breaking news
Domestic indices
-
మార్కెట్‌కు మాంద్యం భయం
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఒకశాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 886 పాయింట్లు క్షీణించి 81 వేల దిగువన 80,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 293 పాయింట్లు పతనమై 25వేల స్థాయిని కోల్పోయి 24,718 వద్ద నిలిచింది. ఇటీవల వెల్లడైన దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం, దలాల్ స్ట్రీట్ వరుస రికార్డు ర్యాలీతో అధిక వాల్యుయేషన్ల ఆందోళన పరిణామాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణ వైపు పురిగొల్పాయి. ఒక దశలో సెన్సెక్స్ 999 పాయింట్లు క్షీణించి 80,869 వద్ద, నిఫ్టీ 324 పాయింట్లు కుప్పకూలి 24,686 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. రియలీ్ట, మెటల్, ఆటో, ఐటీ, కమోడిటీ, టెక్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల భారీ పతనంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.58% 1.19 శాతం నష్టపోయాయి. సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.4.46 కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.457 లక్షల కోట్లకు దిగివచి్చంది.ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం అమెరికాలో జూలై తయారీ రంగ పీఎంఐ, ఉద్యోగ ఉద్యోగ కల్పన గణాంకాలు నిరాశపరచడంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తాయి. అలాగే ఫెడరల్ రిజర్వ్ సెపె్టంబర్లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలను బలహీనపరిచింది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలైన టెస్లా, ఆల్ఫాబెట్, ఎన్విడీయా, మైక్రోసాఫ్ట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడం ఆగ్నికి ఆజ్యం పోశాయి. నాస్డాక్ 3% క్షీణించి 16,683 వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీల షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ సూచీ జూలై 10న జీవితకాల గరిష్టం (18,671) నుంచి ఏకంగా 10%పైగా కుప్పకూలింది. డోజోన్స్ ఇండెక్స్ 2.5% నష్టపోయి 39,430 వద్ద కదలాడుతోంది. అమెరికా మార్కెట్ల నష్టాల ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లూ డీలా పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో జపాన్ సూచీ నికాయ్ 6% క్షీణించింది. తైవాన్ ఇండెక్స్ 5%, కోప్సీ సూచీ 4%, హాంగ్‌కాంగ్ సూచీ 2% కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలతో చైనా షాంఘై సూచీ ఒకశాతం నష్టపోయింది. ఇక మధ్య ప్రాచ్యంలో విస్తరిస్తున్న యుద్ధ భయాలతో యూరప్ మార్కెట్లూ 2.50% నుంచి రెండుశాతం పైగా నష్టపోయాయి. -
గ్లోబల్ ర్యాలీతో మార్కెట్లకు జోష్
♦ రెండో రోజూ పెరిగిన దేశీ సూచీలు ♦ వారం గరిష్టానికి సెన్సెక్స్, 267 పాయింట్లు అప్ ముంబై: చమురు ధరల రికవరీతో అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీకి అనుగుణంగా గురువారం దేశీ స్టాక్‌మార్కెట్ కూడా లాభపడింది. ఐటీ, బ్యంకులు, హెల్త్‌కేర్ తదితర రంగాల స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో సూచీలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 267 పాయింట్ల పెరుగుదలతో వారం రోజుల గరిష్టం 23,649 పాయింట్ల వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 83 పాయింట్ల లాభంతో 7,192 వద్దముగిసింది. చమురు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపే విషయంలో సౌదీ అరేబియా, రష్యా చెంతన ఇరాన్ కూడా చేరడంతో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ బ్యారెల్ ధర 35 డాలర్ల స్థాయికి ఎగిసింది. అంతర్జాతీయంగా బలహీన ఆర్థిక పరిస్థితుల కారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది మరో నాలుగు సార్లు పాలసీ రేట్లను పెంచే అవకాశాలుండకపోవచ్చని సంకేతాలు ఇవ్వడం తదితర సానుకూల పరిణామాల ఊతంతో ఆసియా, యూరప్ మార్కెట్ల సూచీలు పెరిగాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. చైనా మందగమనం వంటి అంతర్జాతీయ ప్రతికూలాంశాల ప్రభావం పెద్దగా ఉండకపోవటం వల్ల, కమోడిటీల ధరల తగ్గుదల ప్రయోజనాల వల్ల... భారత్ 2016, 2017లో 7.5 శాతం వృద్ధి సాధించగలదంటూ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనాలు వెలువరించడమూ మార్కెట్లకు తోడ్పాటునిచ్చింది. డాక్టర్ రెడ్డీస్ జూమ్... గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 23,536 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 23,735-23,448 మధ్య తిరుగాడింది. చివరికి 1.14 శాతం లాభంతో 23,649 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 7,215-7,128 పాయింట్ల మధ్య తిరుగాడి చివరికి 1.17 శాతం లాభంతో 7,192 వద్ద ముగిసింది. స్టాక్స్ విషయానికొస్తే 44.85 లక్షల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అత్యధికంగా 4.5 శాతం లాభపడి రూ.3,095 వద్ద ముగిసింది. జన్యుమార్పిడి చేసిన పత్తి విత్తనాల మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై సీసీఐ విచారణ వార్తలతో మోన్శాంటో షేరు 3 శాతం క్షీణించింది. 30 షేర్ల సెన్సెక్స్‌లో 20 స్టాక్స్ లాభపడ్డాయి. బీఎస్ఈలో రంగాలవారీ సూచీలు చూస్తే.. ఐటీ 1.94%, టెక్నాలజీ 1.9%, హెల్త్‌కేర్ 1.78%, క్యాపిటల్ గూడ్స్ 1.59% పెరిగాయి. మొత్తం 1,418 షేర్లు లాభాల్లోనూ.. 1,110 స్టాక్స్ నష్టాల్లోను, 155 స్టాక్స్ స్థిరంగాను ముగిశాయి. ఆసియాలో హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ తదితర కీలక సూచీలు 1.22-2.32 శాతం పెరిగాయి. అయితే, చైనా షాంఘై సూచీ మాత్రం 0.16 శాతం తగ్గింది. అటు యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు 0.24-0.47 శాతం మేర లాభాలతో ట్రేడవగా.. బ్రిటన్ సూచీలు 0.46 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి.