breaking news
five signs
-
'రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు'
రైల్వే కోడూరు : ప్రజలకు వెన్నుపోటు పొడవటం చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన రైల్వేకోడూరులో వైఎస్ఆర్ జనభేరిలో మాట్లాడుతూ అన్ని ఫ్రీగా ఇస్తానని, రుణాలు మాఫీ చేస్తానంటూ నిస్సిగ్గుగా బాబు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబూ... రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో మీకు తెలుసా .... అని జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అధికారం కోసం చంద్రబాబు దొంగ్ హామీలు ఇస్తున్నారని, ఆయనలా నిజాయితీ లేని రాజకీయాలు తాను చేయలేనని వైఎస్ జగన్ అన్నారు. బాబులా అబద్ధాలు చెప్పలేను అని...వైఎస్ఆర్ నుంచి వారసత్వంగా వచ్చింది విశ్వసనీయతేనని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు చేస్తానని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు భరోసా ఇస్తున్నానని, మీ పిల్లవాడ్ని బడికి పంపించండని సూచించారు. అక్కా చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు తెచ్చేలా 'అమ్మ ఒడి' పథకం అమలుపై తొలి సంతకం చేస్తానని వైఎస్ జగన్ తెలిపారు. రాజకీయమంటే పేదవాడి గుండె చప్పుడు వినడం అని ఆయన అన్నారు. తాను సీఎం అయ్యాక అయిదు సంతకాలు చేస్తానని జగన్ చెప్పారు. ఆ సంతకాలు రాష్ట్ర చరిత్రను మారుస్తాయన్నారు. అక్కా చెల్లెళ్ళ కోసం మొదటి సంతకం అమ్మఒడి పథకంపై పెడతానన్నారు. ఈ పథకంతో పిల్లల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తానన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం పెట్టిస్తానన్నారు. రెండవ సంతకం అవ్వా, తాతలకు. రూ.200 పింఛన్‌ను రూ.700కు పెంచుతూ చేస్తానన్నారు. మూడవ సంతకంగా రైతులకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక ఏడాదికి 10లక్షల ఇళ్లు నిర్మిస్తానని, అయిదేళ్లలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పారు. -
'రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు'
-
ప్రజా సంక్షేమం కోసమే జగనన్న ఐదు సంతకాలు
కుంకలమర్రు (కారంచేడు) న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదు సంతకాలు చేయబోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన మండలంలోని కుంకలమర్రులో పర్యటించారు. కారంచేడు జెడ్పీటీసీ అభ్యర్థిని దగ్గుబాటి నాగజ్యోతి, కుంకలమర్రు ఎంపీటీసీ అభ్యర్థిని జువ్వా కోమలరాణిలకు ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్రెడ్డి పాలన కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పిల్లల్ని బడికి పంపే తల్లి ఖాతాలో డబ్బులు వేసేలా ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకంపై మొదటి సంతకం చేస్తారన్నారు. అవ్వా తాతలకు 200 నుండి 700 పింఛను పెంచుతూ రెండవ సంతకం, రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు 3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ మూడో సంతకం పెడతారన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తూ నాలుగోసంతకం, ఏ గ్రామానికి వెళ్లినా అడిగిన వెంటనే అన్ని రకాల కార్డులు మంజూరు చేసేలా ఐదో సంతకం చేసి కొత్త చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. పేద ప్రజల కోసం చేసిన వాగ్దానాలు నెరవేర్చగల నాయకుని రాజ్యం కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని ప్రజల హర్షాతిరేకాల మధ్య భరత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ.. మండలంలోని కుంకలమర్రులో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది. మంగళవారం రాత్రి భరత్ సమక్షంలో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వా శ్రీనివాసరావు, అనిశెట్టి మస్తానరావు, గ్రామ సర్పంచ్ కూరాకుల వజ్రమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యులు తెలగతోటి స్వాతి, కే నాగేశ్వరమ్మ, గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భరత్ రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భరత్‌కు అడుగడుగునా నీరాజనం గొట్టిపాటి భరత్‌కు కుంకలమర్రులో అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. గ్రామ దేవతలు పోలేరమ్మ, తిరుపతమ్మల దేవాలయాల్లో భరత్ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఎద్దుల బండిపై జెడ్పీటీసీ అభ్యర్థిని దగ్గుబాటి నాగజ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థిని జువ్వా కోమలరాణి గ్రామంలోని బీసీ కాలనీ, పుట్టాయిపాలెం, ఎస్సీ కాలనీ, మెయిన్రోడ్డుల గుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి వీధిలోను భరత్‌కు మహిళలు హారతులు పట్టారు. పూలవర్షం కురిపించారు. అనంతరం మెయిన్ రోడ్డులోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూరాకుల వజ్రమ్మ, జువ్వా శ్రీనివాసరావు, అనిశెట్టి మస్తాన్‌రావు, యార్లగడ్డ పాపారావు, భానుప్రకాష్, యార్లగడ్డ సుబ్బారావు, దగ్గుబాటి రామకృష్ణ, సుమంత్, కోటయ్య, వేలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.