breaking news
Company recognized
-
రాజకీయ ఒత్తిళ్లు.. దళారులు
అండదండలందించిన అధికారులు ఇందిరమ్మ ఇళ్లలో వీరిదే పాత్ర అక్రమాలపై తీగ లాగుతున్న సీఐడీ క్షేత్రస్థాయి విచారణ రికార్డులు స్వాధీనం వరంగల్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాజ కీయ నాయకుల ఒత్తిళ్లు, మధ్య దళారుల హవా కొనసాగింది. స్థానిక అధికారులు చేయూత నివ్వడంతో యధేచ్ఛగా వ్యవహరించారు. ఇక్కడే అక్రమాలకు తెరలేచినట్లు భావిస్తున్నారు. ఇదంతా ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయనే ఆం దోళన నెలకొంది. ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులెవరనే కూపీ లాగేందుకు సీబీసీఐడీ రం గంలోకి దిగడంతో ఒక్కొక్కటి వెలుగు చూ స్తోంది. కొందరు అధికారులైతే ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమా లు జరిగినట్లు గుర్తించినట్లు ప్రకటించిన విష యం తెలిసిందే. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించడంతో జిల్లాలో కేసు నమోదు చేసిన అధికారులు విచారణ ప్రారంభించారు. 2007 -14 వరకు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై కూపీ లాగుతున్నారు. సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించడానికి ముందే జిల్లాలో ఎక్కడ ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయో ప్రాథమిక సమాచారం సేకరించారు. ఇంటింటికి తిరిగి విచారణ చేపట్టలేనందున పక్కా ప్రణాళికతో అక్రమాలకు పాల్పడిన గ్రామాలను ఎంచుకుని క్షేత్రస్థాయి విచారణ ప్రారంభించారు. ముందుగా అధికారులను కలిసి, రికార్డులు స్వాధీనం చేసుకుంటున్నారు. తదుపరి క్షేత్రస్థాయిలో పరిశీ లన చేస్తున్నారు. అవసరమైతే లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. రంగంలోకి ప్రత్యేక బృందం సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐ విజయకుమార్, ఎస్సై మధుసూదన్‌రెడ్డి బృందం పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. అవసరమైన వివరాలను అధికారుల నుంచి తీసుకుంటున్నారు. జిల్లాలోని నర్సింహులపే ట మండలం నుంచి తమ విచారణను ప్రారంభించింది. ఈ మండల పరిధిలోని పెద్ద నాగారంలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై గతంలోనే కేసులు నమోదు చేశారు. ఇం దులో మధ్య దళారీలు. కొందరు అధికారులు ఉన్నారు. నాగారంతోపాటు కౌసల్యాదేవీపల్లి గ్రామాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణ లు వెల్లువెత్తడంతో ఇక్కడి నుంచి పనిని ప్రారంభించారు. అవకతవకలు జరిగిన ప్రాం తాల్లో నియోజకవర్గానికి రెండు గ్రామాలను ఎంపిక చేసి ఈ విచారణను చేపట్టారు. మొగుళ్లపల్లి మండలం కుంకిశాల, శాయంపేట మం డలం మైలారంలో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ చేపట్టారు. పరిస్థితిని పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు కౌసల్యాదేవిపల్లిలో తాజాగా మరోసారి పరిశీలన చేశారు. సీఐడీ గుప్పిట రికార్డులు ఇళ్ల నిర్మాణాల అక్రమాలకు సంబంధించిన పూర్తిస్థాయి రికార్డులను సీఐడీ స్వాధీనం చేసుకుంది. అవసరమైన రికార్డులు అందజేయాలని అధికారులకు స్పష్టం చేస్తున్నది. నర్సిం హులపేట, శాయంపేట, మొగుళ్లపల్లి మండలాల పరిధిలోని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. ఇందిరమ్మ గృహాల వివరాలు, గ్రామసభల్లో ఎంపికైన జాబితా, జిల్లా కలెక్టర్‌కు పంపిన జాబితా, మంజూరైన జాబితా వివరాలు కావాలని సంబంధిత అధికారులను అడిగారు. ఎంబీ, పోజిషన్, బ్యాంక్ అకౌం ట్లు, స్టేజీ రికార్డులు, పేమెంట్ రిలీజ్ ఆర్డర్, సిమెంట్ వివరాలు, ఆ సమయంలో పనిచేసిన ఎంహెచ్ఓల జాబితా, వర్క్ఇన్స్పెక్టర్లు, గ్రా మైక్య సంఘాల పంపిణీ వివరాలు తీసుకున్నా రు. కాగా, సీఐడీ విచారణ చేపట్టిన గ్రామాల్లో పెద్దనాగారంలో 1,512 ఇళ్లు మంజూర య్యా యి. ఇందులో 1,514 ఇళ్లకు ఇప్పటికే బిల్లులు మంజూరయ్యాయి. కౌసల్యాదేవిపల్లిలో 433 ఇళ్లు మంజూరయ్యాయి. కుంకిశాలలో 283 ఇళ్లకు 265 నిర్మాణం జరిగినట్లు రికార్డుల్లో ఉన్నాయి. మైలారంలో 155 ఇళ్లకు సంబంధించి అవకతవకలపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇళ్లు కట్టకుండానే బిల్లులు తీసుకున్నవారు, పాత ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారు, కొందరు రెండు, మూడు ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారున్నట్లు తేలినట్లు సమాచారం. కొందరైతే లబ్ధిదారులు లేకుండానే బిల్లులు కాజేసినట్లు వెలుగు చూస్తున్నది. వీటిపై సీఐడీ నజర్ వేసింది. అధికారుల్లో ఆందోళన సీఐడీ విచారణతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. 2007-09 సమయంలో ఎంహెచ్‌ఓలుగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో రాజకీయ నా యకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఇతరత్రా కారణాలతో ఇళ్ల బిల్లులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. బిల్లుల చెల్లింపు బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించిన సమయంలోనూ అవకతవకలు జరిగినట్లు భావిస్తున్నా రు. అప్పటి ప్రజాప్రతినిధులను కాదని విధు లు నిర్వర్తించే పరిస్థితులు లేకపోవడంతో తలలూపాల్సి వచ్చిందని చెబుతున్నప్పటికీ అ క్రమాలకు కొందరు అధికారులు ఊతమిచ్చారనే ఆరోపణలున్నాయి. సీఐడీ విచారణలో తేలిన అంశాలకు సంబందించిన నివేదికలు ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు సమాచారం. విచారణ కొనసాగుతోంది : డీఎస్పీ సంజీవ్‌కుమార్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టామని సీఐడీ డీఎస్సీ సంజీవ్‌కుమార్ చెప్పారు. పెద్దనాగారం, కౌసల్యాదేవిపల్లి, కుంకిశాల, మైలారం గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించినట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక స్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు, వాస్తవాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. రికార్డులు, గ్రామాల్లో ఇళ్ల పరిశీలన, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నామన్నారు. విచారణలో అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామన్నారు. -
కొనసాగుతున్న సీఐడీ విచారణ
కౌంసల్యదేవిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన ఏడు బృందాలుగా విడిపోరు తనిఖీలు దళారులే మింగారని లబ్ధిదారుల ఏకరువు నర్సింహులపేట : ఇందిరమ్మ ఇళ్ల పథకం లో అక్రమాలపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. నర్సింహులపేట మండలంలోని కౌంసల్యదేవిపల్లి గ్రామంలో అధికారులు శనివారం విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ సారథ్యంలో ఏడు బృందాలు గ్రామంలో కలియతిరిగి తనిఖీ లు నిర్వహించారుు. అధికారులు నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారు నిర్మించుకు న్న, నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించా రు. ఇంటి పొజిషన్, రేషన్‌కార్డు, బిల్లు ఎం తవరకు వచ్చింది, ఎవరైనా మధ్యన ఉండి ఇప్పించారా, మొత్తం బిల్లు వచ్చిందా, సిమెంట్ ఎంత వచ్చిందనే అంశాలపై ఆరా తీశారు. బ్యాంక్ పాసు బుక్కులను సైతం పరిశీలించారు. దళారులు పైరవీలు చేశారని, మొత్తం డబ్బులు ఇవ్వలేదని, అందు కే నిర్మాణాలు పూర్తి చేయలేకపోయామని అధికారులకు లబ్ధిదారులు వివరించారు. గ్రామంలో ఏడుగురుకు పైగా దళారుల పేర్లను లబ్ధిదారులు సీఐడీ అధికారులకు చెప్పిన ట్లు సమాచారం. కాగా, సీఐడీ అధికారులు తనిఖీకి వస్తున్నట్లుగా గ్రామంలో శుక్రవారం దండోరా వేయించారు. అరుునప్పటికీ కొంత మంది ఇళ్లల్లో లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు వారిపై దృష్టిసారించినట్లు తెలిసింది. మండలంలో కౌంసల్యదేవిపల్లితోపాటు పెద్దనాగారంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దళారులతోపాటు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నారుు. అక్రమార్కులపై చర్యలు తప్పవు.. ఇందిరమ్మ పథకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని సీఐడీ డీఎ స్పీ సంజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. విచారణ అనంతరం సాయంత్రం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్హత లేని వారికి, ఊరిలో లేని వారికి, మతిస్థిమితం లేని వారికి , చనిపోయిన వారి పేర్ల మీద, పాత ఇళ్లపై, బినామీ పేర్లపై బిల్లులు కాజేసినట్లు గుర్తించామన్నారు. ఒకే కార్డు, ఒకే అకౌం ట్‌పై రెండు బిల్లులు వచ్చినట్లు కూడా విచారణలో తేలిందని చెప్పారు. గ్రామం లో 433 ఇళ్లకు.. మొదటిరోజు 172 ఇళ్ల పరిశీలన పూర్తరుుందని, పూర్తి స్థాయిలో వివరాలను సేకరించినట్లు వెల్లడించారు. మిగతా ఇళ్లను మరో రోజు తనిఖీ చేస్తామన్నారు. దళారులే మింగినట్లు చాలా మంది చెప్పారని, సమగ్ర విచారణ అనంతరం అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో సీఐడీ సీఐలు విజయ్‌కుమార్, రాజేంద్రప్రసాద్, మోహన్, కురవి సీఐ కరుణాసాగర్‌రెడ్డి, ఇద్దరు ఎస్సైలు, అ రుగురు హెచ్‌సీలు, హౌసింగ్ ఏఈ రామచంద్రు, ఇద్దరుసూపర్వైజర్లు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ అక్రమాలపై విచారణ
హాలియా/దేవరకొండ: గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిని నిగ్గుతేల్చేందుకు జిల్లాలో సీబీసీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం హాలియా, దేవరకొండలలోని హౌసింగ్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. హాలియా మండలంలోని కొత్తపల్లి, చల్మారెడ్డిగూడెం గ్రామాల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో ఇందిరమ్మ పథకంలో నిధుల దుర్వినియోగం జరిగిందని జిల్లా హౌసింగ్ పీడీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు తెలిపారు. ఆయా గ్రామాల్లో 2004 నుంచి 2014 వరకు మంజూరైన ఇళ్లను, వాటి నిర్మాణాలను పరిశీలిస్తామన్నారు. ఇళ్లను నిర్మించకుండా బిల్లులు కాజేసిన వారిపైన, బినామీ వ్యక్తులపై బిల్లులు కాజేసిన వారిపైన, అందుకు సహకరించిన అధికారులపైన ప్రభుత్వం చర్య తీసుకుంటుందని వివరించారు. ఇందుకోసం ఆయా గ్రామాల్లో హౌసింగ్ అధికారులు చేసిన ఎంబీ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 11 నుంచి గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట సీబీసీఐడీ ఎస్ఐలు రాజనర్సింహ, తిరపతిరావు తదితరులు ఉన్నారు. దేవరకొండలో.. సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు ఆధ్వర్యంలోని బృందం దేవరకొండ కార్యాలయంలో కూడా రికార్డులు పరిశీలించింది. బృందం సభ్యులు కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారం, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.