breaking news
Devashish
-
పట్టాలు కాదు.. పనిలో నైపుణ్యం కావాలి
న్యూఢిల్లీ: టెక్నాలజీ పరంగా వేగవంతమైన పరివర్తన నేపథ్యంలో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలు, పోటీతత్వంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు టాగ్డ్ సీఈవో దేవాశిష్ శర్మ తెలిపారు. సంప్రదాయ డిగ్రీలకు బదులు సంభాషణ నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్నట్టు చెప్పారు. మారుతున్న వాతావరణం నేపథ్యంలో యాజమాన్యాలు ప్రత్యక్ష నైపుణ్యాలు, అప్పగించిన పనిని వేగంగా చేయగలిగే సామర్థ్యాలను అభ్యర్థుల్లో చూస్తున్నట్టు తెలిపారు. సంభాషణ, క్రిటికల్ థింకింగ్, సమస్యల పరిష్కారం, సృజనాత్మకత, ఉద్యోగం చేయడానికి సన్నద్ధతపై ఉద్యోగార్థులు దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. డేటా ఆధారిత సామర్థ్యాల గుర్తింపు, ఇంటర్న్‌షిప్‌లు, చేపట్టిన ప్రాజెక్టుల ఆధారంగా వారి సన్నద్ధతను యాజమాన్యాలు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యా సంస్థలతో కలసి కరిక్యులమ్ రూపొందించడం, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా నైపుణ్యాల కొరత నేపథ్యంలో విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారం, సమన్వయంతో గ్రాడ్యుయేట్లు పని ప్రదేశాల్లో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందన్నారు. ఐఐటీ ఢిల్లీలో ఐఎన్‌ఏఈ–ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు.. పరిశోధన, ఆవిష్కరణలపై ఐఐటీ హైదరాబాద్–రెనెసెస్ మధ్య భాగస్వామ్యాలను శర్మ ప్రస్తావించారు. ప్రభుత్వం సైతం ఉద్యోగ అర్హతలను మెరుగుపరచడంపై దృష్టి సారించిందని.. నేషనల్ అప్రెంటిస్íÙప్ ప్రమోషన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టిందని చెప్పారు. దీని కింద 2023–24లో 9.3 లక్షల అభ్యర్థులను చేరుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 46 లక్షల మంది అప్రెంటిస్íÙప్ల లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. -
బీమా సుగమ్.. వీలైనంత త్వరలో
ముంబై: బీమా సుగమ్ పేరుతో ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఆగస్ట్ నాటికి ఇది వస్తుందనుకోగా, అంతకంటే ఎక్కువ సమయం తీసుకోనుందని తాజా సమాచారం. దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే పనిలో బీమా రంగ అభివృద్ధి నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ఉంది. బీమా సుగంతో దేశంలో బీమా సేవల విస్తరణ పెరుగుతుందని, క్లెయిమ్‌ల ప్రక్రియ మరింత సులభంగా మారుతుందని భావిస్తున్నారు. బీమా సుగమ్ ప్రారంభమైతే బీమా కంపెనీలు దీని ద్వారా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు పాలసీల కొనుగోలు, క్లెయిమ్‌లు సహా అన్ని రకాల సేవలను ఒకే వేదికగా పొందొచ్చు. శుక్రవారం ముంబైలో ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏబీఏఐ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీమా సుగం ఎంతో క్లిష్టమైన ప్రాజెక్ట్ అని, కస్టమర్‌కు అన్ని రకాల ఎంపికలను ఒకే వేదికంగా అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఎలాంటి సమస్యల్లేని విధంగా ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. హెల్త్ క్లెయిమ్స్ ఎక్సే్ఛంజ్ ఏర్పాటుపైనా ఐఆర్డీఏఐ దృష్టి పెట్టింది. దీన్ని వేగంగా తీసుకొచ్చేందుకు సాధారణ బీమా సంస్థల సీఈవోలతో మాట్లాడినట్టు పాండా తెలిపారు. సమయం ఆదా బీమా సుగమ్‌తో సమయం ఆదా అవుతుందని పాండా చెప్పారు. బీమా సంస్థలకు క్లెయిమ్‌ల ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. పాలసీదారులు, ఆస్పత్రులు ఆన్లైన్లోనే క్లెయిమ్ పురోగతిని ట్రాక్ చేసుకోవచ్చని చెప్పారు. -
బీమా కంపెనీలు లిస్టింగ్‌కు వెళ్లాలి!
