breaking news
Employee options
-
గూగుల్ గుడ్ న్యూస్: వారానికి 3 రోజులే ఆఫీస్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రాకతో ప్రజల జీవన విధానాల్లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థల ఉద్యోగులు గత సంవత్సరం నుంచి ‘వర్క్ ఫ్రమ్ హోం’ విధానం అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో కొన్ని మార్పులతో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగుల కోసం ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఈ నూతన పద్ధతి ప్రకారం గూగుల్ ఉద్యోగులు ఇకపై వారంలో కేవలం 3 రోజులు ఆఫీస్‌కు వస్తే సరిపోతుంది. మిగిలిన రెండు రోజులు వారు ఎక్కడి నుంచైనా పని చేసే వెసలుబాటును కల్పిస్తోంది. ఈ విషయాన్ని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ తన ట్విటర్ ద్వారా తెలిపారు. 3 రోజలు ఆఫీసుకు వస్తే చాలు కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టి గూగుల్ కార్యాలయాలను తిరిగి తెరిచినా 20 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోం) చేస్తారని, 20 శాతం మంది కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో పని చేస్తారు. ఈ క్రమంలో మిగిలిన 60 శాతం మందికి ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ పద్ధతిలో పనిచేసే వెసలుబాటు ఉంటుందని కంపెనీ సీఈవో వెల్లడించారు. గూగుల్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 1,40,000 మంది ఫుల్‌టైమ్ (పూర్తిస్థాయి) ఉద్యోగులున్నారు. భారత్‌లో గూగుల్ సంస్థకు పని చేసే ఉద్యోగులు ఎక్కువ మంది బెంగళూరు, హైదరాబాద్, ముంబై, గుర్గావ్లోనే ఉన్నారు. ( చదవండి: Tata Motors: టాటా మోటార్స్‌కు సీసీఐ షాక్! ) The future of work at Google is flexibility. The majority of our employees still want to be on campus some of the time yet many would also enjoy the flexibility of working from home a couple days a week…— Sundar Pichai (@sundarpichai) May 6, 2021 -
మా కొద్దు ప్లీజ్...!
నల్లగొండ : జిల్లా విద్యుత్ శాఖ బదిలీల్లో వింతపోకడలు చోటుచేసుకున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఈలు, ఏడీఈలు తమ రూటు మార్చారు. వీరితో పాటు రాజకీయ ఒత్తిళ్లు భరించలేని కొందరు ఉద్యోగులు కూడా ఆపరేషన్ వింగ్ వదిలేసి లూప్‌లైన్ బాట పట్టారు. జిల్లాలో ఏఈలు, ఏడీఈలు భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడడంతో ఉద్యోగుల ఆప్షన్ మేరకు వారు కోరుకున్న స్థానాలకే బదిలీ అయినప్పటికీ ప్రత్యేకంగా కొందరు ఉద్యోగులు మాత్రం తమ సేవలను కార్యాలయాలకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏఈ, ఏడీఈ పోస్టులతో పాటు లూప్లైన్లో కూడా ఖాళీలు భారీగానే ఉండటంతో ఎక్కువ మంది సీనియర్లు అదే బాట పట్టారు. ప్రధానంగా నకిరేకల్, నల్లగొండ సర్కిల్ పరిధిలో పనిచేసేందుకు వెనుకాడుతున్న ఉద్యోగులు ఈసారి లూప్‌లైన్ వైపే మొగ్గుచూపారు. విద్యుత్ శాఖ ఎస్ఈ భిక్షపతి కూడా ఉద్యోగుల ఆప్షన్లకే ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయ పైరవీలు, ఉద్యోగ సంఘాల అభీష్టం మేరకు ఒకరిద్దరు అధికారులకు తాము కోరుకున్న స్థానాలకు బదిలీ చేశారు. మంగళవారం రాత్రి పొద్దు పోయే వరకు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంలో విద్యుత్‌శాఖ తీవ్ర కసరత్తు చేసింది. ఎస్ఈ తెలిపిన వివరాల మేరకు ఏడీఈలు 22, ఏఈలు 51, సబ్‌ఇంజినీర్లు 57 మందిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలిపారు. వీరిలో హైదరాబాద్ నుంచి జిల్లాకు బదిలీపై వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇంత మందిని సర్దుబాటు చేసినప్పటికీ జిల్లాలో ఏఈ పోస్టులు 30 నుంచి 40 వరకు ఖాళీగానే ఉన్నాయి. అలాగే ఏడీఈలు 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిని బట్టి బదిలీ అయిన వారిలో ఎక్కువ మంది బయట పనిచేసేందుకు అయిష్టత వ్యక్తం చేయడంతోనే చాలా మంది ఉద్యోగులు కార్యాలయంలో పనిచేసేందుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం బదిలీల్లో ఆపరేషన్ వింగ్‌లో పనిచేసేందుకు ఏఈలు, ఏఈడీలు బయపడుతున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు భరించలే ని కొందరు ఉద్యోగులను బలవంతంగా మండలాలకు పంపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది. కరెంట్‌స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కోసం అధికార పార్టీకి చెందిన వ్యక్తుల నుంచి బెదిరింపు ధోరణిలో హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ప్రత్యక్ష సేవలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రామన్నపేట, మునుగోడు ఏడీఈ లను హైదరాబాద్‌కు బదిలీ చేసినప్పటికీ వారు మళ్లీ నల్లగొండకు తిరిగి వచ్చారు. రామన్నపేట ఏడీఈని ప్రజలతో సంబంధం లేని ఎంఆర్టీ వింగ్‌కు బదిలీ చేస్తూ హుజూర్‌నగర్‌కు పంపించారు. అలాగే మునుగోడు ఏడీఈని నల్లగొండ రూరల్‌కు నియమించారు. నల్లగొండ ఏఈడీ నాగిరెడ్డిని రామన్నపేటకు బదిలీ చేయగా...ఆయన స్థానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన సంగెం వెంకటేశ్వర్లును నియమించారు.