breaking news
employee pensions
-
పెరగనున్న పెన్షన్ల భారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న తొమ్మిదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రిటైర్ కానున్నారు. అదే స్థాయిలో పెన్షన్ల వ్యయం కూడా భారీగా పెరగనుంది. వచ్చే తొమ్మిదేళ్లలో 1,33,417 మంది ఉద్యోగులు రిటైర్ కానుండగా పెన్షన్ల రూపంలో ప్రభుత్వం మొత్తం రూ.2,80,141.94 కోట్లు చెల్లించనుంది. రాష్ట్ర ద్రవ్య విధాన పత్రంలో ఆర్థిక శాఖ ఈ వివరాలను పొందుపరిచింది. వచ్చే ఏడాది 13,643 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం పెన్షన్ల వ్యయం రూ.20 వేల కోట్లు ఉండగా వచ్చే ఏడాది రూ.25,520.04 కోట్లకు పెరగనుంది. 2024 నుంచి 2032 వరకు ఏటా 13 వేల నుంచి 16 వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతారని ద్రవ్య విధాన పత్రం వెల్లడించింది. దీంతో 2032 నాటికి పెన్షన్ల వ్యయం రూ.41,803.40 కోట్లకు పెరుగుతుందని తెలిపింది. -
ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.68,12,739 కోట్లు!
సాక్షి, అమరావతి: వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.68,12,739 కోట్లకు చేరుతుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. ఇదే కాలంలో ఏకంగా రూ.1,32,967 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఐదేళ్లలో పెన్షన్ కింద రూ.80,627 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయం ఇలా ఉంటుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. -
ఉద్యోగుల కష్టార్జితాన్ని కాజేసింది!
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల పెన్షన్‌కు గత సర్కారు కన్నం వేసింది. టీడీపీ సర్కారు 2017–18లో ఆర్థిక ఏడాది ముగింపు నాటికి రూ.730.94 కోట్ల సీపీఎస్ సొమ్మును నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ట్రస్టీ బ్యాంకుకు జమ చేయలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. సీపీఎస్ సొమ్మును సక్రమంగా వినియోగించకపోవడంతో ఉద్యోగులకు సమకూరే ప్రతిఫలం, వడ్డీ రేటులో అనిశ్చితి ఏర్పడిందని కాగ్ తెలిపింది. ఈ డబ్బులను బ్యాంకుకు జమ చేయనందున ఉద్యోగులకు రావాల్సిన వడ్డీ రాదని, దీన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇతర అవసరాలకు వాడకం.. సీపీఎస్ ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతి నెల పది శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం మినహాయిస్తుంది. మరో పది శాతం సొమ్మును కలిపి నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్‌కు జమ చేయాలి. అయితే చంద్రబాబు సర్కారు ఉద్యోగుల వాటా సొమ్ముతో పాటు ప్రభుత్వం ఇవ్వాల్సిన పది శాతం సొమ్మును ఇతర అవసరాలకు వాడేసింది. సీపీఎస్‌లో చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ చాలా తక్కువగా వస్తోందని, దీన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు దీనిపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
బాపు గీతలు జాతికి చక్కిలిగింతలు!
ఉద్యోగ పింఛన్లే అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో, వృద్ధాప్య పింఛన్లు ఎన్నికల వాగ్దానాల జాబితాకెక్కింది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే పింఛన్ల మీద బాపు వేసిన పై సంగతి ఇది. ఇది నిత్యనూతనం, సమకాలీనం మాత్రమే కాదు భవిష్యత్ దర్శనం! బాపు కార్టూన్ చూపులో రాముణ్ణి, కృష్ణుణ్ణి కూడా వదల్లేదు. ‘‘కుప్పించి ఎగసిన కుండ లంబుల కాంతి’’ భారతం యుద్ధకాండలో ప్రసిద్ధ పద్యం. ‘‘కుప్పించి ఎగిసే సరికి నడుం పట్టిందోయ్ బావా’’ అంటూ కృష్ణుడు ఆపసోపాలు పడే దృశ్యం బాపు కొంటె చూపు. వంశవృక్షం ప్రివ్యూ చూసి బయ టకు వస్తూ, ‘‘బాపూగారూ మీరె ప్పుడూ ట్రాజెడీలు తీసినట్టు లేదు’’ అన్నాడు చిత్ర నిర్మాత మాటవరుసగా. ‘‘తీశాక కొన్ని ట్రాజెడీలే అయినాయ్ లెండి’’ అన్నది బాపు జవాబు. ‘‘మీ సీతాకల్యాణం సెల్యు లాయిడ్ దృశ్యకావ్యం!’’ ‘‘అఫ్కోర్స్... ఎక్స్పోర్ట్ క్వాలిటీ’’ - పొగడ్తకి బాపు జవాబు. ఉత్ప్రేక్షలు, రిపార్టీలు బాపు నాలుక చివర ఉం టాయి. ‘‘మాకో మిత్రుడున్నాడు... రాజమండ్రిలో... శ్రీపాద పట్టాభి అని చాలా ఉత్తముడు. కాకపోతే కొంచెం అతి శయోక్తులు ఎక్కువ. బాపు, అక్కినేని సెట్లో జుట్టు జుట్టు పట్టుకోవడం చూశానంటాడు. అసాధ్యం కదా. ఇద్దరి జుట్టూ కలిపి కూడినా పిడికెడు అవదు’’- బాపు ఇలాంటి కబుర్లు సరదాగా ఎన్నైనా చెబుతారు. సింహం ఏమీ అనడం లేదులే అని కొంచెం చొరవకి ప్రయత్నిస్తే ఇంతే సంగతులు. దానికో లెక్కుంది. దానికో తిక్కుంది. ‘‘మీరు తీస్తున్న సీరియల్లో స్వర్గంలో డ్యాన్సులు చేస్తున్న అప్సరసలను చూస్తుంటే - నరకమే బెటరని పిస్తోంది’’. ‘‘... అయితే అలాక్కానివ్వండి’’ అని జవాబు రాశా రు. అంటే నరకానికే పొమ్మని దీవెన. ‘‘బాపుగారూ! మీ సాక్షి సినిమా నిజంగా స్ఫూర్తి దాయకం’’ అన్నాడొక పాత్రికేయుడు అభినందన పూర్వకంగా. ‘‘నిజంగానేనండీ. పులిదిండి గ్రామంలో పాట మీద హీరో హీరోయిన్ల పెళ్లి తీశాం. దరిమిలా అదే ఊరు అదే గుడిలో నిజంగానే ఆ హీరో హీరోయిన్లు కృష్ణ విజయ నిర్మల గార్లు పెళ్లాడి, సాక్షి సినిమాకి ప్రతిష్ట కల్పించారు’’ అన్నారు బాపు. అలాగ కల్యాణ ప్రదంగా బాపు సినీ జీవితం ఆరంభ మైంది. మూడు హిట్లు ఆరు ఏవరేజీలతో నలభై అయిదేళ్ల ప్రస్థానం సాగింది. బుద్ధిమంతుడు, ముత్యాలముగ్గు, మనవూరి పాండవులు, భక్త కన్నప్ప, సంపూర్ణ రామాయ ణం వగైరా సినిమాలు పెట్టుబడిని, పేరుని పెంచాయి. సీతాకల్యాణం, వంశవృక్షం లాంటి సినిమాలు పేరుని మాత్రం పెంచాయి. శ్రీరామరాజ్యం బాపు తీసిన చివరి సినిమా. ఎవరి టాక్ వారిదే అయి, ప్రేక్షకుల్లో ఏకాభిప్రా యం రానందున రామరాజ్యం డబ్బు చెయ్యలేదు. లవకు శకి శ్రీరామరాజ్యానికి ఎంత తేడా ఉంది అనే మీమాంసను ఒక సినీ పండితుడు పరిష్కరించాడు. ‘‘ఎన్‌టిఆర్‌కి బాల కృష్ణకి ఉన్నంత తేడా.. నేచురల్లీ’’ అన్నాడా పండితుడు. బాపుది కార్టూన్ చూపు. ఆ చూపులో రాముణ్ణి, కృష్ణు ణ్ణి కూడా స్పేర్ చెయ్యలేదు. ‘‘కుప్పించి ఎగసిన కుం డలంబుల కాంతి గగన భాగంబెల్ల గప్పి గొనగ...’’ భార తం యుద్ధకాండలో ప్రసిద్ధ పద్యం. ‘‘కుప్పించి ఎగిసేసరికి నడుం పట్టిందోయ్ బావా’’ అంటూ కృష్ణుడు ఆపసోపా లు పడే సన్నివేశం బాపు కొంటె చూపు. ‘‘మీరింకా అప్ప డాల కర్ర కార్టూన్స్‌ని దాటలేదు’’ - ఒక స్త్రీవాది ఆరోపిస్తే ‘‘గమనించండి. కిందటి వారం నుంచి సైకిల్ చెయిన్ వాడుతున్నా’’నని సవినయంగా జవాబిచ్చారు. ‘‘మన వాళ్లు...’’ శీర్షికతో ఆంధ్రపత్రికలో పాకెట్ కార్టూన్లు చాలా రోజులు వేశారు. 1966-67లో మరో ప్రముఖ డైలీ ఎడిట్ పేజీలో గిరీశం స్ట్రిప్ కార్టూన్ నడిపించారు. ఆ రోజుల్లో నీలం సంజీవరెడ్డి విగ్రహం చుట్టూ, బెజవాడ నేపథ్యంలో వ్యంగ్యాస్త్రాలు కురిసేవి. ఆంధ్రుల ‘‘ఉక్కురోషం’’ కార ణంగా ఒకరోజు ఆ విగ్రహం కుప్పకూలింది. మర్నాడు, ‘‘ఏంసార్! ఈ మధ్య బొత్తిగా కనిపించడం లేదు’’ అం టూ కార్టూన్ వ్యంగ్య వ్యాఖ్య.. ‘...ఆ బాపు కళ్లు ఇప్ప టికైనా చల్లబడ్డాయా’’ అని స్వయంగా నీలం వారే ఉక్రోష పడ్డారు. సత్సాంగత్యం బాపు ఆలోచనలకు, అయిడియా లకు సానలు దిద్దింది. నలుగురు కూర్చుని నవ్వుకునే వేళ బాపు రమణలు వస్తారు. వాళ్లు మాటలుగా అనుక్షణం గుర్తొ స్తారు. ఇది నిజంగా నిజం. (డిసెంబర్ 15 హాస్యర్షి బాపు జయంతి) (వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత) శ్రీరమణ