breaking news
Gear Box
-
బస్సు గేర్ బాక్సులో బుస్‌బుస్..!
జగిత్యాల టౌన్: ఆర్టీసీ బస్సు గేర్ బాక్సులో పాము దూరడంతో ప్రయాణికులు భయభ్రాంతులై పరుగులు తీశారు. వివరాలివి. మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లాకు వస్తున్న పల్లె వెలుగు బస్సు.. జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ డెయిరీ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ రోడ్డుకు అడ్డంగా పాము రావడాన్ని గమనించిన డ్రైవర్.. దాన్ని కాపాడే ఉద్దేశంతో బస్సును అకస్మాత్తుగా నిలిపివేశాడు. రోడ్డు దాటి వెళ్లాల్సిన పాము.. బస్సు కింది భాగం నుంచి గేర్ బాక్సులోకి దూరింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై బస్సు దిగి పరుగులు తీశారు. ఏం చేయాలో తెలియని డ్రైవర్ బస్సును రోడ్డుపైనే నిలిపి ఉంచడంతో అర్ధగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక యువకులు గేర్‌బాక్సులో దూరిన పామును బయటకు లాగి చంపిన అనంతరం.. బస్సు అక్కడి నుంచి బయలుదేరింది. -
ఇండియన్ మార్కెట్లో ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ఫిగో హ్యాచ్‌బ్యాక్ మోడల్లో రెండు ఆటోమేటిక్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో వీటి ధర రూ.7.75 లక్షల నుంచి ప్రారంభం. టైటానియం, టైటానియం ప్లస్ ట్రిమ్స్‌లో లభిస్తాయి. స్పోర్ట్, సెలెక్ట్షిఫ్ట్ మోడ్స్‌లో 6 స్పీడ్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 96 పీఎస్ పవర్, 119 ఎన్ఎం టార్క్‌తో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్వీఎం, 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, సైడ్, కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్, స్టాండర్డ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి హంగులు ఉన్నాయి. -
మెషిన్ల జీవితకాలం పెంచే నానో లూబ్రికెంట్లు
చెన్నై: గేర్బాక్సుల్లాంటి మెషిన్లలో లోహాల మధ్య ఘర్షణను గణనీయంగా తగ్గించే కొత్త తరహా నానో (మరగుజ్జు) లూబ్రికెంట్ను ఇక్కడి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కందెన(లూబ్రికెంట్) గొప్ప ప్రమాణాలను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలకు నేతృత్వం వహించిన సుబ్రజిత్ భౌమిక్ చెప్పారు. ఈ కందెనతో లోహాల అరుగుదలలో 30 శాతం తగ్గుదల ఉంటుందని, లోడ్‌ను భరించే శక్తిలో 15 శాతం పెరుగుదల ఉంటుందని చెప్పారు. సంపూర్ణ మినరల్ ఆయిల్, మినరల్ ఆయిల్ + గ్రాఫైట్‌లతో పోలిస్తే తాము అభివృద్ధి చేసిన కందెనలో ఘర్షణను తక్కువచేసే శక్తిని గుర్తించామన్నారు. లోహాల అరుగుదలను తగ్గించి వాటి జీవితకాలాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని భౌమిక్ తెలిపారు. నానో లూబ్రికెంట్స్‌తో ఇంజిన్ ఆయిల్ వినియోగం, శక్తి వినియోగం తగ్గుతుందని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రీసెర్చ్ డెరెక్టర్ ప్రొఫెసర్. డి. నారాయణ రావు చెప్పారు. లూబ్రికెంట్ల వినియోగం తగ్గించడానికి, పర్యావరణ హితమైన వాటిని తయారు చేసే దిశగా తమ పరిశోధన సాగుతోందని ఆయన తెలిపారు. విడిభాగాల అరుగుదలను గణనీయంగా తగ్గించడానికి, లోడ్ భరించే శక్తిని 80 శాతం వరకూ పెంచే లక్ష్యంతో ఎస్ఆర్ఎం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.