breaking news
edge of danger
-
కొంచెం పట్టు తప్పినా ప్రాణాలు దక్కవు
"మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు" అని ఓ సామెత. కానీ ఇక్కడ చెప్పుకునే వ్యక్తి విషయంలో దీన్ని రివర్స్‌లో చెప్పాలేమో! 'చేతలు కోటలు దాటుతాయి.. కానీ మాటలు గడప దాటవు' అని! ఎందుకంటే అతను సాహసాలు చేస్తానంటూ బీరాలు పలకలేదు. సైలెంటుగా పోయి చేయాలనుకున్నది చేసి చూపించాడు. అంతే, కానీ అది చూసిన మనకు ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో అన్న భయం వేయక మానదు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. కొండంచున వెళ్లి నిలబడ్డాడు. అది కూడా పాదాన్ని సగం కొండకు ఆనించి, మిగతా సగం గాలిలోనే ఉంచాడు. ఆ తర్వాత గాలిలో ఎగిరి పల్టీ కొట్టాడు. (మనం నిద్రిస్తే కరోనా కూడా నిద్రిస్తుందట!) ఈ క్రమంలో అతను లోయలో పడిపోతాడేమోనని మనకు భయం వేసినప్పటికీ.. ఎంతో అనుభవమున్నవాడిలా తిరిగి కొండపైనే దిగాడు. కనీసం అతను ఈ ప్రమాదకర విన్యాసం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్న ఆనవాళ్లూ కనిపించడం లేదు. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా "అతని ప్రతిభకు మెచ్చుకోవాలా? లేదా మూర్ఖత్వంగా కొట్టిపారేయాలా?" అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 14 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మెజారిటీ జనాలు అతడిని తిట్టిపోస్తుంటే కొద్ది మంది మాత్రం గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. 'స్టంట్ చేస్తున్న వ్యక్తితో పాటు దాన్ని చిత్రీకరిస్తున్న వ్యక్తికి కూడా బుర్ర పని చేయడం లేదు', 'కొంచెం పట్టు కోల్పోయినా ప్రాణాలు దక్కవు' అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. (హుర్రే: ఆర్డర్ చేసిందొకటి.. వచ్చింది మరొకటి) -
ప్రమాదం అంచున విజయవాడ!
కృష్ణా నదిపై విజయవాడలో నిర్మించిన ప్రకాశం బ్యారేజీకి ముప్పు పొంచి ఉంది. భారీ వరదొస్తే ప్రకాశం బ్యారేజీ ఉనికే ప్రశ్నార్థకం కానుంది. అనుకోని విపత్తు ఎదురైతే బెజవాడ నగరానికి జలప్రళయం సంభవించే ప్రమాదం ఉంది. బ్యారేజీకి ప్రాణంగా భావించే 70 క్రస్ట్ గేట్లు తుప్పు పట్టాయి. పొరలు పొరలుగా ఊడిపోతున్నాయి. అయినా, ఇరిగేషన్ శాఖ అధికారులలో చలనం లేదు. నాలుగు జిల్లాలకు వరప్రదాయిని అయిన ఈ ప్రకాశం బ్యారేజ్‌ని పట్టించుకునేవారు లేరు. రెండు అంగులాల మందం ఉండే 70 క్రస్ట్ గేట్లు తప్పు పట్టి పెచ్చులు ఊడుతున్నాయి. దీన్ని ఇలాగే వదిలేస్తే మరి కొద్ది రోజుల్లో ఈ గేట్లు తుప్పు పట్టి మరీ పలుచగా మారే ప్రమాదం ఉంది. 2009 తర్వాత ప్రకాశం బ్యారేజీకి భారీ వరద ఎప్పుడూ రాలేదు. మళ్లీ ఆనాటి పరిస్థితి వస్తే ఏమిటి అని ఆలోచించడానికే భయమేస్తోంది. విజయవాడను రాజధానిని చేస్తామని చెబుతున్నారు. ఈ బ్యారేజీని మాత్రం పట్టించుకునే నాధుడు లేడు.