ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తకు కేకే మీనన్ అవార్డు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక కేకే మీనన్ అవార్డు 2013కు ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మసూద్ హ మ్మద్ ఎంపికయ్యారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో సెడిమెంటరీ జియాలజీలో చేసిన పరిశోధనలకుగాను జియాలజీ సొసైటీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ఎన్జీఆర్ఐ సంస్థ గురువారం ప్రకటించింది. మసూద్ ఇప్పటికే ఎన్నో జాతీయ స్థాయి జియో సైన్స్ అవార్డులను సొంతం చేసుకున్నారని, అంతర్జాతీయ జియో సైన్స్ ప్రోగ్రాంకు కూడా నాయకత్వం వహించారని పేర్కొన్నారు.