ముంబై: పెట్టుబడులను సులభంగా సమీకరించేందుకు వీలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను పరిశీలించవచ్చని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ చైర్మన్ దేవాశిష్ పాండా పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూలు చేపట్టడం ద్వారా బీమా కంపెనీలు లిస్టింగును సాధించవచ్చని తెలియజేశారు. దీంతో బిజినెస్‌లో వృద్ధి అవకాశాలకు వీలుగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు. అంతేకాకుండా దేశీయంగా బీమా విస్తృతికి సైతం లిస్టింగ్స్ దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. బీమా రంగ కంపెనీలను ఐపీవోలకు వెళ్లవలసిందిగా సూచిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి వస్తే మార్కెట్లో 60 శాతం లిస్టయినట్లేనని వ్యాఖ్యానించారు. ఇది అత్యధిక పారదర్శకత, సమాచార వెల్లడికి దారి చూపుతుందని పేర్కొన్నారు. కంపెనీలు మరింత పురోగమించడానికి లిస్టింగ్ దోహదపడుతుందని, అంతిమంగా ఇది బీమా రంగ వ్యాప్తికి కారణమవుతుందని వివరించారు. ఐఆర్డీఏ చైర్మన్‌గా పాండా గత నెలలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బీమా రంగ సంస్థలతో రెండు రోజులుగా ఇక్కడ పాండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రూ.100 కోట్ల ప్రవేశ నిబంధన ఎత్తివేయాలి బీమా వ్యాపారం ప్రారంభించేందుకు కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పరిమితిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉన్నట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా తెలిపారు. ప్రస్తుత నిబంధన సదుపాయ కల్పన కంటే అడ్డంకిగా ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు ప్రవేశానికి వీలుగా పరిమితిని ఎత్తివేయడం లేదా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించండి ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు ఐఆర్డీఏ ఆదేశం సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించాలంటూ మూడు ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌ను ఐఆర్డీఏ ఆదేశించింది. ఈ మూడు ప్రభుత్వరంగ బీమా సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు సంబంధించి కొంత సమాచారాన్ని ప్రభుత్వం కోరిందని, దాన్ని అందించినట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ పాండా తెలిపారు. ఆయా సంస్థలకు ప్రభుత్వం నిధులను అందించే అవకాశం ఉందన్నారు. ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా, ఇతర సీనియర్ అధికారులు, సభ్యులు, బీమా సంస్థల ఉన్నతాధికారుల సమావేశం గురువారం ముంబైలో జరిగింది. -
కళ: త్రీ ఇన్ వన్... నెంబర్‌వన్!
కథలు కంచికి పోతాయో లేదో తెలియదుగానీ...కాసేపు ఆలోచిస్తే మన దగ్గరికే నడిచొస్తాయి అని చిత్ర చరిత్ర చెబుతూనే ఉంది. ఒక చిత్రం మొదలు కావాలంటే డైరెక్టర్ బౌండ్ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతాడు. ఈ చిత్రం విషయంలో మాత్రం అలా జరగలేదు. ‘ఈ సబ్జెక్ట్ అనుకుంటున్నాను. మీరు మీ అనుభవాలు చెప్పండి చాలు స్క్రిప్ట్ రాసుకుంటాను’ అన్నాడు డైరెక్టర్ దేవాశిష్ మహ్కిజ. అన్నపూర్ణ సోని, భూమిక దూబె, ఈప్సిత చక్రవర్తి... అనే ఈ ముగ్గురు మహిళలు తమ అనుభవాలను చెప్పడమే కాదు రచన సహకారం అందించి, నటించి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. దేశీయంగానే కాదు, అంతర్జాతీయస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న లఘు చిత్రం చీపటాకదుంప. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ షార్ట్‌ఫిల్మ్ తెగ నవ్విస్తుంది. అయితే ఇదేమీ హాస్యచిత్రం కాదు. నవ్విస్తూనే ఆలోచనలు రేకెత్తించే చిత్రం. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ఇటీవల ‘జెండర్ సెన్సిటివిటీ’ అవార్డ్ గెలుచుకుంది. ‘పురుషులు ఇలాంటి దుస్తులు ధరించాలి. స్త్రీలు ఇలాంటి దుస్తులు మాత్రమే ధరించాలి. పురుషుల నడక ఇలా ఉండాలి. స్త్రీల నడక ఇలా మాత్రమే ఉండాలి....’ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు ఉండదు. ‘జెండర్ సెన్సిటివిటీ’ స్పృహతో మన ఆలోచనల్లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ప్రతిబింబించే చిత్రం ఇది. ‘చీపటాకదుంప’ అనేది దాగుడుమూతల్లాంటి ఒక ఆట. ఈ చిత్రానికి మూలస్తంభాలుగా నిలిచిన ముగ్గురు మహిళల గురించి... మధ్యప్రదేశ్‌లోని బర్త్ అనే చిన్న టౌన్‌కు చెందిన అన్నపూర్ణ సోని జబల్పూర్లో మ్యూజిక్కోర్సు చేసింది. సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, మైమ్...