breaking news
Dr APJ Abdul Kalam
-
డా. ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి అరుదైన ఫోటోలు
-
హైదరాబాద్ డీఆర్డీవోకి అబ్దుల్ కలాం పేరు
న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని డీఆర్డీవోకు భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. గురువారం అబ్దుల్ కలాం 84వ జన్మదినం. ఈ నేపథ్యంలో డీఆర్డీవోకి ఆయన పేరును రేపు ప్రకటించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. అబ్దుల్ కలాం 1982లో డీఆర్డీవోలో చేరారు. రెండు దశాబ్దాలపాటు ఆయన ఆ సంస్థలో విధులు నిర్వహించారు. -
'డీఆర్డీవోకు కలాం పేరు పెట్టండి'
హైదారాబాద్: హైదరాబాద్‌లోని డీఆర్డీఓకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్‌తో అబ్దుల్ కలాంకు ఎంతో అనుబంధం ఉందని కేసీఆర్ తెలిపారు. మనదేశ రక్షణ రంగంలో స్వయం సంవృద్ధి సాధించేందుకు హైదరాబాద్ డీఆర్డీఓలో జరిగిన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయన్నారు. డీఆర్డీఓకు గతంలో డైరెక్టర్‌గా పనిచేసిన కలాంపేరు పెట్టడం సముచితం అని భావిస్తున్నామని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. -
పాలెం విమానాశ్రయానికి కలాం పార్థివదేహం
-
'చనిపోతే సెలవు ఇవ్వొద్దన్నారు'
హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తనకు ఆత్మీయుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాంటి ఆత్మీయుడిని కోల్పోవడం బాధకరంగా ఉందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చంద్రబాబు ఆయన మంత్రి వర్గం అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... నిరంతరం శ్రమించడం వల్లే అబ్దుల్ కలాం అత్యున్నత శిఖరాలు చేరుకున్నారన్నారు. కలాం ఆత్మకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్' యువతకు ఓ స్ఫూర్తి అన్నారు. నిజమైన భారతరత్న అబ్దుల్ కలాం అని అన్నారు. జీవితాంతం పరిశోధనలపై దృష్టి పెట్టిన వ్యక్తి ఆయన అని కలాం సేవలను కొనియాడారు. తాను చనిపోతే సెలవు ఇవ్వొద్దని చెప్పిన మహనీయుడు కలాం అని శ్లాఘించారు. ఆయన చెప్పిన కొన్ని స్ఫూర్తివంతమైన మాటలను ప్రపంచం ఎప్పటికీ మరిచిపోలేదన్నారు. నీతి నిజాయితీ, పట్టుదలతో ఆయన పని చేసేవారని చెప్పారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం చిన్ననాటి నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టే వరకు ఆయన జీవిత విశేషాలను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని ... ఆయన ఏ కలలైతే కన్నారో... ఆ విధంగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు యువతకు సూచించారు. అబ్దుల్ కలాం స్టేట్స్ మెన్ అని స్పష్టం చేశారు. దేశానికి స్టేట్స్ మెన్‌గా ఉండి... దేశభక్తితో దేశానికి అబ్దుల్ కలాం సేవ చేశారన్నారు. తుది శ్వాస వరకు అబ్దుల్ కలాం పని చేస్తూనే ఉన్నారన్నారు. అలాగే ఇటీవల అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆహార ప్రక్రియ విధానంపై ఏర్పాటు చేసిన సభకు అబ్దుల్ కలాం విచ్చేసి ప్రసంగించారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలలో భారతరత్న అబ్దుల్ కలాంకు నివాళులు ఆర్పించాలని తమ ప్రభుత్వం ఆదేశించిందని చంద్రబాబు చెప్పారు.