dharmavaram railway station
-
ధర్మవరంలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం
అనంతపురం: తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. బుధవారం అనంతపురం జిల్లాలోని ధర్మవరం రైల్వేస్టేషన్లో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రైల్వే విశ్రాంతి గదుల నిర్మాణ పనులను తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. అంతేకాకుండా కాంట్రాక్టర్ రామ్‌పై దాడి చేశారు. స్కార్పియో వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. గదుల నిర్మాణ పనులను తమకే అప్పగించి వెళ్లిపోవాలని కాంట్రాక్టర్‌ను టీడీపీ కార్యకర్తలు హెచ్చరించినట్టు సమాచారం. -
రైల్లో పురిటి నొప్పులు... కాన్పు చేసిన ప్రయాణికులు
అనంతపురం : పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తున్న మహిళ రైల్లోనే ప్రసవించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో ముంబయి - నాగర్‌కోయల్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం చోటుచేసుకుంది. సదరు రైల్లో ప్రయాణిస్తున్న మహిళకు ఒక్కసారిగా నొప్పులు అధికమయ్యాయి. దీంతో తోటి ప్రయాణికుల సహకరించి ఆమెకు రైల్లోనే కాన్పు చేశారు. ఇంతలో రైలు ధర్మవరం చేరుకుంది. స్టేషన్ అధికారుల సహాయంతో తల్లి బిడ్డను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు.