breaking news
crores of rupees property
-
82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?
బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. తన వృద్ధాప్య పింఛను విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లిన 82 ఏళ వృద్ధుడికి విచిత్ర అనుభవం ఎదురైంది. తన ఖాతాలో అనూహ్యంగా వందల కోట్ల రూపాయలు డబ్బు ఉండటం చూసి షాకయ్యాడు. అంతేకాదు ఆయన దివ్యాంగ కుమారుడి ఖాతాలో కూడా ఇదే తరహాలో భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉండటంతో విస్తుపోవడం వారి వంతైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.ఆ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం..పింఛను విత్డ్రాకామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లారు కామేశ్వర్ మిశ్రా అనే పెద్దాయన. పింఛను డబ్బులు తీసుకున్న తర్వాత, మిశ్రా తన ఖాతాలో ఉన్న మిగిలిన బ్యాలెన్స్ తనిఖీ చేసుకున్నారు. ఖాతాలో ఏకంగా రూ. 759,69,51,951 (దాదాపు రూ. 759 కోట్లు) బ్యాలెన్స్ చూపించడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. తనతో తోపాటు వచ్చిన దివ్యాగ కుమారుడి ఖాతాలో కూడా ఇదే తరహాలో భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించింది. ఈ రెండు ఖాతాల్లోని మొత్తం బ్యాలెన్స్ కలిపితే రూ. 1,500 కోట్లకు పైగానే ఉంది.ఇదీ చదవండి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్, తలలు పగిలాయ్!ఈ ఊహించని డబ్బును చూసి, ఆ కుటుంబంతో పాటు సిఎస్సి ఆపరేటర్ కూడా తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖాతాల్లోకి ఎలా వచ్చిందో తనకు అర్థం కావడం లేదని మిశ్రా పేర్కొన్నారు. ఈ విషయంపై బ్యాంక్ మరియు సంబంధిత అధికారులు విచారణ జరిపి, తప్పును సరిదిద్దాలని ఆయన కోరారు. ప్రభుత్వం, అధికారులు ఈ లోపాన్ని గుర్తించి సరిచేస్తారనే ఉద్దేశంతోనే తాను ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ వింత పరిణామం బ్యాంకింగ్ లేదా సాంకేతిక లోపం (టెక్నికల్ గ్లిచ్) వల్ల జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు, అయితే దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.గతంలో గయా జిల్లాలో కూడా గయా జిల్లాలోని దెల్హాలో కూడా ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, ఈ-రిక్షా డ్రైవర్ అయిన శివ్ కుమార్ పటేల్ ఖాతాలో ఇదే పద్ధతిలో రూ. 759 కోట్లు జమ అయ్యాయి. వైశాలి ,సమస్తిపూర్ జిల్లాలలో కూడా, కొంతమంది పెన్షనర్ల ఖాతాలలో రూ. 740 కోట్ల నిల్వలు కనిపించాయి. -
టెన్నిస్ కోర్ట్ లాకర్లలో కోట్ల సంపద
యశవంతపుర: బెంగళూరులోని బౌరింగ్ ఇన్స్టిట్యూట్ (టెన్నిస్ కోర్ట్) పాలకమండలి కార్యాలయంలో క్రీడాకారులు టెన్నిస్ సామగ్రి, దుస్తులు దాచుకునే లాకర్లలో రూ.100 కోట్లకు పైగా విలువైన సొత్తు బయటపడింది. ఇది బెంగళూరులో స్థిరపడిన రాజస్తానీ పారిశ్రామికవేత్త, ఫైనాన్షియర్, ప్రెస్టీజ్ కంపెనీ భాగస్వామి అయిన అవినాశ్ అమరలాల్కు చెందినదిగా గుర్తించారు. బెంగళూరులో టైర్ల షోరూంను నడుపుతున్న అవినాశ్ ఏడాది క్రితం ఇక్కడ మూడు లాకర్లను తీసుకుని వాటిల్లో రూ.3.60 కోట్ల నగదు, రూ.7.8 కోట్ల విలువైన వజ్రాలు, 650 గ్రాముల బంగారు బిస్కెట్లు, రూ.80 లక్షల విలువైన వాచీలు, రూ.100 కోట్ల ఆస్తి పత్రాలు, రూ.కోటి విలువైన చెక్కులను దాచాడు. ఎందుకు బద్దలు కొట్టారు? టెన్నిస్ కోర్టు అధికారులు లాకర్ గదుల నవీకరణలో భాగంగా అవినాశ్‌కు చెందిన మూడు లాకర్లను బద్దలు కొట్టి చూడగా ఈ సొత్తు బయట పడింది. విషయం బయటకు పొక్కకుండా చేస్తే రూ.5 కోట్లు ఇస్తామంటూ బౌరింగ్ క్లబ్ కార్యదర్శి ప్రకాశ్‌కు కొందరు వ్యక్తులు ఆశ చూపారు. అయితే, ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ఇది తమ పరిధిలోని విషయం కాదని ఖాకీలు చెప్పడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలిపారు. వారు వచ్చి సొత్తును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అవినాశ్ ఎందుకు స్పందించలేదు? పక్షం రోజుల క్రితం టెన్నిస్ కోర్టు యాజమాన్యం ఇచ్చిన నోటీసులకు అవినాశ్ స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత సొత్తును ఇక్కడే ఎందుకు దాచారనే అంశంపైన కూడా ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. అవినాశ్ అమరలాల్ ప్రెస్టీజ్ గ్రూప్‌లో భాగస్వామి. ఈయనకు ఫైనాన్షియర్‌గా బెంగళూరులో పెద్ద పేరుంది. బడా బాబులు, సంస్థలకు 30 శాతం వడ్డీపై అప్పులిచ్చేవాడు. -
కోట్లాది రూపాయిల ఆస్తులు కోల్పోయిన హీరో
చెన్నై : సీనియర్ నటుడు, యువ నటుడు గౌతమ్ కార్తీక్ తండ్రి అయిన కార్తీక్ కోట్లాది రూపాయల పూర్వీకుల ఆస్తులను కోల్పోయారు. కుటుంబంతో నివశిస్తున్న ఇంటిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే 1980-90 ప్రాంతంలో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో కార్తీక్. తెలుగులోను, అభినందన వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి పేరుగాంచారు. కార్తీక్ తండ్రి ముత్తురామన్ మంచి నటుడే. ఈయనకు స్థానిక ఆల్వార్‌పేటలో పలు వాణిజ్య భవనాలు ఉన్నాయి. వీటి విలువ కోట్లాది రూపాయలు ఉంటుంది. ముత్తురామన్ పూర్వీకుల ఇంట్లోనే కార్తీక్ కుటుంబం నివశిస్తోంది. ముత్తురామన్‌కు కార్తీక్‌తోపాటు మరో కొడుకు, కూతుళ్లు ఉన్నారు. కార్తీక్ కుటుంబ సభ్యుల మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చారుు. గొడవల కారణంగా కార్తీక్ ఇల్లు వదిలి బయటకు పోవలసి వచ్చింది. తన తండ్రి ఆస్తిలో తనకు భాగం ఉందని కార్తీక్ వాదించినప్పటికీ ఫలితం లేకపోరుుంది. కుటుంబ సభ్యుల మోసానికి గురయ్యానని కార్తీక్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వెలిబుచ్చారు. తనకు జరిగిన మోసం గురించి ఆయన న్యాయవాదుల సలహా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది.


