ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: ఢిల్లీ నుంచి మంగళవారం వివిధ నగరాలకు బయల్దేరిన ఐదు జెట్ ఎయిర్ వేస్ విమానాలను బాంబులతో పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. విమానాశ్రయ అధికారులు వెంటనే అప్రమత్తమై భద్రతను సమీక్షించారు.
బెదిరింపులు వచ్చిన ఐదు విమానాలను సురక్షితంగా వాటి గమ్య స్థానాల్లో ల్యాండ్ చేసినట్టు అధికారులు చెప్పారు. విమానాల నుంచి ప్రయాణికులను దించివేసి తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సివుంది.