breaking news
fauzia story
-
Fauzia Arshi: ఆకాశమే హద్దు
డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్లో గుర్తింపు పొందిన ఫౌజియా ఆర్షి మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ పుస్తకాల రచయిత్రి, గిటారిస్ట్, సింగర్, మ్యూజిక్ కంపోజర్, డైలాగ్ రైటర్. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా విజయపథంలో దూసుకుపోతోంది. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తాజాగా మరో సవాలును స్వీకరించనుంది.ఖాళీగా కూర్చోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫౌజియా ఆర్షి పెట్టింది పేరు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఫౌజియాకు టైమ్ అంటే కొత్త విషయం తెలుసుకోవడం. కొత్త కళలో అక్షరాలు దిద్దడం. కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న ఆమె కృషి వృథా పోలేదు. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని ప్రపంచం గుర్తించేలా చేసింది.‘హోగయా దిమాగ్ క దహీ’ బాలీవుడ్ సినిమాతో నవ్వులు పూయించింది. ఈ రోరింగ్ కామెడీ ఫిల్మ్‌లో ఓంపురి, రాజ్‌పాల్ యాదవ్‌లాంటి నటులు నటించారు. ఫస్ట్–జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా టీనేజ్లోనే తన వ్యాపారదక్షతను చాటుకుంది ఫౌజియా.‘ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్’ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. మేనేజ్మెంట్ డిపొ్లమా కోర్సుల విద్యార్థులకు బాగా ఉపకరించే ఈ పుస్తకం ప్రపంచ మార్కెటింగ్‌కు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. ‘ది సన్ రైజెస్ ఫ్రమ్ ది వెస్ట్’ అనేది దీనికి పూర్తిగా భిన్నమైన పుస్తకం. ‘ఏది వాస్తవం?’ అంటూ వాస్తవాన్ని గురించి లోతుగా విశ్లేషించే పుస్తకం. తాత్విక ఛాయలు కనిపించే ఈ పుస్తకం రకరకాల చుక్కలను కనెక్ట్ చేసి ఒక రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది.ఎంత అలవోకగా పుస్తకం రాయగలదో అంతే అలవోకగా రాగం తీయగలదు. అప్పటికప్పుడు పదాలు అల్లుతూ పాట పుట్టించగలదు. కాన్వాస్‌పై కనువిందు చేసే చిత్రాన్ని సృష్టించగలదు. ఇక గిటారిస్ట్‌గా ఆమె నైపుణ్యం సరేసరి. మేనేజ్మెంట్ప్రొఫెషనల్గా ఎంత జటిలమైన విషయాలనైనా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించగలదు.ఫౌజియాకు చెందిన డైలీ మల్టీమీడియా లిమిటెడ్ (డిఎంఎల్)... సినిమాలు, టెలివిజన్ కంటెంట్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, ఈవెంట్ ఆర్గనైజింగ్, పొలిటికల్ క్యాంపెయిన్‌కు సంబంధించిన కంపెనీ.సామాజిక సేవారంగంలో చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని ఫౌజియాను బ్రిటన్ పార్లమెంట్ సత్కరించింది. ఫౌజియాకు ఇంగ్లీష్ భాషలో ఇష్టమైన మాట ‘న్యూ ఛాలెంజ్’. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్‌లను అధిగమిస్తూ తన సత్తా చాటుతోంది.తాజా విషయానికి వస్తే...ముంబైకి చెంది ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ ్రపాంతీయ విమానయాన సంస్థ ‘ఫైబిగ్’ను కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతోంది. లావాదేవీలు పూర్తయిన తరువాత ‘ఫ్లైబిగ్’ను మరిన్ని విమానాలతో విస్తరించనున్నారు. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్‌కు ఫౌజియా ఆర్షి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంది. ‘ఫ్లైబిగ్’ రూపంలో మరో సవాలు ఆర్షి ముందుకు రానుంది. ఈ సవాలును కూడా ఫౌజియా విజయవంతంగా అధిగమించగలరన్నది ఆమె గురించి తెలిసిన వారు కాస్త గట్టిగానే చెప్పేమాట. -
