నాని చెప్పేశాడు..! | Nani New Movie Announcement | Sakshi
Sakshi News home page

Jun 15 2018 12:45 PM | Updated on Jun 15 2018 12:47 PM

Nani New Movie Announcement - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని కొత్త సినిమా అప్‌ డేట్‌ ఇచ్చేశాడు. ప్రస్తుతం సీనియర్‌ హీరో నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్‌ సినిమాలో నటిస్తున్న నాని అదే సమయంలో బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నాడు. ఇంత బిజీలోనూ తన తదుపరి చిత్రాల పనులు చకచకా కానిచ్చేస్తున్నాడు నాని. నాని 23వ సినిమాకు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్‌ శుక్రవారం వస్తుందని నిర్మాతలు ముందే ప్రకటించారు. చెప్పినట్టుగా ఈ రోజు ఉదయం నాని తన ట్విటర్‌ ద్వారా కొత్త సినిమా గురించి చెప్పేశాడు. సినిమా టైటిల్‌ లోగోతో పాటు కాన్సెప్ట్‌ పోస్టర్‌ ను కూడా రివీల్‌ చేశారు.

జెర్సీ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. జెర్సీ మీద అర్జున్‌ 36 అని రాసిఉండటాన్ని బట్టి చూస్తే హీరో క్యారెక్టర్‌ పేరు అర్జున్‌ అయి ఉంటుందని భావిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement