పాతబస్తీలో లాయర్ దాడి : ఒకరి మృతి
హైదరాబాద్ : పాతబస్తీలో దారుణం జరిగింది. ఇల్లు ఖాళీ చేసే విషయంలో ఇరువర్గాల మధ్య సోమవారం మధ్యాహ్న సమయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో లాయర్ దాడి చేయడంతో ఖలీల్ బేగ్ అనే 55 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.