పేద పంజరం
ఫస్ట్ పర్సన్ పదేళ్ల వయసులో పదవ భార్య అయ్యింది. దేశం కాని దేశంలో బానిస అయ్యింది. సంతలో పశువుగా చేతులు మారింది. పేదరికం నిస్సహాయత అవసరం స్వార్థం... ఇవన్నీ ఆడపిల్లలకు ఎన్ని నరకాలు చూపిస్తున్నాయో తెలియాలంటే ఫౌజియా కథ తెలుసుకోవాలి. అది 2006వ సంవత్సరం. నాకు అప్పుడు పన్నెండేళ్ళు. గవర్నమెంటు స్కూల్లో ఉర్దూ మీడియం, ఏడోక్లాసు చదువుతున్నాను. ఫైనల్ ఎగ్జామ్స్ రానున్నాయి. పరీక్షలకు ముందు ఓల్డ్ సిటీలో ఓ ఫంక్షన్ హాల్‌కి తీసుకొచ్చారు మా నాన్న అయూబ్‌ఖాన్. పెద్ద హాల్ మధ్యలో కుర్చీ ఒకటి వేసి ఉంది. దానికి అటూ ఇటూ చాలామంది పెద్దమనుషులు కూచుని ఉన్నారు. నేను భయం భయంగా కూర్చున్నాను. ఈలోగా ఇద్దరు యువకులను ఎవరో తీసుకొని వచ్చారు. ‘వాళ్ళిద్దర్లో నీకెవరు నచ్చారో చెప్పు’ అన్నారు. చుట్టూ ఉన్నపెద్ద మనుషులంతా నన్నే చూస్తున్నారు. నేనేం చెప్పలేదు. నాన్న ఒక యువకుడిని సెలక్ట్ చేశారు. ఆ తర్వాత అంతా లేచివెళ్ళిపోయారు. వార్త చెప్పారు... ఆ రోజు ఆదివారం. పుస్తకాల్లో మునిగి ఉన్న నాతో ‘వాళ్ళకి నువ్వు నచ్చావు, నువ్వీ పెళ్ళి చేసుకోవాలి’ అన్నారు నాన్న. నాకిష్టం లేదన్నాను. నాకు చదువుకోవాలనుందన్నాను. అక్క నాకన్నా పెద్దది కదా? ఆమెకు చేయండి ముందు అన్నాను. అయినా పసిదాన్ని నామాటెవరు వింటారు. ‘వాళ్ళకి నువ్వే నచ్చావు. నువ్వీ పెళ్ళి చేసుకుంటే ఈ యిల్లు బాగుపడుతుంది. మన దరిద్రం పోతుంది ’అమ్మ నూర్జహాన్ బతిమాలుతోంది. ‘నీకు ఖరీదైన మంచి బట్టలిస్తారు. చాలా బంగారం పెడతారు. రెండు లక్షలు డబ్బులిస్తారు. ఇల్లు కట్టిస్తారు. మనకీ కష్టాలేం ఉండవు’ అక్క ఆశపెడుతోంది. నేను ఒప్పుకోలేదు. నా వీపు మీద దబ దబా తన్నులు. బలవంతంగా ఒప్పించారు. పెళ్లి జరిగింది... రెండోరోజు ‘ఖాజీ’ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ పెద్ద మనుషులే అక్కడ ఉన్నారు. ఒకతన్ని నేను బాగా గుర్తుపట్టగలను. నల్లగా చాలా పొడవుగా, లావుగా ఉన్నాడు. జుట్టు రింగులు రింగులుగా ఉంది. అతనితో పాటు ఆ రోజు నాకు చూపించిన మరో ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. నాతో మూడు సార్లు ‘ఖుబూల్’ చెప్పించారు. ఆ ఇద్దరు కుర్రాళ్ళూ వచ్చి కంగ్రాట్స్ అని చెపితే నాకు అర్థం కాలేదు. నల్లగా నీగ్రోలా వున్న వ్యక్తి నా భర్త అట. ‘‘మాకు చూపించింది ఇతను కాదే’’ అని నాన్న ఎదురు తిరిగాడు. పదివేలు నాన్న చేతిలో పెట్టి, పెళ్ళి అయిపోయిందన్నారు. మా అమ్మా, అక్కా అంతా గొడవ చేశారు. వేరేవాళ్ళని చూపించి ఇతన్ని కట్టబెట్టారని, కాని వాళ్లు వినలేదు. నా భర్త పేరు అబ్దుల్లా ఈషా అని చెప్పారు. అతనిది సూడాన్. 55 ఏళ్ళుంటాయి. నా కన్నా 43 ఏళ్లు పెద్దవాడు. ఏమీ జరగనట్టే మళ్ళీ పిన్నీ, అమ్మా అందరూ మా యిద్దర్నీ ఒక గదిలోకి పంపారు. నాకు పెళ్ళంటే ఏమిటో, దాంపత్య జీవితం అంటే ఏమిటో కూడా తెలియదు. ఆ రాత్రి అతను, తను చెప్పింది చేయాలన్నాడు.