చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
దీపావళి పండగ పూట బాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు గోవర్ధన్ అస్రాని(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. అస్త్రాని(Govardhan Asrani ) మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.గోవర్ధన్ అస్రాని 1941లో జైపుర్‌లోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలో జన్మించారు. తండ్రి కార్పెట్ షాప్ రన్ చేసేవాడు. ఫ్యామిలీ బిజినెస్‌పై అస్రానికి ఆసక్తి ఉండేది కాదు. చదువుతున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్ట్‌గా పని చేశాడు. దర్శకులు కిశోర్ సాహు, హృషికేశ్ ముఖర్జీ సలహా మేరకు పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ‘హమ్ కహా జా రహే హై’(1966) చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ‘షోలే’లోని జైలర్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. గోవర్ధన్ అస్రాని 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించారు. కమెడియన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు.