breaking news
Five Demands
-
ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి 5 డిమాండ్లు
న్యూఢిల్లీ: ఇటీవల అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్లను వెంటనే విడుదల చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఢిల్లీలో ఆదివారం(మార్చ్ 31) భారీ సభ నిర్వహించిన ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేసింది. ఈ డిమాండ్లను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ చదివి వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ని కూటమి డిమాండ్ చేసింది. ఎన్నికల్లో సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలి. సీఎం కేజ్రీవాల్, మాజీ సీఎం హేమంత్ సొరేన్‌లను వెంటనే విడుదల చేయాలి. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలను వెంటనే ఆపాలి. బీజేపీ చేస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అక్రమ వసూళ్లు, ఎన్నికల బాండ్ల ద్వారా చేస్తున్న మనీలాండరింగ్‌పై విచారించడానికి సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలి’ అని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, హేమంత్‌సోరేన్ భార్య కల్పన సోరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ అవి గుర్తు చేసుకోవాలి -
ఐదు డిమాండ్లు పాటిస్తే.. సెల్యూట్ చేస్తాం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఆయన ముందు ఐదు డిమాండ్లను ఉంచారు. ''ప్రధానమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వీటిని పాటిస్తే దేశం ఆయనకి సెల్యూట్ చేస్తుంది'' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 1. ట్విటర్ లో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వారిని ఫాలో అవకండి. 2. రోహిత్ వేముల మృతికి కారణమైన కేంద్రమంత్రులను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. (కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.) 3. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయకూడదు. ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వాలను ఏర్పాటు చేయండి. దొడ్డి దారిన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం మానాలి. 4. ఢిల్లీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని అంగీకరించండి. 5. భారత్ మాతాకీ జై అనని వారిపై దాడులు చేయడం మానండి. దాడులు చేసినవారిని జైలులో పెట్టండి. ప్రజల ఆహారపు విషయాలలో జోక్యం చేసుకోకండి.