breaking news
Comprehensive family survey -2014
-
ఆ ఐదు శాతాన్నీ వదలం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే -2014 కార్యక్రమాన్ని సంపూర్ణం గావించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారంనాటి సర్వేతో జిల్లాలోని 8.59 లక్షల కుటుంబాలలో 95 శాతం మేర వివరాలు సేకరించినట్టు అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. జిల్లాలో దాదాపు 40 వేల కుటుంబాల వివ రాలు ఇంకా రాలేదని అధికారుల అంచనా. మొత్తం కుటుంబాల సంఖ్యలో ఇది కేవలం 5 శాతమే అయినా.. ఆ వివరాలను కూడా సేకరించాల్సిందేనని కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి భావిస్తున్నారు. వదిలివేసిన ఇళ్లపై ప్రత్యేక చొరవ తీసుకుని మాపప్ సర్వే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ఇళ్లంటినీ మళ్లీ ఒకేరోజు సర్వే చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, మాపప్ సర్వే పరిమితంగా నిర్వహించనున్నట్టు సమాచారం. కేవలం స్టిక్కర్లు వేసి.. సర్వే చేయని ఇళ్లకు మాత్రమే మళ్లీ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరిస్తారని చెపుతున్నారు. మరోవైపు సర్వేలో భాగంగా సేకరించిన వివరాలను నిక్షిప్తం చేసే ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాలను ఏర్పాటు చేసి ఆన్లైన్ ఫార్మాట్లో డేటా ఎంట్రీ చేయనున్నారు. ఇందుకోసం కళాశాలల విద్యార్థులు, కొందరు ప్రభుత్వ సిబ్బంది, అధికారులను కూడా వినియోగించుకోనున్నారు. కొనసాగిన ఆందోళనలు.. సర్వేలో భాగంగా తమ కుటుంబ వివరాలు సేకరించలేదని, స్టిక్కర్లు ఇచ్చి కూడా సర్వేకు రాలేదని వేలాది మంది ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. బుధవారం ఉదయం కొందరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అయితే, వారి వద్దకు వచ్చిన కలెక్టర్ సావధానంగా వారి మాటలు విని, స్టిక్కర్లు వేసిన ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని చెప్పారు. ఈ ఫిర్యాదులు పరంపర సాయంత్రం వరకూ కొనసాగింది. తహశీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ప్రజలు వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేశారు. కాగా, అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించిన జిల్లా యంత్రాంగం జిల్లాలో ఇంకా 5 శాతం కుటుంబాల వారిని సర్వే చేయకుండా మిగిలిపోయినట్టు గుర్తించింది. వీరందరికీ ప్రత్యేకంగా ఒక రోజు సర్వే చేస్తామని, సర్వే సమాచారాన్ని వారి మొబైల్ఫోన్లకు పంపుతామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని జిల్లా యంత్రాంగం చెపుతోంది. -
ఆధార్.. పరేషాన్
మంచిర్యాల సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే-2014లో ఆధార్ కార్డు వివరాలు సేకరించనుండడంతో జిల్లావాసులు పునరాలోచనలో పడ్డారు. జిల్లాలో నేటికీ 20 శాతం మంది ప్రజలకు ఆధార్ కార్డులు లేవు. సర్వే అంశాల్లో 21వ కాలంలో ఆధార్ కార్డు సంఖ్య వివరాలు నమోదు చేయాలని ఉంది. తెల్లవారితే ఎన్యూమరేటర్లు ఇంటిముందు వాలుతారు. అన్ని వివరాలు చెప్పినా ఆధార్ కార్డు అడిగితే ఏమని చెప్పాలి? అనే ప్రశ్న పలువురిని తొలుస్తోంది. జిల్లా వాసుల్లో కొందరు నాలుగైదు దఫాలుగా ఐరిస్ ఫొటో దిగినా కార్డు అందలేదు. మరికొందరివి తిరస్కరణకు గురయ్యాయి. ఇంకొందరివి పోస్టల్ ఆలస్యంతో చేతికందలేదు. పలువురికి సాంకేతిక కారణాలతో అందలేదు. ఇలా ఏదో ఒక కారణంతో ఆధార్ కార్డు రాకపోవడంతో మంగళవారం నిర్వహించే సర్వేలో పలు కుటుంబాల సభ్యులు ఇబ్బం దులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థానికంగా ఉండక మరో ప్రాంతానికి ఉపాధి నిమిత్తం వెళ్లినవారు సైతం ఆధార్ కార్డు లేక సర్వే సందర్భంగా అవ స్థలు పడనున్నారు. అర్హులై ఉండి ఆధార్ కార్డు లేనివారు సంక్షేమ పథకాలకు దూరమవుతామనే ఆందోళనకు గురవుతున్నారు. శ్రావణమాసంలో పండుగ సెలవులకు ఆదివారాలు తోడు కావడంతో పోస్టల్ ఆలస్యం అవుతోంది. ఎప్పుడో ఆధార్ ఫొటో దిగినవారు ఇప్పుడు అవసరం రావడంతో మళ్లీ ఆధార్ కేంద్రం, మీసేవ, పోస్ట్మన్ చుట్టూ తిరుగుతున్నారు. సాం కేతిక కారణాలకు విద్యుత్ కోతలు తోడవడంతో సకాలంలో ఆధార్ కేంద్రాల్లో పనులు పూర్తికావడంలేదనే అభిప్రాయాలు ఉన్నా యి. ఆధార్ కార్డు కుటుంబంలో కొందరికి వచ్చి, మరి కొందరికి రాకపోవడం కూ డా సమస్యగా మారింది.