breaking news
dra
-
లంకను ఆడుకున్నారు!
కోల్‌కతా: శ్రీలంక క్రికెట్ జట్టుకు భారత గడ్డపై రాబోయే ‘సీన్’ అర్థమైంది. భారత ‘తృతీయ శ్రేణి’ జట్టు బ్యాట్స్‌మెన్ కూడా లంక బౌలర్లను అలవోకగా ఆడుకున్నారు. ఏమాత్రం పదును లేని లంకను ఎదుర్కొని బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శామ్సన్ (143 బంతుల్లో 128; 19 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... రోహన్ ప్రేమ్ (39; 5 ఫోర్లు), జీవన్‌జ్యోత్ సింగ్ (35; 3 ఫోర్లు), బావనక సందీప్ (33 నాటౌట్; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్లో జరిగిన ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆదివారం ‘డ్రా’గా ముగిసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే తిరిమన్నె వరుస ఓవర్లలో తన్మయ్ అగర్వాల్ (16; 3 ఫోర్లు), ఆకాశ్ భండారి (3)లను అవుట్ చేసి లంకకు శుభారంభం అందించాడు. అయితే శామ్సన్, జీవన్‌జ్యోత్ లంక రెగ్యులర్ బౌలర్లు హెరాత్, దిల్రువాన్ పెరీరా, లక్మల్లను సమర్థంగా ఎదుర్కొని మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఆ తర్వాత కూడా శామ్సన్... రోహన్ ప్రేమ్‌తో 71 పరుగులు, సందీప్‌తో 85 పరుగులు జత చేశాడు. చివరకు 75 ఓవర్ల తర్వాత మ్యాచ్‌ను నిలిపివేసేందుకు ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరించారు. జట్టు సభ్యులందరికీ ప్రాక్టీస్ ఆశించిన శ్రీలంక ఏకంగా 14 మందితో బౌలింగ్ చేయించడం విశేషం. భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఈ నెల 16 నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. స్కోరు వివరాలు శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 411/9 డిక్లేర్డ్; బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (ఎల్బీ) (బి) తిరిమన్నె 16; జీవన్‌జ్యోత్ సింగ్ (సి) డిక్వెలా (బి) పెరీరా 35; ఆకాశ్ భండారి (సి) షనక (బి) తిరిమన్నె 3; శామ్సన్ (సి) డిక్వెలా (బి) సమరవిక్రమ 128; ప్రేమ్ (ఎల్బీ) (బి) డి సిల్వ 39; సందీప్ (నాటౌట్) 33; జలజ్ సక్సేనా (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (75 ఓవర్లలో 5 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–27; 2–31; 3–99; 4–170; 5–255. బౌలింగ్: కరుణరత్నే 4–2–7–0; తిరిమన్నె 6–0–22–2; మాథ్యూస్ 5–2–21–0; షనక 8–0–36–0; హెరాత్ 6–0–15–0; కుషాల్ పెరీరా 9–1–22–1; లక్మల్ 4–1–11–0; గమగే 5–1–19–0; సందకన్ 12–1–54–0; ధనంజయ డి సిల్వా 7–1–35–1; విశ్వ ఫెర్నాండో 1–0–16–0; సమరవిక్రమ 4–0–13–1; రోషన్ సిల్వ 3–1–3–0; చండిమాల్ 1–0–3–0. -
మెయిన్ ‘డ్రా’కు రాహుల్, రుత్విక, వృశాలి
నాగ్‌పూర్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో చిట్టబోయిన రాహుల్ యాదవ్ (తెలంగాణ), గద్దె రుత్విక శివాని (పీఎస్‌పీబీ), గుమ్మడి వృశాలి (తెలంగాణ), ఎం.తనిష్క్ (ఆంధ్రప్రదేశ్) మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. ఆదివారం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ముగిశాయి. పురుషుల సింగిల్స్ చివరి రౌండ్ మ్యాచ్‌లో రాహుల్ యాదవ్ 21–12, 21–13తో కార్తీక్ జిందాల్ (హరియాణా)పై నెగ్గగా... మహి ళల సింగిల్స్ చివరి రౌండ్ మ్యాచ్ ల్లో రుత్విక 21–8, 21–11తో మాన్సి సింగ్ (ఉత్తరప్రదేశ్)పై, వృశాలి 21–16, 21–13తో త్రిషా జాలీ (కేరళ)పై, తనిష్క్ 21–19, 21–19తో కనిక కన్వల్ (రైల్వేస్)పై విజయం సాధించారు. సోమ వారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆర్యమాన్ (ఎయిరిండియా) తో కిడాంబి శ్రీకాంత్ (పీఎస్‌పీబీ); సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ)తో రాహుల్ యాదవ్; అన్సల్ (ఉత్తరప్రదేశ్)తో పారుపల్లి కశ్యప్ (పీఎస్‌పీబీ) ఆడతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పీవీ సింధు... ఇంతకాలం జాతీయస్థాయి పోటీల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఈ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పోటీపడ నుంది. ఇటీవలే ఆమెను ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. తొలి రౌండ్లో రేవతి దేవస్థలే (మహారాష్ట్ర)తో సింధు ఆడుతుంది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వృశాలితో సైనా (పీఎస్‌పీబీ); శైలి రాణే (రైల్వేస్)తో శ్రీకృష్ణప్రియ (ఆర్బీఐ); అనురా (ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ)తో తనిష్క్; రసిక రాజే (ఆర్బీఐ)తో రుత్విక శివాని; పూర్వా (ఎయిరిండియా)తో సాయి ఉత్తేజిత రావు (ఏఏఐ) తలపడతారు. -
సమన్వయంతో పని చేయండి
విజయనగరం కంటోన్మెంట్:ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. సోమవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మం డల సమావేశాలు నిర్వహించినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించాలన్నారు. డీఆర్డీఏ ద్వారా అమలవుతున్న ఎన్‌హెచ్‌జీ గ్రూపుల వివరాలు, వాటి పనితీరు, శిక్షణలు, బ్యాంకు లింకేజి, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, స్త్రీనిధి, ఆమ్ ఆద్మీ, బంగారు తల్లి, జన శ్రీ పథకాలపై డీఆర్డీఏ పీడీ టి.జ్యోతి పవర్ పాయింట్ ప్రజం టేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ 1999 నుంచి ఇప్పటివరకు జిల్లాలో బ్యాంక్ లింకేజి కింద రూ.212.2 కోట్లు పంపిణీ చేశామన్నారు. 2014-15కు వార్షిక ప్రణాళిక కింద రూ.552 కోట్లను వివిధ పద్దుల కింద పంపిణీ చేయడానికి లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. నిరుపేద ల సమగ్రాభివృద్ధి పథకం కింద రూ.130 కోట్లను వస్తువులు, యం త్రాల రూపంలో అందించామన్నారు. ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం డీఆర్డీఏ ద్వారా 183 ఎన్డీసీసీలను నడిపిస్తున్నామని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి అనేకమంది గ్రామీణ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, దీనిపై వారికి అవగాహన కల్పించాలన్నారు. బంగారు తల్లి పథకం కింద ఆడపిల్లకు 21 ఏళ్లు వచ్చే వరకూ వివిధ దశల కింద రూ.1,55,500 లక్షలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకూ 10,186 మంది ఈ పథకం కింద నమోదైనట్టు చెప్పారు. చిన్నారులకు పూర్వ విద్యను అందించేందుకు 60 బాల బడులను నినర్వహిస్తున్నామని, వాటిలో 1036 మంది పిల్లలు పూర్వ వి ద్యను అభ్యసిస్తున్నారని దీని పర్యవేక్షణ శోధన అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోందన్నారు. ఇంటితో పాటు మరుగుదొడ్డి తప్పనిసరి గృహ నిర్మాణాలు చేపట్టేటపుడు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండేలా చూడాలని మంత్రి మృణాళిని ఆదేశించారు. ఈ సం దర్భంగా జిల్లాలోని గృహ నిర్మా ణ శాఖ ప్రగతిని పీడీ కుమార్ వివరించారు. ఇప్పటివరకు 6,03,320 గృహాలను మంజూరు చేశామన్నారు. ఇందులో 4,90,000 పూర్తయ్యాయని, 1,13,000పైగా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. గ్రా మీణ ప్రాంతాల్లో ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.లక్షా 5వేలు చొప్పున నిర్మాణ వ్యయాన్ని అందిస్తున్నామన్నారు. ఇతరులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.70 వేలు, పట్టణ ప్రాంతాలల్లో రూ.80వేలను అందిస్తున్నట్టు తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ పరిధిలో ఆర్ఆర్ ప్యాకేజి కింద 3,920 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇంటి నిర్మాణం కోసం రూ.50వేలు, మరుగుదొడ్డి కోసం మూడు వేలు, అందిస్తున్నట్టు తెలిపారు.ఈ సమీక్షలో జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, పార్వతీపురం, ఎస్.కోట ఎమ్మెల్యేలు బొబ్బిలి చిరంజీవులు, కోళ్ల లలితకుమారి, జేసీ రామారావు, ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్డీఓ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. రాత్రి పది తర్వాత మద్యం షాపుల బంద్ మద్యం దుకాణాలను ఉదయం 11 గంటల నుంచి ప్రారంభించి రాత్రి పదిగంటలకు మూసేయాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని చెప్పారు. సోమవారం ఆమె డీఆర్డీఏ సమావేశ మందిరం లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెల్ట్ షాపులు ఇంకా కొన్ని చోట్ల నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుతోందనీ, వాటిపై కొరడా ఝళిపిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం బెల్టు షాపులు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధికి కృషి జిల్లాలో పలు అభివృద్ధి పథకాలు నత్తనడకన సాగుతున్నాయని. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, యంత్రాంగం కష్టపడి పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. పనిచేసే చోటే ప్రభుత్వ సిబ్బంది నివాసం ఉండాలన్నారు. చెరుకు రైతులకు సీతానగరం సుగర్ ఫ్యాక్టరీ చెల్లింపులు చేయడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్‌కు సూచించామన్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా సబ్ స్టేషన్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని భరో సా ఇచ్చారు. చెన్నైలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. వలసల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని సాక్షి విలేకరి ప్రశ్నించగా.. వలసలు వెళ్లకుండా నిరోధించాలని గ్రామ సర్పంచ్‌లు, పెద్దల ద్వారా ప్రచారం కల్పించనున్నామని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చెన్నైలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి లో ఆరుగురికి జిల్లా నిధుల నుంచి రూ.5లక్షల చొప్పున పరిహా రం అందించామన్నారు. మిగిలిన వారికి వ్యక్తిగత చెక్కులు తయారుచేసి పంపిస్తామని కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారన్నారు. గాయపడిన వారికి రూ.50వేలు, ప్రతి కుటుంబానికీ వేతన నష్టం కింద మరో రూ.25వేలు అందిస్తామని చెప్పారు. చెన్నై ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల పరిహారం తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు.