breaking news
Flavored drug
-
ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్‌కు యత్నం
► కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న వైనం వెంకటాచలం: గుర్తుతెలియని కిడ్నాపర్లు ఇంటర్ విద్యార్థినిపై మత్తు మందు చల్లి కిడ్నాప్ చేయగా మార్గమధ్యలో వారి నుంచి తప్పించుకుంది. ఈ సంఘటన మండలంలోని టోల్గేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. విద్యార్థిని, పోలీసుల సమాచారం మేరకు.. ఆత్మకూరుకు చెందిన షేక్ మస్తాన్ కుమార్తె మోనాజ్ నెల్లూరు నగరంలోని ప్రముఖ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. సోమవారం వనంతోపు సెంటర్లో ఉదయం 7.30 గంటల సమయంలో కళాశాలకు వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆరుగురు కారులో వచ్చి విద్యార్థినిపై మత్తు మందు చల్లి కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. కారులో పలుచోట్ల తిప్పి వెంకటాచలం సమీపంలోని ఓ కళాశాల వద్ద కారు ఆపి మద్యం తాగుతుండగా స్పృహలోకి వచ్చిన విద్యార్థిని కారు డోరు తీసుకుని పరారైంది. గమనించిన కిడ్నాపర్లు అక్కడ నుంచి కారులో పరారయ్యారు. బాలిక వెంటనే టోల్‌ప్లాజా వద్దకు చేరుకుని జరిగిన విషయం టోల్‌ప్లాజా సిబ్బందికి తెలియజేసింది. టోల్‌ప్లాజా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ వి. శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకుని విద్యార్థిని తలిదండ్రులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
మత్తుమందు చల్లి దోపిడి..
దర్శి: ప్రకాశం జిల్లాలో మహిళపై మత్తుమందు చల్లి భారీగా సొత్తును దోపిడిదొంగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన దర్శి మండలం కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక అద్దంకి రోడ్డులో నివసిస్తున్న శీలం పద్మ అనే మహిళ మంగళవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుంది. ఈ సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై మత్తు మందు చల్లి 8 తులాల బంగారం, అరకిలో వెండి సామాన్లతో పాటు రూ. 3 వేల నగదును దోచుకెళ్లారు. దీనిపై ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.