breaking news
gates college
-
విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు
గుత్తి (గుంతకల్లు) : గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ చదివే తమ కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(18) అదృశ్యంపై పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఉమ, నాగార్జునరెడ్డి తెలిపారు. గడచిన 30న సెమిస్టర్ పరీక్షలు రాయడానికి కళాశాలకు బయలుదేరిన తమ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదన్నారు. తెలిసిన చోటల్లా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. -
క్రమశిక్షణతో కలకాలం రాణించవచ్చు
– ఎస్కేయూ వీసీ డాక్టర్ కె.రాజగోపాల్ – ‘గేట్స్’లో ఘనంగా 17వ వార్షికోత్సవం గుత్తి : ‘చదవడం అందరూ చేస్తారు. అయితే క్రమశిక్షణతో చదవాలి. క్రమశిక్షణతో కూడిన విద్య కలకాలం రాణిస్తుంది’ అని ఎస్కేయూ వీసీ, జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ డాక్టర్ కె.రాజగోపాల్ అన్నారు. పట్టణంలోని గేట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం 17వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. గేట్స్ కరస్పాండెంట్ వీకే సుధీర్‌రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. పట్టుదల, ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చన్నారు. ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ఆ లక్ష్యసాధన కోసం సాధన చేయాలని సూచించారు. సోషల్ మీడియా కోసం ఎక్కువ సమయం కేటాయించకూడదని సూచించారు. ఈ సందర్భంగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో గేట్స్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగమల్లేశ్వరరావు, మానవతా కన్వీనర్ తరిమెల అమర్నా«థ్‌రెడ్డి, డీఎస్పీ చిదానందరెడ్డి, డాక్టర్లు జగన్మోహన్రెడ్డి, గేట్స్ డైరెక్టర్ వీకే పద్మావతమ్మ, ఆయా శాఖల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.