గిన్నిస్ బుక్ లో డాక్టర్ మంజులకు స్థానం
హైదరాబాద్: ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజుల అనగానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్లో బుధవారం అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15న ఆస్పత్రిలో 40 ఏళ్ల రోగికి డాక్టర్ మంజుల అనగాని వైద్య బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి 84 ఫైబ్రాయిడ్స్(కణితి/గడ్డ)లను తొలగించారు. వీటి బరువు 4 కేజీలు. ఇదివరకు 1.07 కేజీల బరువు గల గడ్డలను తొలగించారు. 4 కేజీల కణితులను తొలగించి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కృష్ణ, డాక్టర్ శరత్‌రెడ్డి పాల్గొన్నారు.