ఆ రాత్రే నేను నరకాన్ని ప్రత్యక్షంగా చూశాను. అతను చెప్పినట్టు చేయనందుకు నా వీపుపై పడిన సిగరెట్ వాతలను తెల్లవారి మా పిన్నికి చూపించాను. అతను మా ఇంట్లో ఉన్న ఆరు రాత్రులు నాకు నరకం చూపించాడు. తెల్లవారి మంచంమీది నుంచి లేవలేకపోయాను. నడవలేకపోయాను. కనీసం బాత్రూంకి కూడా వెళ్ళలేకపోయాను. నేను ఎన్నోవాడిని, నాకన్నా ముందు ఎంతమందితో ఉన్నావంటూ సిగరెట్‌తో చెప్పుకోలేని చోట్లల్లో కాల్చాడు. అమ్మతో చెప్పి బావురుమన్నాను. కానీ అమ్మది కూడా ఏమీ చేయలేని నిస్సహాయతేనని నాకు అర్థమైంది. సూడాన్ ప్రయాణం... సూడాన్ వెళుతున్నాను ఒక యేడాది తరువాత వస్తానని వెళ్ళిపోయాడు. మరుసటి యేడాది వచ్చాడు. నన్ను సూడాన్ తీసుకెళతానని చెప్పాడు. సూడాన్ వెళ్ళేటప్పుడు నా పక్కన అతను లేడు. ఎవరో ఆడవాళ్లున్నారు. నాకు నలభయ్యేళ్ళని పాస్‌పోర్ట్‌లో తప్పుగా రాయించారు. సూడాన్‌లో ఓ చిన్న గదిలో అతను సోదరి అని చెప్పిన ఆమెతో ఉంచాడు. అక్కడి వారిలో నన్ను చాలా సులభంగా పరదేశీనని గుర్తుపట్టొచ్చు. నేను వారిలో ప్రత్యేకంగా కనిపించేదాన్ని. రంగు, జుట్టూ అన్నీ. కొద్ది రోజులు అక్కడే ఉన్నాడు. తరువాత ఒక రోజు హఠాత్తుగా నేను లండన్‌లో ఉద్యోగం చేస్తాను అక్కడికెళుతున్నానని చెప్పాడు. నేను కూడా వస్తానని అడిగినప్పుడు అతను చెప్పిన మాట విని నిర్ఘాంతపోయాను. నువ్వు నాతో రావడం కుదరదు... ఎందుకంటే నువ్వు నాకు ఒక్కదానివే కాదు... నీకన్నా ముందు తొమ్మిది మంది భార్యలున్నార ని చెప్పాడు. నా నంబర్ 10 అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సంగతి పక్కింటి వారితో చెప్పాను. వాళ్ళు మన దేశస్థులే. నువ్వు చాలా ప్రమాదంలో పడ్డావన్నారు వాళ్ళు. అతనికి ఇది వ్యాపారమట. వాళ్ల సాయంతోనే నేను సూడాన్‌లో భారతీయ అధికారులను కలవగలిగాను. తిరిగి యింటికి చేరుకోగలిగాను. మళ్లీ పంజరం... అతని పీడ విరగడయ్యాక నా చదువు మళ్ళీ కొనసాగించాను. 10వ తరగతి పాస్ అయ్యాను. మా అక్క చెప్పింది మళ్ళీ మనకు మంచి రోజులొస్తాయని. మంచి రోజులు నేను చూడలేదు కానీ 2011లో మళ్ళీ నా పెళ్ళి ప్రస్థావన వచ్చింది. ఇంట్లో హింస మొదలైంది. నేను వాళ్ళకి భారమయ్యానని నాకర్థం అయ్యింది. 2011 డిసెంబర్ చివరి వారం. నాకు మళ్ళీ పెళ్ళి జరిగింది. నా ఇష్టాలతో, అభిప్రాయాలతో సంబంధం లేకుండా జరిగిన రెండో పెళ్ళి అది. మహమ్మద్ ఖాన్ అతని పేరు. అప్పటికే పెళ్ళి అయ్యింది. నలుగురు పిల్లలు. ఏదో వ్యాపారం అని అబద్ధం చెప్పాడు. కానీ రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న పోలీసు కానిస్టేబుల్, బిహెచ్ఇఎల్లో ఉంటాడు. అతను కూడా తొలిరోజు నుంచే మొదలు పెట్టాడు. నీకు ఎవరెవరితో సంబంధం ఉందో చెప్పమంటూ కొట్టేవాడు. నా కన్యాత్వాన్ని నిరూపించుకొమ్మని మొదటి భర్త హింసిస్తే, రెండవ భర్త అబద్ధమైనా సరే ఎవరితోనైనా సంబంధం వుందని చెప్పమని వేధించేవాడు. అతనితో తెగదెంపులు చేసుకొని బయటపడ్డాను. స్వేచ్ఛ ఇప్పుడు నేను షాహీన్ ఉమన్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నాను. డ్రాపౌట్స్‌ని తిరిగి స్కూల్లో చేర్పించే పని నాది. అలాగే నాలా జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నవారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు నా జీవితం స్వతంత్రమైనది. స్త్రీకి జీవితంలో చదువు, స్వతంత్రం రెండూ అవసరం. చదువుంటే ధైర్యం వస్తుంది. ధైర్యం స్వతంత్రాన్నిస్తుంది. సంభాషణ: అత్తలూరి అరుణ ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి