ఈ రోజు ఉదయం నాని తన ట్విటర్ ద్వారా కొత్త సినిమా గురించి చెప్పేశాడు. సినిమా టైటిల్ లోగోతో పాటు కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు. జెర్సీ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. జెర్సీ మీద అర్జున్ 36 అని రాసిఉండటాన్ని బట్టి చూస్తే హీరో క్యారెక్టర్ పేరు అర్జున్ అయి ఉంటుందని భావిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. We are very happy to be associated with Natural Star @NameisNani garu for such a prestigious venture #Jersey. #Jersey will be very high on emotions and will have never before visuals in this genre. Directed by @gowtam19 & Produced by @sitharaents @vamsi84 pic.twitter.com/OiOGchniEv — Sithara Entertainments (@SitharaEnts) 15 June 2018 -
ర్యాపిడ్ చెస్ చాంప్స్ గౌతమ్, కార్తికేయ
సాక్షి, హైదరాబాద్: ఇన్విటేషనల్ ఓపెన్, చిల్డ్రన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో గౌతమ్ రామారావు విజేతగా నిలిచాడు. మణికొండలో జరిగిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో గౌతమ్, ముదబ్బిర్, జె.బి సత్య వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. చిల్డ్రన్ కేటగిరీలో అండర్-15 విభాగంలో కార్తికేయ టైటిల్‌ను కై వసం చేసుకున్నాడు. ఇతర విభాగాల్లో అభినవ్ (అండర్-14), సాద్విక్ (అండర్-13), లలిత్ (అండర్-12), స్ఫూర్తి (అండర్-11), చిరాయు (అండర్-10), ఎన్. తరుణ్‌తేజ (అండర్-9), తేజస్ (అండర్-8), శ్వేశిత్ (అండర్-7), లోహిత్ (అండర్-6) విజేతలుగా నిలిచారు. పోటీల అనంతరం అంతర్జాతీయ ఆర్బిటర్ జె.ఎన్. పద్మారావు విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.