వెలుగు నీడలు..
సింగరేణి సంస్థకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. కొత్త ప్రాజెక్టులు లేవు.. పెండింగ్ ప్రాజెక్టులు అందుబాటులోకి రాలేదు.. ఫలితంగా ఉత్పత్తి లక్ష్యం చేరుకోలేక సంస్థ ఒడిదుడుకుల నడుమ పయనిస్తోంది. పరిపాలనా పరంగా అనేక మార్పులు.. చేర్పులు చోటుచేసుకున్నా ఆశించిన ఉత్పత్తి జరగలేదు. ప్రమాదాల పరంపర కొనసాగింది. గత ఏడాది 12 మంది కార్మికులు మృతి చెందగా ఈ ఏడాది మొత్తం 17 మంది మరణించారు. గని ప్రమాదాల్లో ఏడుగురు, గాలి అందక ఇద్దరు, గుండె పోటుతో ఎనిమిది మంది మరణించారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఒక్క జూలైలోనే నలుగురు మృత్యువాత పడడం గమనార్హం. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో నాయకుల మధ్య ఆధిపత్యపోరు కారణంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోక కార్మికులు ఇబ్బందిపడ్డారు.
- న్యూస్‌లైన్, కొత్తగూడెం/యైటింక్లయిన్‌కాలనీ
జనవరి..
7 : జైపూర్‌లో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ఇన్చార్జ్గా డెరైక్టర్(ఇఅండ్ఎం)గా ఎస్.విశ్వనాథ రాజు నియామకమయ్యారు
17 : ఆర్జీ-2 జీడీకే-8వ గని మూతపడింది
25 : సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో అత్యాధునిక అంబులెన్స్, సి.టి.స్కాన్, నిమ్స్ ఆస్పత్రి సౌజన్యంతో టెలిరేడియాలజీ, టెలిమెడిసిన్‌ను సీఎండీ ప్రారంభించారు
28 : యాజమాన్యం 429 మంది డిస్మిస్డ్ కార్మికులకు ఉద్యోగాలు కల్పించింది
ఫిబ్రవరి..
13 : కొత్తగూడెం 5షాఫ్ట్ గనిలో రూఫ్‌ఫాల్ అయి కార్మికులు అంబాల పాపయ్య, రాయుడు శంకర్ మృతి చెందారు
20, 21 : జాతీయ కార్మిక సంఘాలు
దేశవ్యాప్త సమ్మె చేపట్టాయి
24 : జీడీకే-8ఏ గనిలో ఎయిర్బ్లాస్టింగ్తో ఏడుగురికి గాయాలయ్యాయి
25 : గనులపై మౌలిక సదుపాలయాలు కల్పించడానికి సంస్థ *60కోట్లు
కేటాయించింది
25 : సింగరేణిలో 9,877 మిలియన్ టన్ను ల బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు.
మార్చి..
5 : ఎస్సార్పీ ఓసీపీ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు
15 : ఆస్ట్రేలియా పర్యటనకు సింగరేణి బృందం వెళ్లింది
15 : ఓసీపీ-3లో మూడు డంపర్లు ఢీకొన్నాయి
17 : కొత్తగూడెంలో కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు
17 : రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్లో రాక్ క్లైంబింగ్పై శిక్షణ శిబిరం నిర్వహించారు
ఏప్రిల్..
2 : హెచ్ఎంఎస్నుంచి కేశవరెడ్డి తొలగింపు
17 : జీడీకే-7 ఎల్ఈపీ గని ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు.
19 : విద్యుల్ లేక జీడీకే-7 ఎల్ఈపీ గనికి లేఆఫ్ ప్రకటించారు
26, 27 : కోల్‌కతాలో జరిగిన కోల్ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలలో సింగరేణి కార్మికుడు మోజెస్ సింగ్ బంగారు పతకం, మిస్టర్ కోల్ఇండియా టైటిల్, సి.హెచ్.శ్రీనివాస్ రజత పతకం సాధించారు.
మే..
2 : సింగరేణిలో 30 మొబైల్ చెక్ పోస్టులు మంజూరయ్యాయి
23 : చీఫ్ ఆఫ్ వెల్ఫేర్‌గా కె.బి.ఎస్ సాగర్ నియామకమయ్యారు
25 : ఎండ వేడి ఎక్కువ కావడంతో ఓసీపీల్లో పనివేళలను కుదించారు
30 : సింగరేణి కళాశాలలో
రెండు పీజీ కోర్సులు ప్రారంభించారు
జూన్..
5 : జీడీకే-1గనిలో గాలి అందక కార్మికుడు మృతి చెందాడు
10 : {స్టక్చర్, జేసీసీ సమావేశాలు
నిలిచిపోయాయి
24 : సింగరేణికి సామాజిక సేవా అవార్డు ప్రదానం
26 : జీడీకే-2ఏ గనిలో గాలి అందక
కార్మికుడు మృతి చెందాడు
26 : ఆర్కేఓసీలో కోల్‌హ్యాండ్లింగ్ ఫ్లాంటుకు భూమి పూజ చేశారు
28 : మూడు ప్రాసెస్డ్ ఓబీ ప్లాంట్ల ఏర్పాటుకు కంపెనీ నిర్ణయించింది
జూలై..
13 : జీకేఓసీలో డంపర్‌పై నుంచి పడి
జనరల్ మజ్దూర్ మృతి చెందాడు
13 : జీడీకే-10ఏ గనిలో గుండెపోటుతో
కార్మికుడి మృతి
15 : తాడిచర్ల బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి పనులను జెన్కో సింగరేణికి కేటాయించింది
16 : జీఎం సేఫ్టీగా బి.కిషన్‌రావు
16 : ఫైనాన్స్ డెరైక్టర్ పదవీ కాలం పొడిగింపు
19 : {Mీడాకారులకు అన్‌డ్యూటీ వర్తింపు
24 : ఈఆర్పీ అమలులో సింగరేణికి
జాతీయస్థాయి అవార్డు వచ్చింది
25 : మెడికల్ బోర్డు దరఖాస్తులకు
ఆన్లైన్ విధానం అమలులోకి వచ్చింది
29 : ఓసీపీ-1, 7షాఫ్ట్ మైన్లలో గుండెపోటు తో ఇద్దరు కార్మికులు మృతి చెందారు
30 : జీడీకే-2వ గనిలో గుండెపోటుతో
కార్మికుడు మృతి చెందాడు
ఆగస్టు..
1 : సింగరేణి పర్సనల్ విభాగాన్ని యాజమాన్యం నాలుగు ముక్కలుగా చేసింది. వెల్ఫేర్ జీఎం పర్సనల్‌గా కె.బి.ఎస్.సాగర్, ఐఆర్‌కు సి.మల్లయ్యపంతులు, రిక్రూట్‌మెంట్‌సెల్ కు జి.చంద్రమౌళి, హెచ్ఆర్కు ఎల్.వి.ఎన్.శర్మను నియమించింది
5 : రిటైర్డ్ అధికారులకు సంస్థ మెడికల్ స్కీం ప్రకటించింది
7 : ఆర్కే-7గనిలో గుండెపోటుతో కార్మికుడు మృతి చెందాడు
9 : కోయగూడెం ఓసీలో కాంట్రాక్ట్ డీజిల్ టాంకర్ డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు
14 : ఐడియా సింగరేణి వెబ్‌లింక్‌ను సీఎండీ ప్రారంభించారు.
15 : అంతర్జాతీయ మైనింగ్ ఎగ్జిబిషన్‌కు సింగరేణి అధికారులు వెళ్లారు
20 : ఆసిఫాబాద్ వద్ద నిర్మించనున్న రైల్వే డంపింగ్ యార్డు కోసం సింగరే ణి సౌత్ సెంట్రల్ రైల్వేకు *13.60 కోట్లు చెల్లించింది
31 : జీడీకే-10 గనిలో కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు
సెప్టెంబర్..
5 : ఆర్జీ-2లో సెక్యూరిటీ గార్డులపై
దొంగలు దాడి చేశారు
19 : గని కార్మికులకు 3.2 శాతం డీఏ పెంపు జీఓ జారీ అయింది
28 : {ఫీగ్యాస్ కూపన్ల విధానం రద్దయింది
30 : బీజీ ప్యానెల్లో
బొగ్గు ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది
అక్టోబర్..
3 : లాభాల వాటా 18 శాతం, దీపావళి బోనస్ *31,500 ప్రకటించిన సంస్థ
13 : వకీల్‌పల్లి గనిలో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి
31 : ఆర్కే-7 గనిలో పైకప్పు కూలి కార్మికుడు గాయపడ్డాడు
నవంబర్..
1 : అండర్‌గ్రౌండ్ కార్మికులకు సీఎండీ యూనిఫాం పంపిణీ ప్రారంభించారు
1 : కాసిపేట గనిలో గుండెపోటుతో కార్మికుడు మృతి చెందాడు
4 : ఓసీపీ-2 లారీ ప్రమాదంలో గని కార్మికుడు మొగిలి మృతి చెందాడు
7 : ైయెుటింక్లయిన్కాలనీలో ఇంటర్ ఏరియా రెస్క్యూ పోటీలు పారంభమయ్యాయి
21 : రాజ్యపురస్కార్ అవార్డుకు 21 మంది
స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంపికయ్యారు
26 : పీకే ఓసీ-2 ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు యాదగిరి మృతి చెందాడు
30 : కేఎల్పీలో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి
డిసెంబర్..
5 : నూతనంగా ఏర్పాటు చేసిన సింగరేణి వెబ్‌సైట్‌ను సీఎండీ ప్రారంభించారు
5 : రాయల తెలంగాణకు వ్యతిరేకంగా సింగరేణిలో బంద్ పాటించారు
16 : డిస్మిస్డ్ కార్మికులు ఆమరణ దీక్ష ప్రారంభించి 20వ తేదీన విరమించారు
23 : 7షాఫ్ట్ గనిలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి
24 : జార్ఖండ్ రాష్ర్టం ధన్సార్లో జరిగిన జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్లు చాంపియన్‌షిప్ సాధించాయి.