ఇలా ఎన్నో విద్యల్లో ప్రతిభ చూపేది. స్థానిక ‘వివేచన రంగ్మండల్’ అనే నాటక సంస్థలో చేరిన కొత్తలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) గురించి గొప్పగా విన్నది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో సీటు గెలుచుకుంది. ఇక ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముంబై యూనివర్శిటీలో మాస్ మీడియాలో పట్టా పుచ్చుకుంది భూమిక దూబె. ఎన్ఎస్డీ స్టూడెంట్. గొప్ప నాటక దర్శకులతో కలిసి పనిచేసింది. ఎన్నో లఘు చిత్రాలలో నటించింది. అవార్డ్లు గెలుచుకుంది. ‘చీపటాకదుంప’ చిత్రానికి దూబె కో–ప్రొడ్యూసర్, కాస్టింగ్ డైరెక్టర్. ‘నా మీద నాకు నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పెంచిన చిత్రం ఇది’ అంటున్న భూమిక దూబె మరిన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనుకుంటోంది. ఈప్సిత చక్రవర్తి నటిగానే కాదు స్క్రీన్ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎన్ఎస్డీ స్టూడెంట్. కథలు, నవలలను నాటకాలుగా మలచడం అంటే ఇష్టం. విలియమ్ షేక్స్పియర్ ‘ఎ మిడ్నైట్ సమ్మర్ డ్రీమ్’ను ‘కసుమాల్ సప్నో’గా స్థానికీకరించి రాజస్థాన్‌లో ఇచ్చిన ప్రదర్శనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘ఉజాగర్ డ్రామటిక్ అసోసియేషన్’ (ముంబై) అనే థియేటర్ గ్రూప్ వ్యవస్థాపకురాలు. తాజా విషయం ఈ ముగ్గురు ‘చీపటాకదుంప’ దగ్గర మాత్రమే ఆగిపోవాలనుకోవడం లేదు. మహిళలకు సంబంధించిన విభిన్న కోణాలకు కళారూపం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కరి ఆలోచనలు బాగుంటాయి. ఆ ఒక్కరికి మరో ఇద్దరి ఆలోచనలు తోడైతే మరీ బాగుంటాయి అని చెప్పడానికి సంశయం ఎందుకు! -
శెభాష్ దేవాశిష్
భువనేశ్వర్: ఒడిశా సివిల్ సర్వీసెస్–2018 పరీక్షల్లో దేవాశిష్ పండా టాపర్‌గా నిలిచారు. సోమవారం ఈ ఫలితాలు వెల్లడించారు. ఆయన సుందర్‌గడ్ జిల్లా జకాయికలా గ్రామస్తుడు. రితుపర్ణ మహాపాత్రో ద్వితీయ టాపర్‌గా, ఆకాశ కుమార్ పండా తీయ టాపర్‌గా నిలిచారు. గ్రూపు ఎ, గ్రూపు బి సేవల్లో భర్తీ కోసం ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహించింది. గత ఏడాది డిసెంబరు 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన పర్సనాలిటీ పరీక్షల్లో 218 మంది అభ్యర్థుల్ని తాత్కాలికంగా ఎంపిక చేశారు. వారిలో 72 మంది యువతులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్ష ఉత్తీర్ణత ఫలితాల పూర్తి వివరాలు http://opsc.gov.in వెబ్ పోర్టల్‌లో ప్రసారం చేశారు. సుందర్‌గడ్ జిల్లా ప్రజలు దేవాశిష్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
దేవాశిష్‌కు కన్నీటి వీడ్కోలు
నారాయణగూడ క్రిస్టియన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు ముషీరాబాద్/అంబర్‌పేట/అఫ్జల్‌గంజ్: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి దేవాశిష్ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం జరిగాయి. బాగ్‌అంబర్‌పేట సెంట్రల్ ఎక్సైజ్‌కాలనీలోని అతని నివా సం నుంచి కింగ్‌కోఠిలోని క్రైస్తవ శ్మశానవాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో తోటి విద్యార్థులు, బంధుమిత్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాశిష్ శవపేటికను అతని తండ్రి, తమ్ముడు భుజాలపై ఎత్తుకొని తీసుకొచ్చారు. అంతకుముందుదేవాశిష్ బోస్ ఆత్మకు శాంతిచేకూరాలని అబిడ్స్‌లోని క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు దర్శించుకునేందుకు వీలు గా భౌతిక కాయాన్ని రెండు గంటల పాటు అక్కడే ఉంచారు. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమారుడు ఇలా విగత జీవిగా మారడాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారితోపాటు బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో శ్మశాన వాటికకు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు మాజీ మంత్రి కృష్ణయాదవ్, విద్యానగర్ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి దేవాశిష్ బోస్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.


