breaking news
ditches
-
జోరువానతో జల సవ్వడి
-
చెరువులకు జల కళ..
అందోలు, అన్నాసాగర్ పెద్ద చెరువులకు వర్షపు నీరు రైతన్నల్లో ఆనందం జోగిపేట : అందోలు మండలంలోని చెరువులు, కుంటలు నీటితో కళ కళలాడుతున్నాయి. ఐదు రోజుల క్రితం ఏ మాత్రం నీళ్లే లేని అన్నాసాగర్ పెద్ద చెరువులో ఒకేసారి భారీగా నీరు వచ్చి చేరింది. రెండు మాసాల క్రితం మిష¯ŒS కాకతీయ పథకం కింద ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టారు. చెరువులోకి కాల్వల ద్వారా బ్రాహ్మణపల్లి, నేరడిగుంట, డాకూర్ గ్రామాలమీదుగా నీరు వచ్చి చేరింది. అలాగే అందోలు పెద్ద చెరువులోకి వర్షపు నీరు వచ్చి చేరింది. నాలుగు రోజులు నుంచి ఈ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో గ్రామాల్లోని కుంటల్లో కూడా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో 5 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు అంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. అన్నాసాగర్ చెరువు కింద రైతులు వరి నాట్లు దాదాపు పూర్తి చేస్తున్నారు. పోసానిపేట, డాకూరు, అక్సా¯ŒSపల్లి, జోగిపేట, అందోలు, కొడెకల్, నాదులాపూర్, తాలెల్మ ప్రాంతాల్లోని కుంటల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రతిరోజూ ఈ ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. వారం పాటు ఇలాగే వర్షాలు కురిస్తే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. చెరువులోకి నీరు రావడం సంతోషంగా ఉంది అన్నాసాగర్ పెద్ద చెరువులో ఇటీవల మిష¯ŒS కాకతీయ పథకం కింద పూడిక తీత పనులు చేపట్టారు. ఇది కొంతమేరకు ఉపయోగపడింది. ఖరీఫ్ సీజ¯ŒS ప్రారంభంలో చుక్కనీరు లేకపోవడంతో ఆందోళన చెందాం. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షపు నీరు చెరువులోకి చేరింది. – మల్లేశం, రైతు , అన్నాసాగర్ చెరువులు నిండితేనే ప్రయోజనం పోసానిపేట చెరువులోకి వేరే కాలువల ద్వారా నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కేవలం వర్షం నీరుతో మాత్రమే చెరువు నిండే అవకాశం ఉంది. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాకాలంలో అనుకున్నంతగా వర్షాలు కురుస్తే రైతులు గట్టెక్కినట్లే. – దుర్గయ్య, రైతు, పోసానిపేట -
దశ మారేనా!
‘మిషన్ కాకతీయ’ ⇒ చెరువుల పునరుద్ధరణకు కసరత్తు ⇒ నేడు జిల్లాకు మంత్రి హరీశ్‌రావు రాక ⇒ నీటి వనరుల నవీకరణపై సమీక్ష ⇒ హాజరు కానున్న మంత్రి పోచారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చెరువులు, కుంటల కింది ఆయకట్టుకు మం చిరోజులొచ్చాయి. ‘మిషన్ కాకతీయ’ పథకం కింద చెరువులు, కుంటలను మరమ్మతు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమలు తీరు తెన్నులను సమీక్షించేందుకు నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాలవారీగా అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభో త్సవాలలో పాల్గొననున్నారు. జడ్పీ సమావేశ మందిరం లో ‘మిషన్ కాకతీయ’పై జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చనున్నారు. ఈ సమావేశానికి మంత్రి పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవితతోపాటు శాసనసభ, శాసనమండలి సభ్యులు కూడా హాజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదీ ‘మిషన్ కాకతీయ’ తీరు ‘మిషన్ కాకతీయ’లో భాగంగా ప్రభుత్వం రాష్ర్టవ్యాప్తంగా విడతలవారీగా 46,531 చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణకు కార్యాచరణ రూపొం దించింది. ఇందులో మొదటి విడతగా 9,971 చెరువులు, కుంటలను తీసుకుంది. జిల్లాలో మొత్తం 3,251 చెరువులు, కుంటలు ఉండగా, మొదటి విడతగా 630 చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం నీటిపారుదలశాఖ అధికారులు నిజామాబా ద్, బోధన్, కామారెడ్డి డివిజన్లలో 450 చెరువులు, కుంటలను సర్వే చేశారు. 158 చెరువులు, కుంటల కోసం రూ.84.89 కోట్ల నిధులు కావాలని అంచనా వేసి, ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వాటి మంజూ రు లభించింది. ఈ పనులకు ఇ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు కూడ ఆహ్వానించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 12న టెండర్లు తెరిచి పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో పలుచోట్ల చెరువులు, కుంటలు ఆక్రమణలు, కబ్జాలకు గురి కాగా, రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదన్న ఆరోపణ లు ఉన్నాయి. నిజామాబాద్ సమీపంలో రామర్తి చెరువుతో కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పట్టణ శివారులలో చెరువులు కబ్జాదారుల కోరలలో చిక్కుకున్నాయి. ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ, పిట్లం, భీమ్‌గల్, నిజాంసాగర్ మండలాలలో విపరీతంగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలకు తొలగించకపోతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మిషన్ కాకతీయ’కు ప్రతిబంధకాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి హరీష్‌రావు పర్యటన ఇలా మంత్రి తన్నీరు హరీష్‌రావు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 9.15 గంటలకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త ఇంటికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 10 గంటలకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పా టు చేసిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ సిస్టమ్, మహిళా రైతుల విశ్రాంతి గృహాలను ప్రారంభిస్తారు. 11 గంట లకు జడ్పీ సమావేశ మందిరంలో ‘మిషన్ కాకతీ య’పై వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతి నిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి సదాశి వనగర్ మండలం భూంపల్లి చెరువును పరిశీలిస్తారు. 4 గంటలకు గాంధారి మండలం గుజ్జులడ్యామ్, 4.45 గంటలకు కాటేవాడి డ్యామ్‌ను సందర్శిస్తారు. 5 గంటలకు గాంధారి మండల కేంద్రంలో ‘ప్రెస్‌మీట్’ నిర్వహించిన అనంతరం 5.30కు గాంధారి లోనే చిన్న నీటిపారుదల అధికారులతో సమీక్ష నిర్వహించి 6 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. -
ఘాటుగా స్పందించిన కుష్బు
చెన్నై : సినీ రంగంలో అనుభవంతో పాటు రాజకీయాల్లో సినీనటి కుష్బు రాటుదేలారు. అయితే ఆమె ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ డేరింగ్ లేడీ ఏ విషయమైనా తనకు తప్పు అనిపిస్తే వెంటనే నిర్భయంగా చెప్పేస్తారు. ఇటీవల వర్షాల కారణంగా నగరంలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గుంతలు జన జీవనానికి ప్రమాదకరంగా మారాయి. దాంతో అధికారులు రోడ్లపై తాత్కాలిక మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వ్యవహారంపై కుష్బు ఘాటుగా స్పందించారు. ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ ''వర్షాల అనంతరం నగరాల్లోని రోడ్లను చూస్తుంటే మనం ఎందుకు పన్నులు చెల్లిస్తున్నామని... ప్రశ్నించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా గుంతలు, కోతలు, చేతికందే ఎత్తులో కరెంటు తీగలు ప్రమాదకరంగా మారాయి. ప్రజలందరూ పన్నుకడుతున్నారు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి'' అంటూ వ్యాఖ్యలు చేశారు.