breaking news
Derogation
-
అవమాన బారం బరించలేక ఆత్మహత్య
చిగురుమామిడి(హుస్నాబాద్): తనపై అన్యాయంగా దొంగతనం నేరం మోపారని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని నవాబుపేటలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. పిన్‌రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి(35) కూరగాయలు విక్రయిస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఇతడికి మద్యం సేవించే అలవాటు ఉండడంతో ఈనెల 19 గ్రామంలోని ఓ బెల్టుషాపునకు వెళ్లి మద్యం తాగి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు బెల్టుషాపు యజమానికి కంది వేణు, అతడి తండ్రి అంజయ్యలు కలిసి శ్రీనివాస్‌రెడ్డిని ఇంటికి పిలి పించారు. తమ ఇంట్లో డబ్బులు పోయాయని, అది నువ్వే దొంగతనం చేశావని, పంచాయితీ పెడతామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. భయాందోళనకు గురైన శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త చావుకు కంది వేణు, అంజయ్యలు కారణమని శ్రీనివాస్‌రెడ్డి భార్య రమాదేవి, కుటుంబసభ్యు లు, బంధువులు మృతదేహంతో వారి ఇం టిఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు విరమించే పరిస్థితి లేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎం. సురేందర్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
ఒంగోలు: రాజ్యంగ నిర్మాత విగ్రహానికి అవమానం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెళ్లూరు సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు చెప్పులదండ వేశారు. ఇది గుర్తించిన దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఈ దుశ్ఛర్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. పోలీసులు నిందితులను పట్టుకుని శిక్షిస్తామని సర్ది చెప్పడంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు.