breaking news
Dravida Munnetra Kazhagam
-
అవిశ్వాసం తీర్మానం కోసం గవర్నర్ చెంతకు
సాక్షి, చెన్నై: దినకరన్ వర్గం తిరుగుబాటుతో మైనారిటీలో పడిన పళనిస్వామి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రతిపక్ష డీఎంకే ప్రయత్నిస్తోంది. పళని సర్కారు వెంటనే అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో స్టాలిన్ నేతృత్వంలో ప్రతిపక్ష నేతలు ఆదివారం గవర్నర్ సీ విద్యాసాగర్‌రావును కలిశారు. రాజ్ భవన్లో గవర్నర్ ను కలిసిన స్టాలిన్ వెంట డీఎంకే నేతలతోపాటు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల నేతలు ఉన్నారు. పళనిస్వామి ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు అనుమతించాలని ఈ సందర్భంగా స్టాలిన్ గవర్నర్‌ను కోరారు. శశికళ వర్గంలో ఇప్పటికీ 21మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేరారు. మరింతమంది అన్నాడీంఎకే ఎమ్మెల్యేలు తమ గూటికి చేరుకునే అవకాశముందని దినకరన్ వర్గం చెప్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా బలపరీక్ష జరిగితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? పళనిస్వామికి ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ధనపాల్ వేటు వేస్తారా? పళనిస్వామి-పన్నీర్ సెల్వం ద్వయం బలపరీక్ష గట్టెక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ముందు పళని బలం తేలాల్సిందే!
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ సీ విద్యాసాగర్ రావును ప్రతిపక్ష నేత స్టాలిన్ కోరారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ ను కలిసిన డీఎంకే అధినేత తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచాలని విజ్నప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మైనార్టీలో ఉందని తెలిపిన స్టాలిన్ పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడ్డారంటూ 19మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైన విషయాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించారు. రాజ్యాంగ బద్ధంగా పళని ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని వివరించారు. గతంలో సభలో బలనిరూపణ సందర్భంగా వ్యతిరేకంగా ఓటేసిన పన్నీర్ సెల్వం అండ్ గ్రూప్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని స్పీకర్ ధన్పాల్ ఇప్పుడు పార్టీ విప్ ఆదేశాలతో దినకరన్ వర్గానికి నోటీసులు పంపటం ఆశ్చర్యంగా ఉందని స్టాలిన్ తెలిపారు.