breaking news
firangi
-
పెళ్లిపీటలెక్కిన ప్రముఖ నటి
ప్రముఖ నటి, ఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా సోదరి ఇషితా దత్తా వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. తెలుగులో ’చాణక్యుడు’ సినిమాలో నటించిన ఈ భామ.. బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్‌ను పెళ్లిచేసుకుంది. ఇషితా దత్తా ప్రస్తుతం ప్రముఖ కమేడియన్ కపిల్ శర్మ హీరోగా తెరకెక్కిన ’ఫిరాంగి’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత ఇషితా పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ పద్మావతి సినిమా విడుదల వాయిదాపడటంతో ఖాళీగా ఉన్న డిసెంబర్ 1 స్లాట్‌ను వాడుకునేందుకు ’ఫిరాంగి’ చిత్రయూనిట్ నిర్ణయించడంతో.. ఈ సినిమా ఒక వారం లేటుగా వస్తోంది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్‌లో నటించిన ఇషితా దత్తా (27) కొన్నాళ్లుగా వత్సల్ సేథ్ (37) డేటింగ్ చేస్తోంది. టార్జాన్ ది వండర్ కార్ సినిమాలో హీరోగా నటించిన వత్సల్ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. మంగళవారం ముంబైలోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన వీరి పెళ్లికి అజయ్ దేవ్‌గణ్, కాజోల్‌తోపాటు పలువురు నటులు హాజరయ్యారు. -
నిజాం కాలం నాటి ఫిరంగి స్వాధీనం
హైదరాబాద్: రోడ్డు విస్తరించే పనుల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం పురాతన భవనాన్ని కూలుస్తుండగా నిజాం కాలం నాటి ఫిరంగి బయటపడింది. పాత బస్తీలోని హుస్సేనీ ఆలంలోని కోకాకితట్టీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫిరంగి కనిపించడంతో అప్రమత్తమైన స్ధానికులు వెంటనే చార్మినార్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫిరంగి స్వాధీనం చేసుకున్నారు. ఫిరంగిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.


